India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డోర్నకల్ పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన ఓ బాలికపై 2023 అక్టోబర్ 4న తేజావత్ రమేష్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాలిక తల్లి పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సీఐ ఉపేందర్, ఎస్సై ఝాన్సీ తేజావత్ రమేష్ పై కేసునమోదు చేశారు. తేజావత్ రమేష్ కు ఐదు సంవత్సరాల మూడు నెలల జైలుశిక్ష, రూ.11వేల జరిమానాను విధించినట్లు న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ తీర్పునిచ్చారు.
ఇటీవల పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా జనగామ పట్టణం గుండ్లగడ్డ ప్రాంతానికి చెందిన మహ్మద్ మోహినొద్దిన్ (52) రోజువారీ కూలిపనిలో భాగంగా బుధవారం బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఎండ తీవ్రతకు గురై సాయంత్రం ఇంటికి వచ్చి కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన జనగామ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
బతుకమ్మలు, కోలాటాలతో కేసీఆర్‌కు శ్రేణులు స్వాగతం పలికాయి. సభలో కేసీఆర్ 14 నిమిషాలు ప్రసంగించారు. మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ తాను స్వయంగా తయారుచేసిన అరిసెలు, గారెలు కేసీఆర్‌కు అందజేశారు. సభ ముగిశాక ఎంపీ కవిత, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, మాజీ ఎమ్మెల్యే హరిప్రియం బస్సుపై డ్యాన్స్ వేశారు. ఎంపీ కవిత నివాసానికి మొదటిసారి వచ్చిన కేసీఆర్‌కు కవిత మిత్రురాలు హారతి ఇచ్చి స్వాగతం పలికారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు (గురువారం) ప్రారంభం కానుంది. బుధవారం మేడే సందర్భంగా మార్కెట్ బంద్ ఉండగా గురువారం ఓపెన్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కావున రైతులు విషయాన్నీ గమనించి, నాణ్యమైన సరుకులు మార్కెట్‌కు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఎన్నికల నిర్వహణలో పోలింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. బుధవారం ఎల్.బి.కళాశాలలో ప్రిసైడింగ్ (పి.ఓ), అసిస్టెంట్ ప్రిసైడింగ్ (ఏ.పి.ఓ)లకు ఏర్పాటు చేసిన ఎన్నికల శిక్షణ శిబిరాన్ని బల్దియా కమీషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి డీఈఓ సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణతీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులున్నారు.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూర్ వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8మందికి గాయాలయ్యాయి. కాగా, మహబూబాబాద్‌లో కేసీఆర్ సభకు వెళ్లి ఇంటికెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. క్షతగాత్రులకు MHBD ప్రభుత్వ ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు.
తెలుగురాష్ట్రాల్లో గ్రూప్1 ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి మోసం చేశాడు. బుధవారం సుబేదారి పోలీసులు హనుమకొండలో అరెస్ట్ చేశారు. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాలిలా.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బుచ్చిబాబు అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ.20 కోట్లు దండుకున్నాడు. ఆ డబ్బును రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టి నష్షపోయాడు. ఈ క్రమంలో ఎవరికీ దొరకకుండా తిరుగుతుండగా బుధవారం పట్టుకున్నట్లు సీఐ తెలిపారు.
రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజూకీ పెరిగిపోతోంది. మే మొదటి వారంలోనే సూర్యుడు భగభగ అంటున్నాడు. ఈరోజు వరంగల్ జిల్లాలో అత్యధికంగా 46 పైన డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో ప్రజలు అధికమైన వేడితో ప్రజలు అల్లాడిపోతున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హన్మకొండ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. శాయంపేట మండలానికి చెందిన తేజేశ్వర్ వరంగల్ మెడికేర్ హాస్పిటల్ వద్ద ట్రైన్ కింద పడి మరణించారు. కులాంతర వివాహం చేసుకొన్న తేజేశ్వర్.. భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
వరంగల్ నగరంలోని కరీమాబాద్ జన్మభూమి జంక్షన్లో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే విష్ణువర్ధన్(23) అనే యువకుడు క్రెడిట్ కార్డుపై చేసిన అప్పులు తీర్చలేక ఈరోజు తెల్లవారుజామున తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మీల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు.
Sorry, no posts matched your criteria.