India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మామూనూరులో విమానాశ్రయ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఇద్దరు ప్రయాణించేలా మూడు చిన్న మైక్రోలైట్ విమానాల ద్వారా ఇక్కడి నుంచి పర్యటించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 775 ఎకరాల్లో ఉన్న విమానాశ్రయం అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా వాతావరణ అనుకూల పరిస్థితులు, సిగ్నల్ వ్యవస్థ తదితరాలపై 2 నెలలపాటు సర్వే చేపట్టేందుకు ప్రత్యేక సర్వే బృందం వచ్చి, 250 ఎకరాలకు సంబంధించి హద్దులు ఏర్పాటుచేశారు.
జనగామలో దారుణం జరిగింది. మతి స్థిమితం లేని ఓ వ్యక్తిపై ముగ్గురు యువకులు చౌరస్తాలో కర్రలతో దాడి చేశారు. స్థానికుల ప్రకారం.. కారు అద్దాలు పగలగొట్టాడని కళాధర్, కమలాకర్, చిర్ర కమలాకర్‌తో పాటు.. మరికొందరు భాస్కర్ అనే వ్యక్తిపై విచక్షణా రహితంగా కర్రలతో దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్రగాయాలపాలైన అతడిని MGMకు తరలించగా.. చికిత్సపొందుతూ మృతి చెందాడు.
WGL నగరానికి తాగునీటి ఎద్దడి ముప్పు పొంచి ఉందని గ్రేటర్ WGL ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. ఎండల నేపథ్యంలో ధర్మసాగర్ పెద్ద చెరువులో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. శనివారం నాటికి చెరువులో ఉన్న 605 మిలియన్ క్యూబిక్ ఫీట్ల నీరు.. మరో 50-60 రోజుల వరకు సరిపోతాయని అంచనా వేస్తున్నారు. దీనిపై గ్రేటర్ WGL పర్యవేక్షణ ఇంజినీర్ ప్రవీణ్‌చంద్ర మాట్లాడుతూ.. వచ్చే జూన్ మొదటి వారం వరకు ఢోకా లేదని అన్నారు.
మాజీ CM KCRను ఆదివారం రాత్రి మాజీ MLA రాజయ్య కలిశారు. ఈ సందర్భంగా కడియంపై అనర్హత వేటు ఖాయమని KCR స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక ఖాయమని, ఇందుకు BRS తరఫున రాజయ్య బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉండాలని KCR సూచించినట్లు సమాచారం. అంతేకాదు, లోక్‌సభ ఎన్నికల్లో కడియంను ఢీకొట్టేందుకు BRS వ్యూహం చేస్తోంది. ఇదివరకు కడియం, రాజయ్య ఒకే పార్టీలో ఉన్నప్పటికీ వారిమధ్య విభేదాలు ఉండేవి.
ధాన్యం కొనుగోలులో ఏమైనా ఇబ్బందులుంటే రైతులు నేరుగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 7995050785కు సంప్రదించవచ్చని కలెక్టర్ ప్రావీణ్య కోరారు. జిల్లాలో 207ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటికే 186 కేంద్రాలున్నాయన్నారు. నర్సంపేట ధాన్యం ఆలస్యంగా రావడం దృష్ట్యా మిగిలిన సెంటర్లను కూడా ప్రారంభిస్తామన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో తేమ శాతం పరిశీలించే యంత్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ MP అభ్యర్థులు, ఇంచార్జిలతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీ అభ్యర్థులు, ఇన్చార్జులు పాల్గొన్నారు. పార్టీ గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్ దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి కావ్య పాల్గొన్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎర్రవల్లిలో మాజీ సీఎం నివాసంలో కేసీఆర్‌ను ఆదివారం కలిశారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్‌ను గెలిపించాలని రాజయ్యకు స్టేషన్ ఘనపూర్ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి వరంగల్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్‌తో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గం ప్రచారం నిర్వహించాలని ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్‌కు కేసీఆర్ సూచించారు.
పదో తరగతి పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రశాంతంగా ముగిసినట్లు క్యాంపు అధికారి,హనుమకొండ DEO ఎండీ. అబ్దుల్ హై, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ డి.చలపతిరావు అన్నారు. వివిధ జిల్లాల నుంచి హనుమకొండకు 2.25 లక్షల సమాధాన పత్రాలు వచ్చినట్లు తెలిపారు.9 రోజుల శిబిరంలో 10 మంది పేపర్ కోడింగ్ అధికారులు, 8 మంది ACOలు, 175 ముఖ్య మూల్యాంకన అధికారులు, 875 సహాయ అధికారులు,500 ప్రత్యేక సహాయకులు పాల్గొన్నారని అన్నారు.
4 రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున:ప్రారంభం కానుంది. గురువారం, శుక్రవారం రంజాన్ సెలవులు, శని, ఆదివారాలు వారాంతపు సెలవుల నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు మార్కెట్ ప్రారంభం కానుండగా.. నాణ్యమైన సరుకులు తీసుకుని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు.
Sorry, no posts matched your criteria.