India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జబల్‌పూర్- మధురై మధ్య నడిచే 16057/58 ప్రత్యేక రైలుకు వరంగల్‌లో హాల్టింగ్ కల్పించారు. దీంతో పాటు బెల్లంపల్లి, పెద్దపల్లి, ఖమ్మం స్టేషన్లలో ఆపనున్నారు. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన ఈ రైలుకు మంచి ఆదరణ ఉండటంతో వరంగల్‌లో నిలపడానికి అధికారులు ఒప్పుకొన్నారు.జబల్‌పూర్ నుంచి మధురై వెళ్లే ఈ రైలు వరంగల్‌లో శుక్రవారం ఉ.5.52 గంటలకు, తిరుగు ప్రయాణంలో ఆదివారం సా.6.20 గం.కు అందుబాటులో ఉంటుంది.
జనగామ జిల్లా మొండ్రాయి గిర్ని తండా గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే ప్రధాని లక్ష్యంగా పనిచేయాలని మాజీ ఎంపీకి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వరంగల్ నగరంలోని 14వ డివిజన్ ఏనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్సార్ నగర్‌కు చెందిన మార్త ఓo ప్రకాష్ అనే పురోహితుడు శుక్రవారం తెల్లవారుజామున తన ఇంటి మేడపై ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన అతని భార్య, పిల్లలు కేకలు వేయగా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
అధికారం, పదవి ఎక్కడ ఉంటే అక్కడ కడియం శ్రీహరి ఉంటారని బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్ ఆరోపించారు. హనుమకొండలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘కడియం శ్రీహరి నీ మాటలు, వేషాలు, ఆరోపణలు చూసి ఊసరవెల్లులే సిగ్గుపడుతున్నాయి. మరోసారి నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తే నీ జాతకమంతా బయటపెడతా’ అని అన్నారు.
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ప్రచార రథాలను స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ సింగపురం ఇందిర ప్రారంభించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వస్తున్న కడియం కావ్యను ప్రజలు భారీ మెజారిటీతో ఆశీర్వదించి పార్లమెంటుకు పంపాలన్నారు.
వరంగల్ ఎస్సి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల అంశాలకు సంబంధించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు ఎన్నికల వ్యయ పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు ఏ.ధిలీబన్ నంబర్ 8309921306కు అదేవిధంగా వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌లకు ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై ఎన్నికల వ్యయ పరిశీలకులు ధీరజ్ సింగా 8309952057కు చేయవచ్చన్నారు.
సిద్దిపేట జిల్లా దుద్దెడ టోల్ గేట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జనగామ జిల్లా బచ్చన్నపేటకి చెందిన సందేల అశోక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అశోక్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో వంశీ అనే యువకుడు<<13076185>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. SI సాయి ప్రసన్నకుమార్ కథనం ప్రకారం.. గతేడాది ఇంటర్ పరీక్షల్లో వంశీ ఫెయిలయ్యాడు. ఇటీవల సప్లిమెంటరీ కూడా రాశాడు. అయితే మరోసారి పరీక్షలో తప్పుతానన్న భయంతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం తల్లి చూడగా మృతి చెంది ఉన్నాడని SI తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు SI చెప్పారు.
టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి టెట్ ఉచిత శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను జిల్లా కేంద్రంలోని ఉమాపతి భవన్‌లో ఆ సంఘం నేతలు ఆవిష్కరించారు. ఉచిత శిక్షణ కోసం 9573141365 నంబర్‌కు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
దుర్గాబాయి దేశ్ ముఖ్ ప్రభుత్వ మహిళ టెక్నికల్ శిక్షణా సంస్థ HYD, పాలిటెక్నిక్ డిప్లమో కోర్సులకు 2024-25 విద్యాసంవత్సరానికి జనగామ జిల్లాలోని అనాథ బాలికలు, పేదరికంలో ఉన్న బాలికలు పదవ తరగతి పూర్తి చేసిన బాలికలకు అర్హత పరీక్ష లేకుండా పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి జయంతి ఒక ప్రకటనలో తెలిపారు. మే 15లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.