India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డా.బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల ఫీజును ఈ నెల 26లోగా చెల్లించాలని జనగామ అభ్యసన కేంద్రం సమన్వయకర్త శ్రీనివాస్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మే 17 నుంచి పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. కావున విద్యార్థులు ఫీజు నిర్ణీత తేదీలోగా చెల్లించాలని కోరారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 19, 24 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. 19న హెలీకాప్టర్‌లో మహబూబాబాద్‌కు చేరుకుంటారు. స్థానిక ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అదే రోజు ఉదయం కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ నామినేషన్ వేయనున్నారు. 24న హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
మాజీ సర్పంచి విడుదల చేసిన ఓ ప్రకటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంకి చెందిన మాజీ సర్పంచి శ్రీధర్ రూ.15 లక్షల అప్పు చేసి RWS అధికారులు, పంచాయితీ తీర్మానంతో గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ బాగుచేయించాడు. అయితే తన పదవీకాలం ముగిసినా MB రికార్డు చేయలేదని, అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. ‘బిల్లులు ఇవ్వకపోతే సూపైడ్ చేసుకుంటానంటూ’ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
హత్య కేసులో ముగ్గురు నిందితులను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు. ఈ నెల 15న జనగామ ఆర్టీసీ చౌరస్తాలో పట్టణంలోని బాణాపురం వాసి బోయిని భాస్కర్‌ను కర్రలతో కొట్టి అతని మృతికి కారణమయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రఘునాథపల్లికి చెందిన కుర్ర కమలాకర్, కుర్ర కళాధర్, చిల్పూర్‌కు చెందిన చిర్ర శ్రవణ్‌ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు ప్రారంభం కానుంది. నిన్న శ్రీరామనవమి సందర్భంగా మార్కెట్‌కు సెలవు ప్రకటించగా..
నేడు మార్కెట్ ఓపెన్ ఉండనుంది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రైతులు తగుజాగ్రత్తలు పాటిస్తూ మార్కెట్‌కు రావాలని, నాణ్యమైన సరుకులు తీసుకొనిరావాలని అధికారులు సూచిస్తున్నారు.
ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గోపాలపురంలో చోటుచేసుకుంది గోపాలపురం గ్రామానికి చెందిన కట్కూరి ప్రమోద్ రెడ్డి (28) గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. పలు ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం కుదుట పడకపోవడంతో బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
దేవరుప్పుల మండలం మాధాపురం గ్రామానికి చెందిన మాచర్ల బిక్షపతి అనే వ్యక్తి బుధవారం అనుమానాస్పదంగా మృతిచెందారు. గ్రామస్థుల వివరాల ప్రకారం రామచంద్రపురం గ్రామంలోని ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా అనుమానాస్పదంగా రోడ్డు ప్రక్కన మృతిచెంది పడి ఉన్నాడు. ఈ ఘటన పై దేవరుప్పుల ఎస్సై చెన్నకేశవులను సంప్రదించగా అతనే ప్రమాదవశాత్తూ కింద పడి మృతిచెందాడని తెలిపారు.
ప్రభుత్వ నిషేధిత CPI మావోయిస్టు పార్టీలో పని చేస్తున్న అజ్ఞాత మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోవాలని ములుగు ఎస్పీ శబరీష్ ప్రకటనలో తెలిపారు. ఆ పార్టీ సిద్ధాంతాలు కాలం చెల్లినవని, వారి భావజాలం ప్రజల్లో ప్రాముఖ్యం కోల్పోయిందని పేర్కొన్నారు. మావోయిస్టు సిద్ధాంతాలను ప్రజలు నమ్మడం లేదన్నారు.
వచ్చే వానాకాలంలో ములుగు, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ మేరకు జూన్- సెప్టెంబరు నెలల మధ్య వర్షాల ప్రభావంపై మంగళవారం HYD వాతావరణ శాఖ నివేదిక విడుదల చేసింది. గతేడాది రుతుపవనాల రాక ఆలస్యం కావడం, లెక్కకు మించి వానల విరామ కాలాలు నమోదవడంతో సాగుకు విఘాతం కలిగింది. ఈ సారి ఆ పరిస్థితి ఉండదని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
ఉపాధ్యాయురాలిని వేధించిన ఘటనలో మరో ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసచారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధరావుపేటలోని మోడల్ స్కూల్లో ఈ నెల 10న ఓ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యాయత్నం చేసిన విషయం విదితమే. ఆమె ఆత్మహత్యాయత్నానికి ఉపాధ్యాయుడు రాజేందర్ వేధింపులే కారణమని పంపిన విచారణ నివేదిక ఆధారంగా సస్పెండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.