India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేష్ ఆధ్వర్యంలో నేడు ఐనవోలు మండలం కక్కిరాలపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, వన్నాల శ్రీరాములుతో కలిసి బీజేపీలో చేరారు. వీరికి అరూరి రమేష్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ బొక్కలగడ్డలోని ఈద్గాలో గురువారం ఉదయం రంజాన్ పండుగ సందర్బంగా ప్రార్థనలు చేశారు. హన్మకొండ నగరంలోని ముస్లింలు ఉదయమే కొత్త బట్టలు ధరించి ఇంతో నిష్టతో నమాజ్ చేశారు. ముస్లిం సోదరులతో ఈద్గా నిండిపోయింది. ఈద్గా దగ్గర హన్మకొండ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రూప్-2, 3, 4 ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. మూడు నెలలపాటు ఇచ్చే శిక్షణకు డిగ్రీ ఉత్తీర్ణులైన ఎస్సీ విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు కులం, ఆదాయం, నివాసం, డిగ్రీ సర్టిఫికెట్స్‌తో ఇందిరా నగర్లోని ఎస్సీ కాలేజీ బాలుర హాస్టల్ సమీపంలోని కార్యాలయంలో సమర్పించాలన్నారు.
మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 12 వరకు గడువు ఉందని ఎంజేపీటీబీసీ డబ్ల్యూఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ మనోహర్ రెడ్డి తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ ప్రవేశపరీక్ష ఈనెల 28 ఉంటుందని చెప్పారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామానికి చెందిన మధుప్రియ(10) తన తమ్ముడు మణివర్ధన్(6)ను కాపాడినట్లు గ్రామస్థులు తెలిపారు. స్థానికుల వివరాలు.. ఇంట్లో వాటర్ హీటర్ ఆన్‌లో ఉండగా అది తెలియని మణివర్ధన్ దానిని పట్టుకోగా షాక్ తగిలింది. అలాగే హీటర్ వదలక ఏడుస్తుండగా స్నానం చేస్తున్న అక్క మధుప్రియ విని వెంటనే వెళ్లి సమయస్ఫూర్తితో హీటర్ ప్లగ్ తీసి కాపాడింది.
ఈ నెల 18న లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. మే 13న పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఓటరుగా పేరు నమోదు చేసుకోలేదు. 2006 మార్చి 31లోపు పుట్టిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవడానికి మరో 6 రోజుల సమయం ఉంది. ఫారం-6 నింపి, ధ్రువీకరణ పత్రాల నకలు, పాస్ ఫొటోలు జతపర్చి స్థానిక BLOకు అందజేయండి. లేదంటే స్థానిక మీసేవ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు మార్పులు చేసుకోవచ్చు.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ముగ్ధుంపురంలో విషాదం జరిగింది. ముగ్ధుంపురంకు చెందిన బాదవత్ మోహన్(56) వడదెబ్బతో మృతి చెందాడు. మోహన్ తన మొక్కజొన్న చేను వద్దకు రెండు రోజులు కాపలాకు వెళ్లడంతో ఎండ వేడిమికి వడదెబ్బ తాకింది. మంగళవారం అస్వస్థతకు గురయ్యాడు. స్థానికంగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మోహన్ మృతదేహానికి ఎంపీటీసీ చీకటి స్వరూప ఓదెలు, చెన్నారావుపేట సొసైటీ డైరెక్టర్ గోపి తదితరులున్నారు.
నేటి యువతను మత్తు పదార్థాలకు బానిస కాకుండా కాపాడుకుందామని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో గంజాయి, కల్తీ కల్లు తీసుకోవడం వల్ల జరిగే అనర్థాలపై రూపొందిన వాల్ పోస్టర్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఓ ఉపాధ్యాయురాలు పాఠశాలలోనే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో చోటుచేసుకుంది. బుధరావుపేట ప్రభుత్వ మోడల్ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. సైన్స్ టీచర్ హారిక ఆల్ అవుట్(దోమల మందు) తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో హారికను తోటి ఉపాధ్యాయులు నర్సంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి మళ్లీ వరుస సెలవులు రానున్నాయి. రేపు, ఎల్లుండి (గురువారం, శుక్రవారం) రంజాన్ సందర్భంగా సెలవులు, శనివారం వారంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి 4 రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి సోమవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.
Sorry, no posts matched your criteria.