India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వస్తున్న తనను ఆశీర్వదించి గెలిపిస్తే భూపాలపల్లికి రైల్వే లైన్ తీసుకువస్తానని ఆరూరి రమేశ్ తెలిపారు. శనివారం ప్రచారంలో భాగంగా రమేశ్ మాట్లాడుతూ.. భూపాలపల్లి ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయిస్తానన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదని చెప్పారు.
మహబూబాబాద్ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ పూర్తి వివరాలతో అఫిడవిట్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. తనపై 6 క్రిమినల్ కేసులున్నాయని, కుటుంబ ఆస్తుల విలువ రూ.2.99 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. మజీద్‌పూర్‌లో సర్వే నం.66 నుంచి 174 వరకు మొత్తం 180.34 ఎకరాల భూమిలో 1/3వ వంతు వాటా ఉందన్నారు. కుటుంబానికి 33 తులాల బంగారు ఆభరణాలున్నాయని, రూ.2.52 కోట్ల అప్పులున్నాయని వెల్లడించారు.
మహబూబాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఎస్టీ స్థానమైనా మహబూబాబాద్.. ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాల్లో విస్తరించి ఉంది. ఇందులో నర్సంపేట జనరల్ స్థానం కాగా.. డోర్నకల్, మహబూబాబాద్, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం ఎస్టీ నియోజకవర్గాలు. ఈ స్థానంలో ఒకటి మినహా మిగతావి ఎస్టీ రిజర్వేషన్ కావడం గమనార్హం.
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) రెండో సంవత్సరం, రెండో సెమిస్టర్ (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) పరీక్ష ఫీజు తేదీని కేయూ అధికారులు ప్రకటించారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 29లోపు చెల్లించవచ్చని విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి నర్సింహా చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి రాధిక తెలిపారు. ఆలస్య రుసుంతో మే 5 వరకు చెల్లించవచ్చన్నారు.
జబల్‌పూర్- మధురై మధ్య నడిచే 16057/58 ప్రత్యేక రైలుకు వరంగల్‌లో హాల్టింగ్ కల్పించారు. దీంతో పాటు బెల్లంపల్లి, పెద్దపల్లి, ఖమ్మం స్టేషన్లలో ఆపనున్నారు. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన ఈ రైలుకు మంచి ఆదరణ ఉండటంతో వరంగల్‌లో నిలపడానికి అధికారులు ఒప్పుకొన్నారు.జబల్‌పూర్ నుంచి మధురై వెళ్లే ఈ రైలు వరంగల్‌లో శుక్రవారం ఉ.5.52 గంటలకు, తిరుగు ప్రయాణంలో ఆదివారం సా.6.20 గం.కు అందుబాటులో ఉంటుంది.
జనగామ జిల్లా మొండ్రాయి గిర్ని తండా గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే ప్రధాని లక్ష్యంగా పనిచేయాలని మాజీ ఎంపీకి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వరంగల్ నగరంలోని 14వ డివిజన్ ఏనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్సార్ నగర్‌కు చెందిన మార్త ఓo ప్రకాష్ అనే పురోహితుడు శుక్రవారం తెల్లవారుజామున తన ఇంటి మేడపై ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన అతని భార్య, పిల్లలు కేకలు వేయగా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
అధికారం, పదవి ఎక్కడ ఉంటే అక్కడ కడియం శ్రీహరి ఉంటారని బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్ ఆరోపించారు. హనుమకొండలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘కడియం శ్రీహరి నీ మాటలు, వేషాలు, ఆరోపణలు చూసి ఊసరవెల్లులే సిగ్గుపడుతున్నాయి. మరోసారి నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తే నీ జాతకమంతా బయటపెడతా’ అని అన్నారు.
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ప్రచార రథాలను స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ సింగపురం ఇందిర ప్రారంభించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వస్తున్న కడియం కావ్యను ప్రజలు భారీ మెజారిటీతో ఆశీర్వదించి పార్లమెంటుకు పంపాలన్నారు.
వరంగల్ ఎస్సి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల అంశాలకు సంబంధించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు ఎన్నికల వ్యయ పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు ఏ.ధిలీబన్ నంబర్ 8309921306కు అదేవిధంగా వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌లకు ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై ఎన్నికల వ్యయ పరిశీలకులు ధీరజ్ సింగా 8309952057కు చేయవచ్చన్నారు.
Sorry, no posts matched your criteria.