Warangal

News May 3, 2024

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో శుక్రవారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటా రూ.17,700 పలకగా, 341 రకం మిర్చి రూ.16వేల ధర వచ్చింది. అలాగే వండర్ హాట్(WH) రకం మిర్చి రూ.14వేలు, 5531 రకం మిర్చికి రూ.12 వేల ధర వచ్చింది. టమాటా మిర్చికి నిన్న రూ.32,500 ధర రాగా ఈరోజు 31వేల ధర వచ్చింది.

News May 3, 2024

ఈ నెల 6న నర్సంపేటకు ఉత్తరాఖండ్ సీఎం

image

ఈ నెల 6న మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నర్సంపేటకి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వస్తున్నారు. ఈ సందర్భంగా BJP బహిరంగ సభ ఏర్పాట్లు గురించి, సభా ప్రాంగణం కోసం BJP వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ నర్సంపేటలో స్థల పరిశీలన చేశారు. 

News May 3, 2024

ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్

image

ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని హానుమకొండ కలెక్టర్ స్నిగ్ధ పట్నాయక్ అన్నారు. సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కలెక్టర్ ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జ్యోతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చిర్ర రాజు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

News May 3, 2024

వరంగల్: తల్లిపై కొడుకు దౌర్జన్యం

image

శాంతినగర్‌కు చెందిన భారతమ్మ(78) ఇంటిలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కుమారుడు మురళీకృష్ణ, కోడలు గాయత్రి, మనుమడు, మరో గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ఆమెను గట్టిగా పట్టుకొని బలవంతంగా నోటిలో గుర్తుతెలియని ద్రవం పోయడంతో స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత బీరువాలోని రూ.50 వేల నగదు, 4 తులాల బంగారు గాజులు అపహరించుకుపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

News May 3, 2024

వరంగల్: ఎన్‌కౌంటర్లో మావోయిస్టు సుష్మిత మృతి?

image

ఛత్తీస్‌గఢ్‌ నారాయణపూర్ జిల్లా టెక్మెట్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందింది HNK జిల్లా హసన్‌పర్తికి చెందిన తిక్క సుష్మిత కాదని కుటుంబీకులు తెలిపారు. ఎన్కౌంటర్లో సుష్మిత మృతి చెందినట్లు పోలీస్ వర్గాల సమాచారం మేరకు కుటుంబీకులు ఛత్తీస్‌గఢ్‌ వెళ్లారు. ఛత్తీస్‌గఢ్‌‌లో నారాయణపూర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచిన మృతదేహాన్ని పరిశీలించారు. ఆ మృతదేహం సుష్మితది కాదని వెనుదిరిగారు.

News May 2, 2024

భీమదేవరపల్లి: ఎన్ కౌంటర్‌లో వంగర వాసి మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్ మాడ్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌లో భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన కాశవేణి రవి అలియాస్ వినయ్ మృతి చెందాడు. కాగా, 33 ఏళ్ల క్రితం తన తండ్రి ఉపాధి నిమిత్తం మంచిర్యాలలో ఉండగా.. మావోయిస్టుల్లో చేరిన అనంతరం రవి డీసీఎం స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలో ఎన్ కౌంటర్‌లో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

News May 2, 2024

BHPL: బాలికను వేధించిన కేసులో వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష

image

బాలికను వేధించిన కేసులో ఓ వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ జిల్లా న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. మల్హర్ మండలం వళ్లెంకుంటకు చెందిన శ్రీకాంత్‌పై 2018లో కొయ్యూరు పోలీసు స్టేషన్లో బాలికను వేధించిన కేసు నమోదయింది. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. సుధీర్ఘ విచారణ అనంతరం నిందితుడికి జైలు శిక్ష ఖరారైంది.

News May 2, 2024

WGL: అంతర్జాతీయ క్రీడాపోటీలకు ఎంపికైన యోగేశ్వర్

image

వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన తిప్పాటి యోగేశ్వర్ అంతర్జాతీయ టార్గెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. గతేడాది అక్టోబర్‌లో షిరిడీలో జరిగిన జాతీయ క్రీడల్లో యోగేశ్వర్ ప్రతిభ కనబర్చారు. త్వరలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా టార్గెట్ బాల్ అసోసియేషన్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి రవికుమార్ తదితరులు అభినందించారు.

News May 2, 2024

వరంగల్: పెరిగిన పత్తి ధర

image

బుధవారం మేడే సెలవు అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం ప్రారంభం కాగా.. పత్తి తరలివచ్చింది. అయితే ధర మాత్రం మంగళవారంతో పోలిస్తే ఈరోజు రూ. 45 పెరిగింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,060 పలకగా.. ఈరోజు రూ.7,105కి చేరినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.

News May 2, 2024

వరంగల్: పెళ్లికావడంలేదని యువకుడి సూసైడ్

image

పెళ్లి కావడం లేదనే మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన గ్రేటర్ వరంగల్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 16వ డివిజన్ ధర్మారానికి చెందిన ఆటోడ్రైవర్ గోదాసి రజనీకాంత్(28) పెళ్లి కావడం లేదనే మనస్తాపంతో ఏప్రిల్ 24న పురుగుల మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడని తెలిపారు.

error: Content is protected !!