India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ములుగు జిల్లాలో మావోయిస్టు ప్రాబల్యం ఉన్నందున రానున్న పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని మల్టీజోన్-1 ఐజీ ఏవీ రంగనాథ్ అన్నారు. ములుగులో ఏర్పాటు చేసిన పోలీస్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఛతీస్గడ్, ములుగు సరిహద్దు ప్రాంతాల్లో స్పెషల్ పార్టీ బలగాల ద్వారా ముమ్మర తనిఖీలు నిర్వహించాలన్నారు. పోలీస్ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాలని, అక్రమ నగదు, మద్యం తరలింపుకు అడ్డుకట్ట వేయాలన్నారు.
నేడు విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో ఓరుగల్లు బిడ్డలు సత్తాచాటారు. జిల్లా నుంచి ముగ్గురు సివిల్స్ సర్వీసుకు ఎంపికయ్యారు. వరంగల్ నగరానికి చెందిన జయసింహారెడ్డికి 103వ ర్యాంకు, గీసుకొండ మండలం అనంతరం గ్రామానికి చెందిన సయింపు కిరణ్ 568వ ర్యాంకు, శివనగర్‌కు చెందిన కోట అనిల్ కుమార్ 764 ర్యాంకు సాధించారు. వీరిలో జయసింహారెడ్డికి ఐఏఎస్, కిరణ్‌కు ఐపీఎస్, అనిల్ కుమార్‌కు ఐఆర్ఎస్ వచ్చే ఛాన్స్ ఉంది.
వడ్డీ వ్యాపారులు ప్రజలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మల్టీజోన్-1 ఐజీ ఏవీ రంగనాథ్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. కొంత మంది వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి వేధింపులకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. డబ్బు చెల్లించని వారి నుంచి బలవంతంగా ఇల్లు, పొలాల పత్రాలను తీసుకుంటున్నట్లుగా ఫిర్యాదులు అందాయన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర రూ.5 పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,100 పలకగా.. ఈరోజు రూ.7105 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. అయితే పత్తి ధరలు భారీగా పడిపోతుండటంతో రైతన్నలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడంలేదని ఆవేదన చెందుతున్నారు.
వరంగల్ పార్లమెంట్ ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలను నియమించారు. పరకాలకు బండ ప్రకాష్ ముదిరాజ్, పాలకుర్తి సిరికొండ మధుసూదనాచారి, మెట్టు శ్రీనివాస్, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి, వరంగల్ ఈస్ట్‌కు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, వర్ధన్నపేటకు వాసుదేవరెడ్డి, సమ్మరావు, భూపాలపల్లికి బసవరాజు సారయ్యను నియమించారు.
కానిస్టేబుల్ ఉద్యోగం దక్కడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హసన్ పర్తి మండలం అర్వపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన దేవేందర్ గౌడ్, భారతీ దంపతుల కుమారుడు రంజిత్ డిగ్రీ పూర్తి చేసి 2022 నుంచి కానిస్టేబుల్ పరీక్షలు రాస్తున్నాడు. ఫిజికల్ టెస్టులు అర్హత సాధించినప్పటికీ రాత పరీక్షలు వెనుక పడిపోవడంతో మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గుండెపోటుతో కారోబార్ మృతి చెందిన ఘటన పాలకుర్తిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పాలకుర్తి మండలం తీగారం గ్రామానికి చెందిన కారోబార్ పోగు అయోధ్య రాములు (56)సోమవారం పాలకుర్తిలో విధులకు వచ్చి గుండె నొప్పి వచ్చింది. అతన్ని ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. రాములు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విద్యావంతుల వేదిక రాష్ట్ర నాయకుడు కోడం కుమారస్వామి డిమాండ్ చేశారు.
లింగాల ఘన్పూర్ మండలం జీడికల్‌లోని వీరాచల రామచంద్రస్వామి ఆలయం రెండో భద్రాద్రిగా పేరుగాంచింది. జిల్లా కేంద్రానికి13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో ఏటా రెండు సార్లు రాములోరి కల్యాణం జరుగుతుంది. శ్రీరామనవమితో పాటు కార్తీకమాసంలోని పునర్వసు నక్షత్రంలో ఇక్కడ కల్యాణ వేడుకలు వైభవంగా జరుగుతాయి. భద్రాచలంలోని ఆలయం రాముడి ప్రేమకు ప్రతీకగా చెప్పుకుంటే జీడికల్‌లో రాముడిని వీరత్వానికి ప్రతీకగా చెప్తుంటారు.
భద్రాచలంలో ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్బంగా జరిగే శ్రీ సీతారామచంద్రుల వారి కల్యాణ తలంబ్రాలను ఆన్లైన్‌లో బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ఆర్టీసీ కల్పించింది. సంస్థ లాజిస్టిక్స్ విభాగ వైబ్ సైట్ tsrtclogistics.in సందర్శించి విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలను పొందండి. ఆఫ్లైన్‌లో తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లపై 040-23450033ను సంప్రదించాలన్నారు.
వరంగల్‌లో చివరి క్షణంలో కడియం కుటుంబం పార్టీకి మోసం చేసిన వ్యవహారం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్ జిల్లా నేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కొందరు నాయకులు వలస వెళ్లినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని, ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని, ప్రతి కార్యకర్త తానే అభ్యర్థిగా భావించి బీఆర్ఎస్ గెలుపు కోసం కదం తొక్కాలని అన్నారు.
Sorry, no posts matched your criteria.