India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వివిధ రకాల మిర్చి ధరలు ఎలా ఉన్నాయి. నిన్న క్వింటా తేజ మిర్చి ధర రూ.14,200 ధర పలకగా.. నేడు రూ.14,000కి పడిపోయింది. అలాగే 341 రకం మిర్చికి సోమవారం రూ.14,100 ధర రాగా.. నేడు రూ. 14,600కి పెరిగింది. మరోవైపు వండర్ హాట్(WH) రకం మిర్చి నిన్న రూ.17,200 ధర పలకగా.. ఈరోజు రూ.16,800 ధర వచ్చిందని వ్యాపారులు తెలిపారు.
వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లేవారు, ఇతర పనులకు వెళ్లే జిల్లా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా 33 నుంచి 35 డిగ్రీలతో పాటు.. మేఘావృతమై ఉంటుందని, రేపు 33 నుంచి 36 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతవరణ సూచికలు చెబుతున్నాయి.
పథకాల అమలులో లీడర్ అయినా.. క్యాడర్ అయినా పైసల్ వసూలు చేస్తే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. నియోజకవర్గ ఇందిరమ్మ కమిటీ సభ్యులతో హనుమకొండలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఎక్కడైనా నిర్లక్ష్యం చేసినా, పైసలు వసూలు చేసినా సహించేది లేదని అన్నారు.
వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12,321 మంది విద్యార్థులు నేడు ఇంటర్ పరీక్ష రాయనున్నారు. ఫస్టియర్ 5,815, సెకండియర్‌లో 6,506 మంది విద్యార్థులు రాయనుండగా.. 26 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, బీఎన్ఎన్ఎస్ 163(144) చట్టం అమలులో ఉంటుందని సీపీ అంబర్ కిషోర్ ఘూ తెలిపారు. కాగా, పరీక్షకు 30 ని.మి.కు ముందే సెంటర్‌కు చేరుకోండి.
ALL THE BEST
వరంగల్ కమిషనరేట్ పరిధిలో నేటి నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల నుంచి 500 మీటర్ల పరిధిలో బీఎన్ఎన్ఎస్ 163 చట్టం అమలులో ఉంటుందన్నారు. నేటి నుంచి గుంపులుగా ఉండడం, ర్యాలీలు, సభలు, ధర్నాలు, సమావేశాలు నిర్వహించడం, ఊరేగింపులు చేయడం నిషేధించబడతాయని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
అప్పుల భారం భరించలేక పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గీసుగొండ సీఐ ఎ.మహేందర్ కథనం ప్రకారం.. మండలంలోని ఊకల్ హవేలీ గ్రామానికి చెందిన సాంబారి రాజు తన అవసరాల నిమిత్తం వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకొని తిరిగి చెల్లించలేక సోమవారం ఏదో పురుగుల మందు తాగగా వరంగల్ ఎంజీఎంకి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందగా మంగళవారం మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
నేరాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడం పోలీసు జాగిలాలు కీలకంగా నిలుస్తున్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు నూతనంగా వచ్చిన పోలీస్ జాగిలాలను సీపీ మంగళవారం పరిశీలించారు. గత నెల 28న పోలీస్ జాగిలాల శిక్షణా కేంద్రంలో 8 నెలల శిక్షణను పూర్తి చేసుకుని వచ్చిన 5 పోలీస్ జాగిలాలు వరంగల్ కమిషనరేట్ పోలీస్ డాగ్ స్వ్కాడ్‌లో చేరి విధులు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యాయి.
వరంగల్: నేడు మంచినీటి సరఫరాకు అంతరాయం☑️విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగొద్దని సీఎస్ శాంతకుమారి ఆదేశం☑️వర్ధన్నపేట: నీరు లేక ఎడారిగా మారుతున్న ఆకేరు వాగు☑️నల్లబెల్లి: నేషనల్ స్కాలర్షిప్‌కు ఎంపికైన విద్యార్థిని☑️వరంగల్‌కు కొత్త పోలీసు జాగిలాలు☑️వరంగల్ అతివేగంగా డివైడర్‌ని ఢీ కొట్టి వ్యక్తి మృతి☑️మామునూరు: ఎయిర్‌పోర్టు భూముల వద్ద ఉద్రిక్తత
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష 2025 నిర్వహణకు పరీక్ష కేంద్రాలను గుర్తించాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మే 4న జరిగే నీట్ పరీక్ష నిర్వహణ సెంటర్ల ఎంపిక, కనీస సౌకర్యాలు కల్పనపై కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ జిల్లా నుంచి 6,300 మంది విద్యార్థులు రాయడానికి అవసరమైన సెంటర్లు 20 గదుల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు లేదా కళాశాలను గుర్తించాలని ఆదేశించారు.
హసన్‌పర్తి మండలం కోమటిపల్లిలోని నిరూప్ నగర్ తండా సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఉనికిచర్ల ప్రధాన రహదారిపై ఈరోజు యాక్సిడెంట్ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన కడుగుల రవి(60) బైక్‌పై హనుమకొండ వెళ్తుండగా ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి కింద పడ్డాడు. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. కాగా గత ఆరు నెలల్లోనే సేమ్ ప్లేస్‌లో ఐదుగురు చనిపోవడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.