India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేవుళ్ల పేరుతో బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. పదేళ్లలో కేంద్రం ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. శనివారం ఆమె ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు. బీజేపీ పేదలపై పన్నులు వేస్తూ దుర్మార్గ పాలన చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ధైర్యం ఎవరికీ లేదన్నారు. మాజీమంత్రి హరీశ్‌రావుకి పదవి మీద తప్పా, ప్రజల మీద ప్రేమ లేదని దుయ్యబట్టారు.
హన్మకొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను జూన్‌లో ప్రారంభమయ్యే పాఠశాలల పున:ప్రారంభం నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై జిల్లాలోని ఆయా మండలాల ప్రత్యేకాధికారులు, అధికారులతో ఆమె సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 1,67,853 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో వరంగల్ జిల్లాలో 43,594మంది, హన్మకొండ- 43,483, మహబూబాబాద్- 34,759, జనగామ- 23,320, భూపాలపల్లి- 12,460, ములుగు-10,237 మంది ఉన్నారు. వీరి కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 222 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
వరంగల్ జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఓపెన్ టెన్త్, ఇంటర్ ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతంగా రాశారని విద్యాశాఖ అధికారి వాసంతి అన్నారు. ఈ పరీక్షలు ఉదయం మధ్యాహ్నం నిర్వహించినట్లు తెలిపారు. పరకాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాల్ ప్రాక్టీస్ చేస్తుండగా ఒకరిని హనుమకొండ డీఈఓ అబ్దుల్ పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పరకాలలో ఇద్దరు ఇన్విజిలేటర్లను రిలీవ్ చేశామని అన్నారు.
ఖిలా వరంగల్ కోటలో గుర్తు తెలియని యువకుడు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కోటలోని వ్యవసాయ క్షేత్రాలను ఆనుకొని ఉన్న రాతికోట మెట్లపై 20 ఏళ్ల యువకుడు పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిర్మానుష్య ప్రదేశం కావడంతో ఎప్పుడు చేసుకున్నాడనే విషయంపై స్పష్టత లేదు. ఘటనా స్థలానికి మిల్స్ కాలనీ సీఐ మల్లయ్య, ఎస్ఐ గోవర్దన్ చేరుకొని పరిశీలించారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కి సరుకులు తీసుకొని రావద్దని, విషయాన్ని గమనించాలని అధికారులు తెలిపారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి ఈరోజు పసుపు తరలివచ్చింది. ఈ క్రమంలో పలు రకాల ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. కాడి పసుపు క్వింటాకి రూ.14,521, అలాగే గోల పసుపు క్వింటాకి రూ.14,650 పలికింది. మరోవైపు మక్కలు బిల్టీ క్వింటాకి రూ.2280 పలకగా…సింగల్ పట్టి మిర్చి ధర రూ.39వేలు పలికింది. .
ట్రాక్ దాటుతూ వ్యక్తి మృతిచెందిన ఘటన జనగామ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. పర్వతగిరి మండలం దౌలత్‌బాద్‌కు చెందిన దద్దు రాజు(27) కొమురవెల్లి దేవస్థానానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. జనగామ రైల్వేస్టేషన్లో ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. రైల్వే పోలీసు అధికారి రమణరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బేడ జంగాల కాలనీలో గురువారం ఇద్దరు ఉరేసుకొని మృతిచెందారు. పోలీసుల ప్రకారం.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన ముత్యాలు భార్య కనకలక్ష్మి(35), చింతల పులేందర్ (40) రాజాపేటలోని పులేందర్ ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని మృతిచెందారు. ఈ జంట ఆత్మహత్యలకు అక్రమ సంబంధమే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాను పనిచేస్తున్న యజమాని ఇంటిలోనే ప్రియుడు, అక్కతో కలిసి చోరికి పాల్పడింది ఓ మహిళ. ఈ ముగ్గురిని నిందితులను శుక్రవారం హనుమకొండలోని సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు రూ.38 లక్షల విలువ గల 470 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను, దోచుకున్న సొమ్మును వరంగల్ పోలీస్ కమిషనరేట్ అంబర్ కిషోర్ ఝా ఎదుట పోలీసులు ప్రవేశపెట్టారు.
Sorry, no posts matched your criteria.