India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖానాపురం మండలం బుధారావుపేట గ్రామంలో జాతీయ రహదారి పై మంగళవారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. నర్సంపేట నుంచి బుధరావుపేటకి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వెనుకనుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న సులేమాన్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పలువురు మహిళలకి గాయాలు అయ్యాయి. కారు డ్రైవరు అక్కడి నుంచి పరారు అయ్యారు. పోలీసులు కేసునమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన ఘటన ములుగు మండలం మహ్మద్‌గౌస్‌పల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చింతల రాజు (35) మతిస్థిమితం కోల్పోయి పంచోతుకులపల్లికి నడుకుంటూ వెళ్లి వడ దెబ్బతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహబూబాబాద్ బీజేపీ అభ్యర్థి సీతారాంనాయక్ నామినేషన్ సందర్భంగా అఫిడవిట్‌లో ఆయన ఆస్తి వివరాలను పొందుపర్చారు. ఆయన కుటుంబ ఆస్తుల విలువ రూ.3.06 కోట్లు. కుటుంబం వద్ద 87 తులాల బంగారు ఆభరణాలు, మూడు కార్లు ఉన్నాయి. 6.17ఎకరాల వ్యవసాయ భూములు, శేరిలింగంపల్లి అయ్యప్పసొసైటీ, హన్మకొండలో నివాస గృహాలు ఉన్నాయి. కాగా, రూ.1.37కోట్ల అప్పులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర స్వల్పంగా తగ్గింది. నిన్న రూ.7,150 పలికిన క్వింటా పత్తి ఈరోజు రూ.7100 ధర పలికినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. పత్తి ధర రోజురోజుకు తగ్గుతుండడంతో రైతన్నలు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
BHPL జిల్లా గణపురం మండలంలోని <<13099643>>కర్కపల్లి జీపి కార్యదర్శిగా<<>> విధులు నిర్వహిస్తున్న శ్రావణి ఆదివారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. స్థానికులు గమనించిన వెంటనే WGLలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి ఆమె మృతి చెందారు. అయితే ఆదివారం ఉదయం ఆమె ఫోన్లో ఎవరెవరితో మాట్లాడారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కొండగట్టులో జరుగుతున్న హనుమాన్ చిన్న జయంతి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన లక్ష్మణ్(55) కుటుంబంతో కలిసి కొండగట్టు వచ్చారు. ఉచిత బస్సు ఎక్కబోయి లక్ష్మణ్ కాలు జారి కిందపడగా బస్సు చక్రం కింద పడి వ్యక్తి రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో వెంటనే లక్ష్మణ్‌ను 108లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాలోతు కవిత నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఎంపీ అభ్యర్థి కవిత సమర్పించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, బానోతు శంకర్ నాయక్, బానోతు హరిప్రియ, కాంతారావు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ పార్లమెంట్ BRS అభ్యర్థి మరపల్లి సుధీర్‌కుమార్ నామినేషన్ సందర్భంగా అఫిడవిట్‌లో ఆయన ఆస్తి వివరాలను పొందుపర్చారు. ఆయన కుటుంబానికి రూ.2.04 కోట్ల ఆస్తులు ఉండగా.. టాటా జెస్ట్ కారు, 8తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. హన్మకొండలో 18 ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల వ్యవసాయేతర భూమితో పాటు.. ఒక ఇల్లు ఉంది. మొత్తం 1.79 కోట్ల స్థిరాస్తులుండగా.. ఈయనకు ఎలాంటి అప్పులు, క్రిమినల్ కేసులు లేవు.
దేవరుప్పుల మండలంలోని అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గడ్డం సమ్మయ్య రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పద్మశ్రీ అవార్డు గ్రహీత సమ్మయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. అవార్డు రావడంతో నాపై బాధ్యత మరింత పెరిగిందని గడ్డం సమ్మయ్య అన్నారు.
మంత్రి కొండా సురేఖపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. BRS ఎమ్మెల్యే KTR ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలంటూ BRS అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ సోమవారం హైకోర్టులో పిటిషన్ వేశారు. WGLలో మార్చి 16న నిర్వహించిన సమావేశంలో ఫోన్ ట్యాపింగ్‌లో KTR పాత్ర ఉందంటూ ఆరోపణలు చేశారని మండిపడ్డారు.
Sorry, no posts matched your criteria.