India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
WGLలోని సత్యసాయి నగర్‌లో మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అస్మ, మజార్ ఫిబ్రవరిలో రెండో వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో మనస్తాపానికి గురై అస్మ శనివారం సాయంత్రం ఇంట్లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. మజార్ పెట్రోల్ పోసి నిప్పంటించాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం MGMలో చికిత్స పొందుతోంది.
వేసవి రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్- దానాపూర్ మధ్య కాజీపేట మీదుగా ప్రత్యేక రైలు నడపనున్నారు. 07021/22 నంబర్‌తో సికింద్రాబాద్-దానాపూర్ మధ్య ఏప్రిల్ 25, మే 2, 9, 16, 23, 30, జూన్ 6, 13, 20, 27 తేదీలలో ప్రతి గురువారం ఉదయం 8:30 గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది. అలాగే దానాపూర్ సికింద్రాబాద్‌ల మధ్య ఈ రైలు ఏప్రిల్ 21, 28, మే 5, 12, 19, 23, 30, జూన్ 2, 9, 16, 23, 30 తేదీల్లో ఆదివారం ఈ రైలు ఉంటుంది.
మహబూబాబాద్ ఐడిఓసి లోని జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో శనివారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ కళావతి బాయి వైద్యారోగ్యశాఖలోని ప్రోగ్రాం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా ప్రజారోగ్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలన్నారు.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వ్యయ ఖర్చులను రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఎన్నికల వ్యయ ఖర్చుల పరిశీలకులు ఏ.దిలిబన్ అధికారులకు ఆదేశించారు. శనివారం స్టేషన్‌ఘనపూర్‌లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు డబ్బు, మద్యంపై నిఘా పెట్టాలన్నారు. ఎన్నికల వ్యయసంబధిత అంశాలపై ఫిర్యాదులు చేయవచ్చని ప్రజలకు సూచించారు.
స్టేషన్‌ఘనపూర్ నుంచి హనుమకొండకు వచ్చే జాతీయ రహదారిపై పెద్ద పెండ్యాల గ్రామ శివారులో శనివారం రాత్రి ఆటో, లారీ ఢీకొని ఒకరు మృతిచెందారు. పెట్రోల్ లోడుతో వెళ్తున్న హెచ్పీ కంపెనీ లారీని ప్యాసింజర్ ఆటోడ్రైవర్ ఓవర్‌టేక్ చేయబోయాడు. ఈ క్రమంలో ఆటో అదుపు తప్పి లారీ ఢీకొని చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలకేంద్రంలోని వడ్డెర కాలనీకి చెందిన బండారి అఖిల (19) పెళ్లి విషయమై నానమ్మతో గొడవపడి తీవ్ర మనస్తాపానికి గురై క్షణికావేశంలో ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరేసుకుని మృతిచెందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నగేష్ తెలిపారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వస్తున్న తనను ఆశీర్వదించి గెలిపిస్తే భూపాలపల్లికి రైల్వే లైన్ తీసుకువస్తానని ఆరూరి రమేశ్ తెలిపారు. శనివారం ప్రచారంలో భాగంగా రమేశ్ మాట్లాడుతూ.. భూపాలపల్లి ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయిస్తానన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదని చెప్పారు.
మహబూబాబాద్ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ పూర్తి వివరాలతో అఫిడవిట్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. తనపై 6 క్రిమినల్ కేసులున్నాయని, కుటుంబ ఆస్తుల విలువ రూ.2.99 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. మజీద్‌పూర్‌లో సర్వే నం.66 నుంచి 174 వరకు మొత్తం 180.34 ఎకరాల భూమిలో 1/3వ వంతు వాటా ఉందన్నారు. కుటుంబానికి 33 తులాల బంగారు ఆభరణాలున్నాయని, రూ.2.52 కోట్ల అప్పులున్నాయని వెల్లడించారు.
మహబూబాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఎస్టీ స్థానమైనా మహబూబాబాద్.. ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాల్లో విస్తరించి ఉంది. ఇందులో నర్సంపేట జనరల్ స్థానం కాగా.. డోర్నకల్, మహబూబాబాద్, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం ఎస్టీ నియోజకవర్గాలు. ఈ స్థానంలో ఒకటి మినహా మిగతావి ఎస్టీ రిజర్వేషన్ కావడం గమనార్హం.
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) రెండో సంవత్సరం, రెండో సెమిస్టర్ (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) పరీక్ష ఫీజు తేదీని కేయూ అధికారులు ప్రకటించారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 29లోపు చెల్లించవచ్చని విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి నర్సింహా చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి రాధిక తెలిపారు. ఆలస్య రుసుంతో మే 5 వరకు చెల్లించవచ్చన్నారు.
Sorry, no posts matched your criteria.