India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ పార్లమెంట్ BRS అభ్యర్థి మరపల్లి సుధీర్‌కుమార్ నామినేషన్ సందర్భంగా అఫిడవిట్‌లో ఆయన ఆస్తి వివరాలను పొందుపర్చారు. ఆయన కుటుంబానికి రూ.2.04 కోట్ల ఆస్తులు ఉండగా.. టాటా జెస్ట్ కారు, 8తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. హన్మకొండలో 18 ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల వ్యవసాయేతర భూమితో పాటు.. ఒక ఇల్లు ఉంది. మొత్తం 1.79 కోట్ల స్థిరాస్తులుండగా.. ఈయనకు ఎలాంటి అప్పులు, క్రిమినల్ కేసులు లేవు.
దేవరుప్పుల మండలంలోని అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గడ్డం సమ్మయ్య రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పద్మశ్రీ అవార్డు గ్రహీత సమ్మయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. అవార్డు రావడంతో నాపై బాధ్యత మరింత పెరిగిందని గడ్డం సమ్మయ్య అన్నారు.
మంత్రి కొండా సురేఖపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. BRS ఎమ్మెల్యే KTR ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలంటూ BRS అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ సోమవారం హైకోర్టులో పిటిషన్ వేశారు. WGLలో మార్చి 16న నిర్వహించిన సమావేశంలో ఫోన్ ట్యాపింగ్‌లో KTR పాత్ర ఉందంటూ ఆరోపణలు చేశారని మండిపడ్డారు.
వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య సోమవారం నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అఫిడవిట్‌లో పొందుపర్చిన ఆస్తుల వివరాలు.. కావ్యకు రూ.1.55 కోట్ల ఆస్తులు ఉండగా.. సొంతంగా ఇళ్లు, వ్యవసాయ భూములు లేవు. ఆమెతో పాటు తన భర్త మహ్మద్ నజీరుల్లా షేక్ వద్ద రూ.1.15 లక్షల నగదు ఉంది. ఇన్నోవా క్రిస్టా, రాయల్ ఎన్‌ఫీల్డ్, హోండా యాక్టివా ఉన్నాయి. ఇరువురి వద్ద 27 తులాలు, పిల్లల నేరిట 8 తులాల బంగారం ఉంది.
మాజీ మంత్రి కేటీఆర్ నేడు వరంగల్ నగరంలో పర్యటించనున్నారు. హెలికాప్టర్ ద్వారా సుబేదారిలోని ఆర్ట్స్ కళాశాల మైదానానికి 04:30 గంటలకు చేరుకుంటారు. 5 గంటలకు హంటర్ రోడ్డులోని ఓ కన్వెన్షన్ హాల్‌లో వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడతారు. 6 గంటలకు ఉర్సు గుట్ట ప్రాంతంలోని నాని గార్డెన్లో వరంగల్ తూర్పు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణా సంస్థ (SDDGWTTI) హైదరాబాద్ నందు 3 సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి కె.మధురిమ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనాధ బాలికలు, పదవ తరగతి పూర్తయిన వారు మే 17 సా. 4.00లోగా దరఖాస్తులను సమర్పించాలని కోరారు.
పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. సోషల్ మీడియాపై నిఘా పెంచారు. ఇందులో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు సోషల్ మీడియా వేదికగా జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు గుర్తించి, సుమోటోగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల వేళ ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్‌లు పెడితే చర్యలు తీసుకుంటామని పోలిసులు హెచ్చరిస్తున్నారు.
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మరిపెడ శివారు మాకుల తండాకు చెందిన ఇస్లావత్ శ్రీనివాస్ అనే రైతు అప్పులు కావడంతో అప్పులు తీర్చలేననే బాధతో సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు సోమవారం ఒక సెట్ నామినేషన్ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.
లంచం తీసుకుంటూ పట్టుబడిన మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ తస్లీమా గతనెల 22న లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని భావించిన అధికారులు హన్మకొండలోని ఆమె నివాసంతో పాటు తస్లీమా భర్త నివాసముంటున్న సూర్యాపేటలోనూ ఏసీబీ సోదాలు చేపట్టింది.
Sorry, no posts matched your criteria.