India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భూపాలపల్లిలోని మంజునగర్‌లోని ఏరియా హస్పిటల్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. మంజునగర్ బస్టాండ్‌లో నిల్చున్న ప్రయాణికులను టిప్పర్ ఢీ కొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు ఆంధ్రప్రదేశ్ వాసులుగా గుర్తించారు. ఓటువేసేందుకు స్వగ్రామానికి వెళ్లేందుకు బస్టాండ్‌లో నిల్చుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. వరంగల్ ఎంపీ నియోజకవర్గపరిధిలోని భూపాలపల్లి, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గపరిధిలోని ములుగులో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రచారం ముగిసింది. గత నెల రోజులుగా మైకులతో హోరెత్తిన ప్రాంతాలు ఒక్కసారిగా మూగబోయాయి.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోకూడదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి రాబోతుందన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే అధిక నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని, ప్రజలు తనకు అండగా నిలవాలన్నారు.
హనుమకొండ చౌరస్తాలోని ఓ మిర్చి బండి వద్ద కాంగ్రెస్ వరంగల్ అభ్యర్థి కడియం కావ్య మిర్చి బజ్జీలు చేస్తూ సందడి చేశారు. అంతకు ముందు కాజీపేట నుంచి చౌరస్తా వరకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే వరంగల్ అభివృద్ధి సాధ్యమని కావ్య అన్నారు.
బీఆర్ఎస్ మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థి మాలోతు కవిత ఉపాధి హామీ పనులు చేశారు. కురవి మండలంలోని పలు గ్రామాల్లో ఈరోజు ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించి, ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించి, తనని గెలిపించాలని కోరారు. ఈ క్రమంలోనే గడ్డపార పట్టి, మట్టి తవ్వి ఉపాధి హామీ పనులు చేశారు. ఆమెతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం పనుల్లో పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు- ఆటో ఢీకొన్న ఘటనలో ఆటోలో ఉన్న బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరణించిన బాలుడు పెద్దవంగర మండలం గుండ్లకుంట గ్రామానికి చెందిన చింతం జస్వంత్‌గా గుర్తించారు.
లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఇవాళ సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. దీంతో ఇన్ని రోజులుగా పాటలతో, మాటలతో హోరెత్తిన మైకులు మూగబోనున్నాయి. ఎన్నికల పోలింగ్‌కు మరో 48 గంటల సమయమే మిగిలి ఉండటంతో, అటు మద్యం దుకాణాలు సైతం ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి మూతపడనున్నాయి. ప్రచార పర్వం ముగుస్తుండటంతో అటు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే పర్వం మొదలు కానుంది.
గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన పర్వతగిరి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పర్వతగిరి మండలంలోని రావూరు గ్రామానికి చెందిన నాగరాజు(28) గుండెపోటుతో మృతి చెందాడు. అయితే రోజు వారీలాగే ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లొచ్చాడు. సాయంత్రం 9 నుంచి 10 గంటల ప్రాంతంలో గుండెపోటుతో మరణించాడు.
గత పదేళ్లలో తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీ మనకు అవసరమా? అని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ప్రశ్నించారు. భీమారంలో నిర్వహించిన రోడ్ షోలో కావ్య పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలోని కోట్లాది మందిని నిరుద్యోగులుగా మార్చారని మండిపడ్డారు. వరంగల్ ప్రజలు బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కావ్య అన్నారు.
గత పదేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని మంత్రి సీతక్క అన్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా పలు మండలాల్లో మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ జీఎస్టీ పేరుతో పేదలను ఇబ్బందులకు గురి చేసిందని, దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని అన్నారు.
Sorry, no posts matched your criteria.