India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ములుగు జిల్లా-చతీస్‌ఘడ్ సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య శనివారం తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతదేహాలతో పాటు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్ ములుగు జిల్లా పరిధిలోని తెలంగాణ బార్డర్‌లో జరిగింది.
మారుమూల ప్రాంతంలో పుట్టి ఫెన్సింగ్ అంతర్జాతీయ క్రీడల్లో రాణిస్తోంది కాటారం మండల కేంద్రానికి చెదిన దేవరకొండ దీక్షిత. ప్రస్తుతం HYD స్పోర్ట్స్ స్కూల్‌లో ఇంటర్ చదువుతూ.. పంజాబ్‌లోని పటియాలలో ఫెన్సింగ్ క్రీడలో శిక్షణ పొందుతున్నారు. అంతేకాదు, పారిస్‌లో జరిగిన విదేశీ శిక్షణకు ఎంపికై గత డిసెంబర్లో 15రోజుల పాటు శిక్షణ పూర్తి చేశారు. దేశం తరఫున ఆడి బంగారు పతకం సాధించడమే తన లక్ష్యమని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని భీమునిపాదం జలపాతం వద్ద పర్యాటకులను ఆకట్టుకునేలా వివిధ సొబగులను దిద్దుతున్నారు. రూ.40లక్షల వ్యయంతో జలపాతం ఎదురుగా వాచ్ టవర్, 14 బల్లాలను, బండరాళ్లతో నడక దారి పనులు చేస్తున్నారు. వంటలు చేసుకునేలా గదులు, బోరు, దుస్తులు మార్చుకునే గదులను ఏర్పాటు చేశారు. పర్యాటకుల భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన హసన్‌పర్తి మండలంలో చోటుచేసుకుంది. SI అశోక్ ప్రకారం.. ఆరెపల్లికి చెందిన యాద రాకేశ్(24).. ఎల్కతుర్తిలోని బంధువుల పెళ్లికి స్నేహితుడితో కలిసి వెళ్లాడు. ఇంటికి వచ్చి మళ్లీ పెళ్లికి వెళ్తుండగా.. అనంతసాగర్ శివారులో వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాకేశ్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల శాసన మండలి ఉప ఎన్నికల కోసం ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఇందులో వరంగల్ జిల్లాకు సంబందించిన గ్రాడ్యుయేట్స్ ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 43,594 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇందులో 26,907 మంది పురుషులు, 16,687 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
వరంగల్ జిల్లాలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం ఈనెల 7న పరీక్ష నిర్వహిస్తున్నట్లు డీఈవో డాక్టర్ ఎండి.అబ్దులై తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశాల కోసం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7 నుంచి 10 తరగతుల్లో ప్రవేశాల కోసం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని మూడు మోడల్ స్కూళ్లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
HNK-KNR ప్రదాన రహదారిలోని నయీంనగర్ నాలాపై పాత వంతెన కూల్చే పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా MLA నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. 3 నెలల్లో కొత్త వంతెన పనులను పూర్తి చేస్తామని అన్నారు. గత ఐదేళ్లుగా నాలాను ఆనుకొని ఉన్న కాలనీలు వర్షాకాలంలో ముంపునకు గురవుతూ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారని తెలిపారు. దీనికి శాశ్వత పరిష్కారంగా కొత్త వంతెన నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.
కేయూ సెనెట్ హాల్‌లో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతిని శుక్రవారం విశ్వవిద్యాలయ SC/ST సెల్ సంచాలకులు డాక్టర్ టి.రాజమణి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా “కాంటెంపరరీ ఇష్యూస్ ఆఫ్ ఇండియన్ సొసైటీ” అనే అంశంపై కీలక ఉపన్యాసం చేసి మాట్లాడారు. అనంతరం రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి జస్టిస్ చంద్ర కుమార్ మాట్లాడుతూ.. తెర వెనుక ఏమి జరుగుతుందో నేటి యువత తెలుసుకోవాలన్నారు.
2023 డిసెంబరులో నిర్వహించిన కేయూ డిగ్రీ (బి.ఎ/బి.కాం/బి.ఎస్.సి/బిబిఎ/హనర్స్/వొకేషనల్) 1వ, 3వ,5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వైస్ ఛాన్సలర్ రమేశ్ విడుదల చేశారు. మొదటి సెమిస్టర్ పరీక్షల్లో 24.41% ఉత్తీర్ణత, 3వ సెమిస్టర్ పరీక్షల్లో 30%, 5వ సెమిస్టర్ పరీక్షల్లో 44.45% ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. వివరాలకు www.kakatiya.ac.inలో చూడవచ్చని పరీక్షల నియంత్రణ అధికారి నరసింహ చారి తెలిపారు.
హనుమకొండ జిల్లా కాజీపేట సమీపంలోని నిట్ క్యాంపస్‌లో శుక్రవారం స్ప్రింగ్ స్ప్రీ ఘనంగా ప్రారంభమైంది. శనివారం రాత్రి ఘనంగా ప్రో షో నిర్వహించారు. ఈ షోలో ప్రముఖ సింగర్లు హరిచరణ్, శిరీష పాటలు పాడి విద్యార్థులను ఉత్సాహపరిచారు. వారు పాటలు పాడుతున్నంత సేపు విద్యార్థులు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు.
Sorry, no posts matched your criteria.