India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాకతీయుల కట్టడాలున్న ఖిలా వరంగల్ కోట సమాచారంతో పాటు కాకతీయుల చరిత్రను పర్యాటకులకు డిజిటల్ విధానంలో అందించేందుకు కేంద్ర పురావస్తు శాఖ అధికారులు శ్రీకారం చుడుతున్నారు. ఈమేరకు కాకతీయుల చరిత్రను క్యూఆర్ కోడ్‌లో నిక్షిప్తం చేసి బోర్డులను ఖిలా వరంగల్ కోట పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పర్యాటకులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడంతో కట్టడాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
వరంగల్ నగరంలోని సికేఎం కళాశాల మైదానంలో నేడు ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ నిర్వహించారు. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య నేడు మ్యాచ్ జరుగుతోంది. ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేయడంతో వరంగల్ నగరంలోని క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున కళాశాల మైదానానికి విచ్చేసి స్క్రీన్ల ద్వారా మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు.
క్వారి గుంతలో పడి ఓ బాలిక మృతి చెందిన ఘటన MHBD పట్టణంలో చోటుచేసుకుంది. బోడ నికిత(11) అనే బాలిక మరికొందరితో కలిసి శనివారం బట్టలు ఉతికేందుకు మహబూబాబాద్ పట్టణం ఆర్తి గార్డెన్ సమీపంలోని క్వారీ వద్దకు వెళ్లింది. బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారీ గుంతలో పడి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈనెల 15న నర్సంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం శిబిరాన్ని నిర్వహించనున్నట్లు వరం ఏపీడీ పరగల్ జిల్లా పెన్షన్ల విభాగంమాత్మ ఒక ప్రకటనలో తెలిపారు. నర్సంపేట డివిజన్‌కు చెందిన చెవిటి, లోకో మోటార్, ఓహెచ్ విభాగాలకు దరఖాస్తు చేసుకున్న వారు హాజరుకావాలన్నారు. ఈనెల 15న క్యాంపు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి స్లాట్ లో వర్ధన్నపేట అని ఉన్నప్పటికీ నర్సంపేటలో జరిగే క్యాంపుకు రావాలని సూచించారు.
భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ జగన్ పేరిట ములుగు జిల్లాలో లేఖ కలకలం సృష్టిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విప్లవ పోరాటాలపై కొనసాగిస్తున్న హత్యకాండను, నరహంతక దాడులను వ్యతిరేకించండి అంటూ లేఖలో పేర్కొన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పిట్టపడ వద్ద గ్రేహౌండ్స్ పోలీసులు చేసిన ఏకపక్ష దాడిని ఖండించాలంటూ.. ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పాలని కోరారు.
కాకతీయ థర్మల్ విద్యుత్తు కేంద్రం(కేటీపీపీ) చెల్పూర్లోని మొదటి దశ 500 మెగావాట్ల ప్లాంట్లో విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో బాయిలర్ ట్యూబ్లో లీకేజీతో ఉత్పత్తి నిలిచిపోయినట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా బాయిలర్ ట్యూబ్ లీకేజీ కావడం సర్వసాధారణంగా మారిపోయిందన్నారు. లీకేజీలోని సాంకేతిక కారణాలను మరమ్మతుకు 24 గంటల సమయం పడుతుందని తెలిపారు.
శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి సీతారాముల కల్యాణ మహోత్సవ తలంబ్రాలను ఆర్టీసీ ద్వారా భక్తులకు ఇంటి వద్దకే అందిస్తున్నామని మహబూబాబాద్ డిపో మేనేజర్ ఎమ్.శివ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి తలంబ్రాలు కోరుకునే భక్తులు రూ.151తో బుకింగ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు లాజిస్టిక్స్ కౌంటర్, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ను సంప్రదించాలని కోరారు.
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ MLA నన్నపునేని నరేందర్ స్పందించారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నాపై గత కొన్ని రోజులుగా వచ్చే దుష్ర్పచారాలను నమ్మకండి. నేను BRSలోనే ఉన్నా. నాపై కావాలనే కొందరు కుట్ర పన్ని అసత్యపు ప్రచారాలు చేస్తున్నారు. BJPలో చేరేది లేదు.. BRSలోనే కొనసాగుతా’ అని ప్రకటనలో పేర్కొన్నారు.
పదేళ్ల తమ బీజేపీ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకటే అని, వారికి ఓటు వేస్తే నష్టపోయేది ప్రజలే అన్నారు. బీజేపీ తిరిగి కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రజలకు మళ్ళీ కష్టాలు తప్పవని, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవాలన్నారు.
ఉపాధి హామీ పనిలో ఉమ్మడి జిల్లా వెనుకబడింది. 33 జిల్లాలలో ములుగు జిల్లా 31వ స్థానంలో, వరంగల్ 30వ స్థానంలో, భూపాలపల్లి 29వ స్థానం, జనగామ 22వ స్థానంలో ఉన్నాయంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహబూబాబాద్ జిల్లా ఎంతో మెరుగ్గా రాష్ట్ర స్థాయిలో 5వ స్థానంలో ఉండగా హనుమకొండ 17వ స్థానంలో కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే.. ఉమ్మడి జిల్లాలోని నాలుగు జిల్లాలు ఉపాధి హామీ పథకంలో చాలా వెనుకబడ్డాయి.
Sorry, no posts matched your criteria.