Warangal

News April 25, 2024

వరంగల్ పార్లమెంటరీ స్థానానికి 19 మంది నామినేషన్ దాఖలు

image

వరంగల్ ఎస్సీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారని జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ పి. ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 21 సెట్లు నామినేషన్ దాఖలు చేశారని కలెక్టర్ అన్నారు. నామినేషన్ స్క్రూటీని భారత ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఏప్రిల్ 26 వరకు ఉంటాయన్నారు. ఏప్రిల్ 29 న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు.

News April 25, 2024

పట్టభద్రుల ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న

image

ఉమ్మడి వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను ప్రకటించారు. ఏఐసీసీ జాతీయ కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఈ మేరకు బుధవారం ప్రకటించారు. గతంలో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా రాజేశ్వర రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.

News April 25, 2024

‘ఎన్నికల సంబంధిత సమస్యలుంటే కాల్ చేయండి’

image

వరంగల్ ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల అంశాలకు సంబంధించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల సాధారణ పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పేర్కొన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు బండారి స్వాగత్ రణవీర్ చంద్, ఐఏఎస్ మొబైల్ నం. 8247524267కు, ఎన్నికల పోలీసు పరిశీలకులు నవీన్ సాయిని, ఐపీఎస్ మొబైల్ నం. 9855127500కు ఫిర్యాదులు చేయవచ్చన్నారు.

News April 25, 2024

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్

image

బల్దియా ప్రధాన కార్యాలయంలో ఎన్నికల నోడల్ అధికారులతో నేడు ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..వరంగల్ (తూర్పు) నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని అన్నారు.లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బల్దియా ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ 9701999645 ను ఏర్పాటు చేశామన్నారు.

News April 25, 2024

మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అవార్డు

image

మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్ష శాస్త్ర విభాగం విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రదర్శించిన జిజ్ఞాస ప్రాజెక్టుకు రాష్ట్రస్థాయిలో రెండవ బహుమతి దక్కింది. ఈ మేరకు కళాశాల విద్యార్థులను ప్రిన్సిపల్ రాజు ఘనంగా సన్మానించారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తూ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ప్రిన్సిపల్ అన్నారు.

News April 25, 2024

ములుగు జిల్లా టాప్

image

ఇంటర్ సెకండీయర్ ఫలితాల్లో రాష్ట్రంలో ములుగు ప్రథమ స్థానంలో నిలిచింది. ములుగు జిల్లా 82.95 శాతంతో తొలి స్థానంలో నిలిచింది. ములుగు జిల్లా వ్యాప్తంగా 1,695 మంది పరీక్ష రాయగా.. 1,406 మంది పాసయ్యారు. 928 మంది బాలురకు గాను 729 మంది(78.56 శాతం) పాసవ్వగా.. 767 మంది బాలికలకు గానూ 677 మంది(88.27శాతం)తో పాసయ్యారు.

News April 25, 2024

ఉమ్మడి WGL జిల్లాలో 77వేల మంది ఇంటర్ విద్యార్థులు

image

నేడు వెలువడనున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షల ఫలితాల కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సుమారు 77వేల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరంలో 38,780 మంది, ద్వితీయ సంవత్సరంలో 39,184 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. కొందరు గైర్హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 134 కేంద్రాలలో పరీక్షలు జరిగాయి.

News April 25, 2024

నేడు వరంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి

image

నేడు వరంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. మడికొండలో జరిగే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో 3గంటలకు పాల్గొనున్నారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య ప్రచారంలో ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో సభకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

News April 25, 2024

జనగామ: పెళ్లైన మరుసటి రోజు రోడ్డు ప్రమాదం.. నవ వధువు మృతి

image

జనగామ జిల్లా నర్మెట్ట మండలం వెల్దండ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ‘స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన స్వాతికి ఆదివారం వివాహం జరిగింది. సోమవారం వేములవాడకు వెళ్తున్న క్రమంలో కరీంనగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తలకి బలమైన గాయం కావడంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News April 25, 2024

కడియం శ్రీహరి పార్టీ మార్పుపై స్పందించిన KCR

image

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ మార్పుపై మాజీ సీఎం KCR తొలిసారి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కడియం శ్రీహరి వెళ్లడం వల్ల మాకు లాభం జరిగిందని, వరంగల్‌లో కడియం శ్రీహరి చచ్చి, బీఆర్ఎస్ పార్టీని బతికించాడని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చూడండి.. ఫలితాలు కనిపిస్తాయని అన్నారు.