India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేడు పదోతరగతి ఫలితాలు ఉదయం 11గంటలకు వెలువడనున్నాయి. వరంగల్ జిల్లాలో 9,537 మంది, హనుమకొండలో 12,346 మంది, జనగామలో 6,698 మంది, భూపాలపల్లిలో 3,547 మంది, ములుగులో 3,088 మంది, మహబూబాబాద్‌లో 9,181 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను Way2News యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు.
తండ్రిని కాపాడబోయి కూతురు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా మంగపేట మండలంలో జరిగింది. కమలాపురానికి చెందిన నిఖిత సమీపంలోని గోదావరి నది వద్దకు తండ్రితో వెళ్ళింది. ఈ క్రమంలో తండ్రి సరదాగా స్నానం చేసేందుకు గోదావరిలో దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో ఈతరాక మునిగిపోతున్న క్రమంలో ఒడ్డున ఉన్న కుమార్తె చేయి అందించి బయటకు లాగింది. ఇదే క్రమంలో బండమీద నుంచి ఆమె కాలుజారి గోదావరిలో పడి మునిగి మృతి చెందింది.
MP ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. వరంగల్‌లో 48 నామినేషన్లు ఆమోదించగా.. ఆరుగురు విత్‌డ్రా చేసుకొన్నారు. 42 మంది బరిలో నిలిచారు. మహబూబాబాద్ లోక్‌సభలో ఇద్దరు విత్ డ్రా చేసుకోగా.. 23 మంది బరిలో ఉన్నారు. SHARE IT
15- వరంగల్ ఎస్సి పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి మొత్తం ఆమోదించిన నామినేషన్లు: 48, విత్ డ్రా చేసుకున్న అభ్యర్థులు: 06, మొత్తం బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య: 42 అని వరంగల్ రిటర్నింగ్ అధికారి ప్రావిణ్య తెలిపారు. ఎన్నికల స్క్రూట్నీ , నామినేషన్ ఉపసంహరణ పూర్తయిన నేపథ్యంలో గుర్తుల కేటాయింపును ఈరోజు సాయంత్రం పరిశీలించనున్నారు.
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) రాష్ట్ర అధ్యక్షుడుగా వరంగల్ జిల్లాకు చెందిన వెంకటరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు PDSU జాతీయ కన్వీనర్ రామకృష్ణ తెలిపారు. కొత్తగూడెం పట్టణంలో ఈరోజు జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయనను నియమించారు. ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును రద్దుచేస్తూ, ప్రభుత్వ యూనివర్సిటీలను పటిష్ట పరచాలని నూతన అధ్యక్షుడు డిమాండ్ చేశారు. విద్యా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
పాలకుర్తి MLA యశస్విని రెడ్డితో సోమవారం వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా యశస్విని రెడ్డి.. తీన్మార్ మల్లన్నకు పెన్నును గిఫ్టుగా ఇచ్చారు. ఆమెతో పాటు ఝాన్సీ రెడ్డి, పార్టీ నాయకులు ఉన్నారు.
వరంగల్ జిల్లాలో TOSS INSTER & SSC పబ్లిక్ పరీక్షలలో భాగంగా నాలుగవ రోజైన సోమవారం పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించా మని వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి డి. వాసంతి అన్నారు. ఈ రోజు (5) పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశామన్నారు. ఓపెన్ టెన్త్ ఎస్ఎస్సి లో ఉదయం 86% , మధ్యాహ్నం 84% మంది విద్యార్థులు హాజరైనారన్నారు. ఇంటర్లో ఉదయం 91% మధ్యాహ్నం 88% మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు.
MP ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పలువురు నాయకులు పార్టీలు మారుతున్నారు. ఈ క్రమంలో జంపింగ్ నేతలను హెచ్చరిస్తూ వరంగల్ నగరంలోని పలు కాలనీల్లో ప్లెక్సీలు వెలిశాయి. ‘ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గోడలు దూకే నాయకుల్లారా.. ఖబడ్దార్ మీకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయి’ అంటూ చెప్పుల దండలు వేసిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనితో అలర్ట్ అయిన మున్సిపల్ సిబ్బంది ప్లెక్సీలను తొలగించారు.
వరంగల్ 15 పార్లమెంటు నియోజకవర్గం స్థానానికి నామినేషన్ వేసిన అభ్యర్థులు సోమవారం మధ్యాహ్నం 03.00 గంటల వరకు తమ నామినేషన్ ఉపసంహరించుకున్నారని వరంగల్ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి పి. ప్రావీణ్య ప్రకటించారు. ఇందులో 1. ఇల్లందుల శోభన్ బాబు, 2. కుమ్మరి కన్నయ్య, 3. బాబు బర్ల, 4. మార్గ రాజభద్రయ్య, 5. డాక్టర్ విజయ్ కుమార్, 6. వేణు ఇసంపెల్లి అభ్యర్థులు తమ నామినేషన్ ఉపసంహరించుకున్నారని అన్నారు.
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ఎర్రచక్ర తండాకి చెందిన స్వాతి(17) ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపం చెంది పురుగు మందు తాగింది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
Sorry, no posts matched your criteria.