Warangal

News April 24, 2024

కడియం కావ్య ఆస్తులు రూ.1.55 కోట్లు

image

వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య సోమవారం నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అఫిడవిట్‌లో పొందుపర్చిన ఆస్తుల వివరాలు.. కావ్యకు రూ.1.55 కోట్ల ఆస్తులు ఉండగా.. సొంతంగా ఇళ్లు, వ్యవసాయ భూములు లేవు. ఆమెతో పాటు తన భర్త మహ్మద్ నజీరుల్లా షేక్ వద్ద రూ.1.15 లక్షల నగదు ఉంది. ఇన్నోవా క్రిస్టా, రాయల్ ఎన్‌ఫీల్డ్, హోండా యాక్టివా ఉన్నాయి. ఇరువురి వద్ద 27 తులాలు, పిల్లల నేరిట 8 తులాల బంగారం ఉంది.

News April 24, 2024

నేడు వరంగల్‌లో కేటీఆర్ పర్యటన

image

మాజీ మంత్రి కేటీఆర్ నేడు వరంగల్ నగరంలో పర్యటించనున్నారు. హెలికాప్టర్ ద్వారా సుబేదారిలోని ఆర్ట్స్ కళాశాల మైదానానికి 04:30 గంటలకు చేరుకుంటారు. 5 గంటలకు హంటర్ రోడ్డులోని ఓ కన్వెన్షన్ హాల్‌లో వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడతారు. 6 గంటలకు ఉర్సు గుట్ట ప్రాంతంలోని నాని గార్డెన్లో వరంగల్ తూర్పు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.

News April 24, 2024

పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

తెలంగాణ ప్రభుత్వం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణా సంస్థ (SDDGWTTI) హైదరాబాద్ నందు 3 సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి కె.మధురిమ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనాధ బాలికలు, పదవ తరగతి పూర్తయిన వారు మే 17 సా. 4.00లోగా దరఖాస్తులను సమర్పించాలని కోరారు.

News April 24, 2024

వరంగల్: ఎన్నికల కోడ్.. తప్పుడు పోస్ట్‌లు పెడితే జైలుకే

image

పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. సోషల్ మీడియాపై నిఘా పెంచారు. ఇందులో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు సోషల్ మీడియా వేదికగా జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు గుర్తించి, సుమోటోగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల వేళ ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్‌లు పెడితే చర్యలు తీసుకుంటామని పోలిసులు హెచ్చరిస్తున్నారు.

News April 24, 2024

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

image

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మరిపెడ శివారు మాకుల తండాకు చెందిన ఇస్లావత్ శ్రీనివాస్ అనే రైతు అప్పులు కావడంతో అప్పులు తీర్చలేననే బాధతో సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 24, 2024

నామినేషన్ వేసిన కడియం కావ్య

image

వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు సోమవారం ఒక సెట్ నామినేషన్ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.

News April 24, 2024

WGL: సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు

image

లంచం తీసుకుంటూ పట్టుబడిన మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ తస్లీమా గతనెల 22న లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని భావించిన అధికారులు హన్మకొండలోని ఆమె నివాసంతో పాటు తస్లీమా భర్త నివాసముంటున్న సూర్యాపేటలోనూ ఏసీబీ సోదాలు చేపట్టింది.

News April 24, 2024

అమెరికాలో వరంగల్ వాసి మృతి

image

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లికి చెందిన యువకుడు పార్శీ గౌతమ్(19) అమెరికాలోని అరిజోనా లో బీటెక్ చదువుతున్నాడు. గౌతమ్ తన స్నేహితులతో కలిసి జలపాతం చూసేందుకు వెళ్లాడు. తిరిగి తన ఇంటికి వెళ్తున్న క్రమంలో కారును వెనక నుంచి మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో గౌతమ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు అరిజోనా పోలీసులు తెలిపారు.

News April 22, 2024

వరంగల్ విమానాశ్రయ ఏర్పాటుకు అడుగులు?

image

మామునూరు ఎయిర్‌పోర్టు నుంచి చిన్న మైక్రోలైట్ విమానాలు ప్రయాణించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం WGL ఎయిర్ స్ట్రిప్ పరిధిలో 706 ఎకరాలు ఉండగా.. మరో 400 ఎకరాలు కావాల్సి ఉంది. అందులో భాగంగా 253 ఎకరాలు కేటాయిస్తూ గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విమానాశ్రయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.750 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంది.

News April 22, 2024

భూపాలపల్లి: పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం

image

గణపురం మండలం కర్కపల్లి పంచాయతీ కార్యదర్శి శ్రావణి ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విధులు నిర్వహించి ఇంటికి వచ్చిన శ్రావణి, భర్త స్నానానికి వెళ్లి వచ్చే సరికి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన భర్త వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!