India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో మే 1 నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరం నిర్వహణకు ఉత్సాహవంతులైన వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకట్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 9182552593 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
విజయవాడ పార్లమెంట్ స్థానానికి జనగామ వాసి నామినేషన్ వేసినట్లు ఆ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఢిల్లీ రావు తెలిపారు. తొలిరోజు 4 నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా జనగామ జిల్లాకు చెందిన అర్జున్ చేవిటి రెండు నామినేషన్లు, సోషలిస్ట్ యునిటీ సెంటర్ ఆఫ్ ఇండియా(కమ్యూనిస్ట్) అభ్యర్థిగా విజయవాడ అజిత్ సింగ్ నగర్‌కు చెందిన గుజ్జుల లలిత రెండు దాఖలు చేశారన్నారు.
సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైనది. 15 వరంగల్ ఎస్సి పార్లమెంట్ నియోజక వర్గానికి సంబంధించి మొదటి రోజు మొత్తం 3 నామినేషన్లు దాఖలు అయ్యాయని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. అలయెన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థిగా అంబోజు బుద్దయ్య, ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిగెల శివ, పిరమిడ్ పార్టీ అఫ్ ఇండియాపార్టీ అభ్యర్థినిగా తౌటపల్లి నర్మదా ఒక్కొ సెట్ చొప్పున నామినేషన్లు వేశారన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని, కార్యకర్తలు వాటిని తిప్పి కొట్టాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పర్వతగిరి మండల స్థాయి ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మార్పు, మార్పు అని ప్రజలు మోసపోయారని, ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలను తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
డా.బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల ఫీజును ఈ నెల 26లోగా చెల్లించాలని జనగామ అభ్యసన కేంద్రం సమన్వయకర్త శ్రీనివాస్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మే 17 నుంచి పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. కావున విద్యార్థులు ఫీజు నిర్ణీత తేదీలోగా చెల్లించాలని కోరారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వంశీ (21) గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
డా.బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల ఫీజును ఈ నెల 26లోగా చెల్లించాలని జనగామ అభ్యసన కేంద్రం సమన్వయకర్త శ్రీనివాస్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మే 17 నుంచి పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. కావున విద్యార్థులు ఫీజు నిర్ణీత తేదీలోగా చెల్లించాలని కోరారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 19, 24 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. 19న హెలీకాప్టర్‌లో మహబూబాబాద్‌కు చేరుకుంటారు. స్థానిక ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అదే రోజు ఉదయం కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ నామినేషన్ వేయనున్నారు. 24న హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
మాజీ సర్పంచి విడుదల చేసిన ఓ ప్రకటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంకి చెందిన మాజీ సర్పంచి శ్రీధర్ రూ.15 లక్షల అప్పు చేసి RWS అధికారులు, పంచాయితీ తీర్మానంతో గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ బాగుచేయించాడు. అయితే తన పదవీకాలం ముగిసినా MB రికార్డు చేయలేదని, అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. ‘బిల్లులు ఇవ్వకపోతే సూపైడ్ చేసుకుంటానంటూ’ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
హత్య కేసులో ముగ్గురు నిందితులను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు. ఈ నెల 15న జనగామ ఆర్టీసీ చౌరస్తాలో పట్టణంలోని బాణాపురం వాసి బోయిని భాస్కర్‌ను కర్రలతో కొట్టి అతని మృతికి కారణమయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రఘునాథపల్లికి చెందిన కుర్ర కమలాకర్, కుర్ర కళాధర్, చిల్పూర్‌కు చెందిన చిర్ర శ్రవణ్‌ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.