Warangal

News May 9, 2024

FLASH.. WGL: రైలు ఎక్కేందుకు వచ్చి గుండెపోటుతో మృతి

image

వరంగల్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో విషాదం చోటుచేసుకుంది. రైలు ఎక్కేందుకు స్టేషన్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడు గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు మంచిర్యాలకు చెందిన మొహమ్మద్ ఇక్బాల్(58)గా పోలీసులు, రైల్వే సిబ్బంది గుర్తించారు. వరంగల్ నుంచి మంచిర్యాలకు వెళ్లేందుకు నవజీవన్ రైలు ఎక్కుతుండగా ఈ విషాద సంఘటన జరిగింది.

News May 9, 2024

మోదీ, ఆరూరి రమేశ్‌కు దిమ్మతిరిగేలా సమాధానం చెప్పాలి: కావ్య

image

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ ప్రజలు మోదీ, ఆరూరి రమేశ్‌కు దిమ్మతిరిగేలా సమాధానం చెప్పాలని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. హన్మకొండలో బీసీ సంఘం సమావేశంలో కావ్య మాట్లాడుతూ.. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ ప్రజల బతుకులు చీకటి మయమవుతాయని అన్నారు. పార్లమెంటు ఎన్నికలు తెలంగాణకు, గుజరాత్‌కు మధ్య జరుగుతున్న యుద్ధమని తెలిపారు.

News May 9, 2024

BREAKING.. WGL: కారు బోల్తా.. కాంగ్రెస్ నాయకురాలు మృతి

image

కారు బోల్తా పడి కాంగ్రెస్ నాయకురాలు మృతి చెందిన ఘటన BHPL జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మహాముత్తారం మండలం నిమ్మగూడెం వద్ద కారు బోల్తా పడి మహాముత్తారం మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు జాడి కీర్తిబాయి మృతి చెందింది. ఆమె భర్త రాజయ్యకు తీవ్ర గాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 9, 2024

మిర్చి బజ్జీలు చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

image

కొడకండ్ల మండలంలోని ఏడునూతుల గ్రామంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఓ హోటల్ ఎర్రబెల్లి మిర్చి బజ్జీలు చేసి సందడి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.

News May 9, 2024

ములుగు: 3 రోజులు మద్యం షాపులు బంద్

image

ములుగు జిల్లా వ్యాప్తంగా ఈనెల 11 నుంచి 13 వరకు అన్ని మద్యం షాపులను మూసివేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంటు ఎన్నికలు సజావుగా జరిగేందుకు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మద్యం షాపులను మూసివేయనున్నట్లు తెలిపారు. జూన్ 4న తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా మద్యం దుకాణాలు మూసి వేయాలని ఆదేశించారు.

News May 9, 2024

వరంగల్: క్వింటా పత్తి ధర రూ.6750

image

బుధవారం అమావాస్య సందర్భంగా వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ బంద్ ఉండగా.. నేడు ప్రారంభం కావడంతో పత్తి తరలివచ్చింది. అయితే మొన్నటి (మంగళవారం)తో పోలిస్తే ఈరోజు రూ.25 ధర పెరిగింది. మొన్న రూ.6,725 పలికిన క్వింటా పత్తి .. ఈరోజు రూ.6,750 ధర పలికింది. అయితే పత్తి ధరలు భారీగా పడిపోతుండడంతో అన్నదాతలు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

News May 9, 2024

కడియంకు రాజకీయ ఉనికి లేకుండా చేయాలి: ఆరూరి

image

కడియం శ్రీహరికి రాజకీయ ఉనికి లేకుండా MP ఎన్నికల్లో ఆయన కూతురు కావ్యను ఒడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వరంగల్ BJP MP అభ్యర్థి ఆరూరి రమేశ్ అన్నారు. ధర్మసాగర్ మండలంలో ఈరోజు ఆయన ప్రచారం నిర్వహించి, తనను ఎంపీగా గెలిపించాలని ప్రజలను కోరారు. రాజకీయ భవిష్యత్తు కోసం అనేకమంది దళితులను నమ్మించి మోసం చేసిన వ్యక్తి కడియం అన్నారు. ధర్మసాగర్‌లో డిగ్రీ కళాశాల కోసం కృషి చేస్తానన్నారు.

News May 9, 2024

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో గురువారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ రకం మిర్చి క్వింటాకు రూ.17,000 పలకగా.. 341 రకం మిర్చి రూ.18 వేల ధర పలికింది. వండర్ హాట్(WH) రకం మిర్చి రూ.14,300.. 5531 రకం మిర్చికి రూ.11 వేల ధర వచ్చింది. అలాగే టమాటో మిర్చికి రూ.31,500 ధర వచ్చింది. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

News May 9, 2024

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 41కి చేరిన నామినేషన్లు

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. నిన్న మరో 12 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా.. నామినేషన్లు వేసిన వారి సంఖ్య 41కి చేరింది. ఈరోజు మరికొన్ని నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇక రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన ప్రారంభం కానుండగా.. ఈ నెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.

News May 9, 2024

మామునూరు ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుపై బీజేపీ వివక్ష: బండ ప్రకాశ్

image

మామునూరు ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుపై బీజేపీ పదేళ్లు వివక్ష చూపిందని శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. పరకాలలో మీడియాతో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తామన్నారు. బీజేపీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవమానించారన్నారు.