Warangal

News May 4, 2024

కూరగాయలు, పండ్లు అమ్మిన కడియం కావ్య

image

కాజీపేట, రహమాత్‌నగర్ చౌరస్తాలో శనివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డా.కడియం కావ్య ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే వ్యాపారులను, రైతులను కలిశారు. ఈ ఎన్నికల్లో తనకే ఓటు వేయాలని వారిని కోరారు. అనంతరం మార్కెట్లో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అమ్మారు.

News May 4, 2024

ఎండీ కావ్య కావాలి.. కడియం కావ్య ఎలా అవుతుంది?: ఆరూరి

image

హన్మకొండ జిల్లా దామెరలో నిర్వహించిన ప్రచారంలో వరంగల్ BJP ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్.. కడియం కావ్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రి ఎమ్మెల్యే, బిడ్డ ఎంపీనా? ఇవేమైనా రాజరికమా అని ఎమ్మెల్యే కడియంను ఉద్దేశించి మాట్లాడారు. ముస్లింను పెళ్లి చేసుకున్న ఆమె కడియం కావ్య ఎలా అవుతుందని, ఎండీ కావ్య అవుందని మండిపడ్డారు. NTR, KCR, చంద్రబాబులను వెన్నుపోటు పొడిచిన ఘనత కడియం శ్రీహరిదన్నారు.

News May 4, 2024

WGL: రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపు (REWIND)

image

లోక్‌సభ ఎన్నికలు మరో వారం రోజులుండగానే.. ఇటీవల ఖాళీ అయిన నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ ఎమ్మెల్సీ ఎన్నిక సందడి మొదలైంది. కాగా, 2021లో గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా గెలవడంతో తాజా ఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికల్లో గెలుపుకోసం 1,83,167 ఓట్లు అవసరం కాగా మొదటి ప్రాధాన్యతా ఓట్లలో ఎవరికీ 50శాతానికి మించి రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లతో పల్లా గెలిచారు.

News May 4, 2024

WGL: కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫిక్స్.. BJP నుంచి అతనేనా..?

image

WGL-NLG-KMM పట్టభద్రుల MLC నామినేషన్ల స్వీకరణ మొదలైంది. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేయగా.. BRS తమ అభ్యర్థిగా వరంగల్‌కు చెందిన రాకేష్ రెడ్డిని ప్రకటించింది. BJP నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి, గతంలో ఈ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. మూడు పార్టీలు గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

News May 4, 2024

BREAKING.. హన్మకొండ జిల్లాలో దారుణం

image

హన్మకొండ జిల్లా దామెర మండలం ఉరుగొండలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఆడ శిశువును పూడ్చిపెట్టారు. గమనించిన స్థానికులు మట్టి తొలగించి శుశువును బయటకు తీశారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 4, 2024

BHPL: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

image

హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. ఎస్సై శ్రీలత వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లికి చెందిన సాయి అశ్రిత రెడ్డి(22) మాదాపూర్‌లోని ప్రైవేటు హాస్టల్లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. గురువారం తన స్నేహితురాలి వద్దకు వచ్చి, తిరుగు ప్రయాణంలో ర్యాపిడో బుక్ చేసుకుంది. రాత్రి 12.30 గంటల సమయంలో జేఎన్టీయూ సిగ్నల్ వద్దకు రాగానే లారీ ఢీకొని మృతి చెందింది.

News May 4, 2024

ఉమ్మడి వరంగల్ నుంచి 29 మంది మావోయిస్టులు

image

ఉమ్మడి WGL జిల్లా నుంచి పీపుల్స్‌వార్ ఉద్యమంలో చేరి కీలక పదవులను చేపట్టిన మావోయిస్టులు క్రమంగా పట్టును కోల్పోతున్నారు. WGL కమిషనరేట్ పరిధిలోని 70 మంది మావోయిస్టుల్లో 31 మంది లొంగిపోయారు. మిగతా 20 మంది ఎన్కౌంటర్లు, అనారోగ్యంతో మరణించారు. 19 మంది ప్రస్తుతం పలు హోదాల్లో ఉన్నారు. BHPL, ములుగు జిల్లాకు చెందిన వారు ఐదుగురు చొప్పున ఉన్నారు. అంటే ఉమ్మడి జిల్లా నుంచి 29 మంది మావోయిస్టు పార్టీలో ఉన్నారు.

News May 4, 2024

ఎనుమాముల మార్కెట్‌కు 2 రోజుల సెలవు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు, రేపు 2 రోజులు సెలవులు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. నేడు వారాంతపు యార్డు బంద్, రేపు (ఆదివారం) సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కు సరుకులు తీసుకుని రావద్దని సూచించారు.

News May 3, 2024

8న వరంగల్‌కు ప్రధాని మోదీ

image

ఈ నెల 8న వరంగల్ జిల్లాకు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. ఈ నేపథ్యంలో తిమ్మాపూర్(మామునూర్) సమీపంలోని సభ వేదిక వద్ద ఏర్పాట్లను ఎంపీ అభ్యర్థి ఆరూరీ రమేశ్, ఇతర నేతలు పరిశీలించారు. బహిరంగ సభకు వరంగల్ పరిధిలోని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆరూరి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

News May 3, 2024

మల్లూరులో 46℃ డిగ్రీల ఉష్ణోగ్రత

image

ములుగు జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం మంగపేట మండలం మల్లూరులో 46℃ డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. వెంకటాపురం 46℃, ధర్మవరం 45℃, మేడారం 45℃, మంగపేట 45℃, ఆలుబాక 45℃ డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఎండలు, ఉక్కపోతతో జిల్లాలో ప్రజలు బయటికి వెళ్లాలంటే జంకుతున్నారు. పలు ప్రాంతాల్లో ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి.

error: Content is protected !!