India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నర్సంపేట పట్టణంలో పోలీసులు వాహనాల తనిఖీల్లో రూ.6లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నర్సంపేట శివారు మహేశ్వరంలోని చెక్ పోస్టు వద్ద ఆదివారం సాయంత్రం వాహనాలను తనిఖీ చేశారు. వరంగల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ కారులో తరలిస్తున్న రూ.6లక్షలను పట్టుకున్నారు. సరైన లెక్కపత్రాలు చూపకపోవడంతో వాటిని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
డిగ్రీ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఓ విద్యార్థిని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లా రఘునాథ్‌పల్లి మండలం అశ్వరావుపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సోని(20) ఇటీవల విడుదలైన డిగ్రీ ఫలితాల్లో ఫెయిల్ అయింది. మనస్తాపానికి గురైన విద్యార్థిని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.
TRSను BRS మార్చడం తనకు నచ్చలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం ఆయన ఓ మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారినప్పుడే పార్టీ ఓటమి ఖాయమైందన్నారు. దీనిపైనా, పార్టీ నిర్మాణంపైనా అంతర్గత సమావేశాల్లో మాట్లాడానని ఆయన తెలిపారు. తానుఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నానని.. కానీ ఒత్తిడితో తప్పని పరిస్థితుల్లో పోటీచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో LLB 5 ఏళ్ల కోర్సు మొదటి, ఐదో సెమిస్టర్ పరీక్షలు, మూడు ఏళ్ల కోర్సు మొదటి సెమిస్టర్ (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్ విద్యార్థులు) పరీక్షలు ఈ నెల 16 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి నర్సింహాచారి వెల్లడించారు.
గేదెలు కాసినందుకు జీతం డబ్బులు అడిగిన కాపరిపై యజమాని దాడి చేసిన ఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో జరిగింది. బాధితుడు దుర్గం దుర్గయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ముప్పనపల్లికి చెందిన యజమాని అంజయ్యకు చెందిన గేదెలను కాసిన డబ్బులు ఇవ్వాలని అడగగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అంజయ్య కర్రతో దుర్గయ్యపై దాడి చేశాడు. కాగా అంజయ్యపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి ఈరోజు భక్తులు పోటెత్తారు. నేడు ఆదివారం కావడంతో మల్లన్న క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మల్లన్నకు బోనాలు, పట్నాలు, గంగిరేగు చెట్టుకు ముడుపులు, ప్రదక్షిణలు, అభిషేకం, అర్చనలు చేస్తూ స్వామికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామి వారి దర్శనానికి 2 గంటలకు పైగా సమయం పడుతుందని భక్తులు చెబుతున్నారు.
ఆకు రాలే కాలం వచ్చిందంటే అడవుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లుతోంది. 20 రోజుల వ్యవధిలోనే 20 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. చత్తీస్‌గఢ్ గడ్చిరోలిలో 13 మంది మృతి చెందగా.. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు చనిపోయారు. తాజాగా శనివారం తెలంగాణ సరిహద్దు పూజారికాంకేర్ కర్రిగుట్టల(ములుగు జిల్లా) అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
ఐనవోలు మల్లికార్జునస్వామి అలయంలో ఆదివారం పెద్దపట్నంను వైభవంగా నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలి రానుండడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలోనే అత్యంత పెద్దపట్నం వేస్తున్నట్లు ఈవో అద్దంకి నాగేశ్వర్ రావు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా 100 మంది పోలీసులతో భద్రత నిర్వహిస్తున్నట్లు పర్వతగిరి సీఐ శ్రీనివాస్ తెలిపారు.
నిట్ వరంగల్‌లో నిర్వహిస్తున్న వసంతోత్సవ వేడుకల్లో శనివారం రెండో రోజు కల్చరల్ ఫెస్ట్ కలర్ ఫుల్‌గా నిలిచింది. విద్యార్థులు ఉత్సాహంగా 35కు పైగా ఈవెంట్లలో పాల్గొన్నారు. కాగా మూడు రోజుల వసంతోత్సవ వేడుకలు ఆదివారంతో ముగియనున్నాయి. ముగింపు కార్యక్రమానికి సీతారామం సినిమా డైరెక్టర్ హను రాఘవపూడి, హీరో నవదీప్ హాజరు కానున్నారు.
హనుమకొండలోని పెద్దమ్మగడ్డ ఎస్సారెస్పీ కెనాల్ కట్ట పైన ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
లభ్యమయిందని హనుమకొండ పోలీస్‌స్టేషన్ సీఐ సతీశ్ తెలిపారు. పూర్తి వివరాల కోసం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని అన్నారు.
Sorry, no posts matched your criteria.