Warangal

News October 16, 2024

ఎన్నో ప్ర‌తిష్ఠాత్మ‌క ప‌థ‌కాల‌కు శ్రీకారం చుట్టాం: మంత్రి సీతక్క

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై ‘X’ వేదికగా మంత్రి సీతక్క స్పందించారు. గాడి త‌ప్పిన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెడుతూ.. ఈ ప‌ది నెల‌ల కాలంలో ఇందిర‌మ్మ ఇండ్లు, కొత్త రేష‌న్ కార్డులు, ఇంటిగ్రేటెడ్ గురుకులాల ఏర్పాటు.. ఇలా ఎన్నో ప్ర‌తిష్ఠాత్మ‌క ప‌థ‌కాల‌కు శ్రీకారం చుట్టామని, ఇప్ప‌టికే 60 వేల‌కు పైగా ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను ప్రజా ప్రభుత్వం భర్తీ చేసిందని చెప్పుకొచ్చారు.

News October 16, 2024

వరంగల్ జిల్లాలో ఏరులై పారిన మద్యం

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం ఏరులై పారింది. ఈ దసరా పండుగకు రూ.142 కోట్లతో ఎక్సైజ్ ఖజానకు వరంగల్ జిల్లా మందుబాబులు భారీగా ఆదాయాన్ని తీసుకొచ్చారు. గతేడాది రూ.94 కోట్ల ఆదాయం రాగా.. ఈసారి అదనంగా మరో రూ.50 కోట్ల వరకు ఆదాయం పెరిగింది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 294 వైన్స్, 134 బార్లు ఉండగా.. పండుగకు 1,29,740 మద్యం కాటన్లు, 2,53,666 బీర్ల కాటన్లు అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు.

News October 16, 2024

జనగామ: గుండెపోటుతో హోంగార్డ్ మృతి

image

గుండెపోటుతో హోంగార్డ్ మృతి చెందిన ఘటన జనగామ జిల్లా కొడకండ్లలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కొడకండ్ల పోలీస్ స్టేషన్లో ఎండి గౌస్ పాషా(48) హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, పాషా గతంలో దేవరుప్పుల పోలీస్ స్టేషన్లో కూడా విధులు నిర్వహించారు. అందరితో సన్నిహితంగా ఉండే పాషా గుండె పోటుతో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News October 16, 2024

వరంగల్ మార్కెట్లో పెరిగిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు మిర్చి ధరలు పెరిగాయి. 341 రకం మిర్చి క్వింటాకు నిన్న రూ.15,000 ధర రాగా.. నేడు రూ.15,500 అయింది. అలాగే తేజ మిర్చి నిన్నటి లాగే రూ.17,500 పలికినట్లు రైతులు తెలిపారు. మరోవైపు వండర్ హాట్ మిర్చి మంగళవారం రూ.14,500 ధర పలకగా నేడు రూ.15 వేలు అయింది.

News October 16, 2024

సీఎం కప్ టార్చ్ ర్యాలీని ప్రారంభించిన వరంగల్ కలెక్టర్

image

వరంగల్ జిల్లా కేంద్రంలోని పోచమ్మ మైదానం చౌరస్తా వద్ద బుధవారం సీఎం కప్ టార్చ్ ర్యాలీని వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారదా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రవీందర్, అదనవు కలెక్టర్ సంధ్యారాణి, హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News October 16, 2024

వరంగల్ మార్కెట్లో స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తిధర పెరిగింది. మంగళవారం క్వింటా కొత్తపత్తి ధర రూ.6,900 ధర పలకగా.. నేడు రూ.7,060కి పెరిగింది. అలాగే పాత పత్తికి నిన్న రూ.7,400 ధర రాగా.. నేడు రూ.7,450 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి మార్కెట్ ధరలలో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు.

News October 16, 2024

BHPL: గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి

image

గుండెపోటుతో చిన్నారి మృతి చెందిన ఘటన BHPL జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబీకుల ప్రకారం.. టేకుమట్ల మండలంలోని పంగిడిపల్లి గ్రామానికి చెందిన రాజు, జమున దంపతులు కొడుకు, కూతురుతో కలిసి జమ్మికుంటలో ఉంటున్నారు. చిన్నారి పాఠశాలకు వెళ్లే క్రమంలో కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి HNK తీసుకెళ్లి చూపించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారన్నారు.

News October 16, 2024

సఖి కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ ప్రావీణ్య

image

సఖి కేంద్రంలో అందిస్తున్న సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్‌లో సఖి కేంద్రం ద్వారా మహిళలకు అందిస్తున్న వివిధ సేవలకు సంబంధించిన పోస్టర్‌తో పాటు వీడియోను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. వివిధ సమస్యలను ఎదుర్కొంటున్న మహిళలు సఖి కేంద్రాన్ని సంప్రదిస్తున్నట్లు చెప్పారు. బాధిత మహిళలకు బాసటగా నిలుస్తోందన్నారు.

News October 15, 2024

వరంగల్: మహిళా కానిస్టేబుల్ మృతి

image

వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నల్లబెల్లి పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ధరణికి ఇటీవల కరెంట్ షాక్ తగిలింది. దీంతో ఆమెను వరంగల్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. మంగళవారం తుది శ్వాస విడిచారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 15, 2024

సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగం: వరంగల్ సీపీ

image

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఇకపై పోలీస్‌ సిబ్బంది తమ వ్యక్తిగతం కాని శాఖపరమైన సమస్యలు ఉంటే నోడల్‌ అధికారి ఫోన్‌ నంబర్‌ 9948685494కు తమ ఫిర్యాదులు, సమస్యలను తెలియజేయాల్సి ఉంటుందన్నాన్నారు.