Warangal

News April 10, 2024

WGL: మోడల్ స్కూల్‌లో టీచర్ ఆత్మహత్యాయత్నం

image

ఓ ఉపాధ్యాయురాలు పాఠశాలలోనే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో చోటుచేసుకుంది. బుధరావుపేట ప్రభుత్వ మోడల్ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. సైన్స్ టీచర్ హారిక ఆల్ అవుట్(దోమల మందు) తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో హారికను తోటి ఉపాధ్యాయులు నర్సంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 10, 2024

వరంగల్ మార్కెట్‌కు నాలుగు రోజుల వరుస సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి మళ్లీ వరుస సెలవులు రానున్నాయి. రేపు, ఎల్లుండి (గురువారం, శుక్రవారం) రంజాన్ సందర్భంగా సెలవులు, శనివారం వారంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి 4 రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి సోమవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.

News April 10, 2024

వరంగల్: పత్తి ధర క్వింటాకి రూ.7260

image

ఐదు రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు పున:ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌కి పత్తి తరలిరాగా.. కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. అయితే పత్తి ధర మాత్రం గత వారంతో పోలిస్తే ఈరోజు స్వల్పంగా తగ్గింది. నేడు క్వింటా పత్తి ధర రూ.7260 పలికింది.

News April 10, 2024

HNK: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

image

హన్మకొండ నగరంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. స్థానికులు వివరాల ప్రకారం.. కాజీపేటకు చెందిన సయ్యద్ వహీద్, అష్రఫ్‌లు బైక్ పై హన్మకొండ వైపు వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన ఒక కారును బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో వహీద్ అక్కడికక్కడే మృతిచెందగా.. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా అష్రఫ్ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 10, 2024

వరంగల్: మరో 6 రోజులే గడువు

image

ఈనెల 18న లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. మే 13న పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు చాలా మంది ఓటరుగా పేరు నమోదు చేసుకోలేదు. 2006 మార్చి 31లోపు పుట్టిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవడానికి మరో 6 రోజుల సమయం ఉంది. ఫారం-6 నింపి, ధ్రువీకరణ పత్రాల నకలు, పాస్ ఫొటోలు జతపర్చి స్థానిక బీల్వోకు అందజేయండి. లేదంటే స్థానిక మీసేవ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు, మార్పులు కూడా చేసుకోవచ్చు.

News April 10, 2024

కేయూ డిగ్రీ కోర్సుల పరీక్షల టైం టేబుల్

image

KU పరిధి డిగ్రీ కోర్సుల పరీక్షలకు సంబంధించి KU పరీక్షల నియంత్రణాధికారి నర్సింహాచారి నోటిఫికేషన్ విడుదల చేశారు. BA, Bcom, BSC, BCA BBA BA(ఎల్ఎం)కు సంబంధించిన 2వ, 6వ సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి ప్రారంభం కానున్నాయి. డిగ్రీ కోర్సుల 4వ సెమిస్టర్ పరీక్షలు మే 7 నుంచి జరగనున్నాయి. 2వ సెమిస్టర్ పరీక్షలు మే 6, 8, 10, 16, 18, 21, 23, 25 తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.

News April 10, 2024

రేపు వరంగల్ మార్కెట్ పునః ప్రారంభం

image

5రోజుల సుదీర్ఘ విరానంతరంమం అ వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం పున:ప్రారంభం కానుంది. శుక్రవారం బాబు జగ్జీవన్ రావు జయంతి, శని, ఆదివారాలు వారాంతపు సెలవులు, సోమవారం అమావాస్య, నేడు ఉగాది నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు మార్కెట్ ప్రారంభం కానుండగా.. నాణ్యమైన సరుకులు తీసుకుని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు.

News April 9, 2024

వేయి స్తంభాల ఆలయ పంచాంగ శ్రవణంలో పాల్గొన్న సీపీ

image

ఉగాది పండుగ సందర్భంగా హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ అంబర్ కిషోర్ ఝూ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం పూర్తికాగానే కవి సమ్మేలనం జరిగింది. ఈ సందర్భంగా కవులతో పాటు ఆలయ ఈవో వెంకటయ్యను సీపీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

News April 9, 2024

MHBD: ప్రేమ వివాహం.. అబ్బాయిపై దాడి

image

ప్రేమ వివాహం చేసుకున్నాడని అమ్మాయి తరఫువాళ్లు అబ్బాయిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ ఘటన MHBD జిల్లాలో జరిగింది. డోర్నకల్ మండలంలోని ఓ తండాకు చెందిన గణేశ్, ఓ యువతి ప్రేమించుకొని ఇటీవల HYDలో పెళ్లి చేసుకున్నారు. దీంతో యువతి తండ్రి డోర్నకల్ ఠానాలో కేసు పెట్టగా.. ఆమెను వారి తల్లిదండ్రులతో పంపించారు. అదేరోజు గణేశ్ ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా అమ్మాయి తరఫువాళ్లు గణేశ్, అతడి తల్లిపై దాడి చేశారు.

News April 9, 2024

జనగామ: పండగ వేల విషాదం.. యువకుడు మృతి

image

జనగామ మండలం పెంబర్తి గ్రామంలో పండగ వేల విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మేకల శ్రీకాంత్(26) అనారోగ్యంతో ఆకస్మిక మృతి చెందారు. మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, స్నేహితులు సైతం కన్నీరు మున్నీరు అవుతున్నారు. కాగా, ఇతనికి 6 నెలల క్రితమే వివాహం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.