India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హనుమకొండ జిల్లాలో కాసేపటి క్రితం దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎల్కతుర్తి మండలం వీర్నరాయణపూర్‌లో తల్లిని కొడుకు గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. మృతురాలు వీర్నరాయణపూర్ గ్రామానికి చెందిన చదిరం రేవతిగా గుర్తించారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన సీపీగా సన్ ప్రీత్ సింగ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన సీపీ గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఓఎస్‌డీగా పనిచేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న అంబర్ కిషోర్ ఝాను రామగుండం పోలీస్ కమిషనరేట్ కమిషనర్‌గా నియమించారు.
మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రాజారాం, కానిస్టేబుల్ సుధాకర్‌ను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తూ ఐ.జి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్‌పైన విశ్రాంతి గదిలో ఇద్దరు బయట వ్యక్తులతో కలిసి మద్యం తాగినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై విచారణ జరిపి సస్పెండ్ చేసినట్లు ఐజీ వెల్లడించారు.
కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300 ఉంటే అందరికి వచ్చే ప్రమాదముంది. ఉమ్మడిWGLలో గాలినాణ్యత విలువ 104గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరముంది.ఏమంటారు!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి పాఠశాల, కళాశాలల్లో ప్రవేశం పొందేందుకు గడువు పొడిగించారు. 5 నుంచి 8వ తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశం పొందేందుకు మార్చి 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు జనగామ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వరంగల్ జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రెండవ రోజు ప్రశాంతంగా ముగిశాయి. పేపర్ ఏ సెట్ వచ్చింది. రెండవ రోజు మొత్తం 5626కి 5473 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 153 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయినట్లు అధికారులు తెలిపారు. మాల్ ప్రాక్టీస్ కింద ఎవరు దొరకలేదని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండల పోలీస్ స్టేషన్లోనే హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ మందు పార్టీ చేసుకోవడం వివాదాస్పదమైంది. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు గురువారం సోషల్ మీడియాలో వైరలయ్యాయి. పోలీస్ స్టేషన్ అధికారుల తీరుపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ విచారణ జరిపి సదరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధరలో ఎలాంటి మార్పు లేదు. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,880 పలకగా.. మంగళవారం రూ.6,920 పలికింది. బుధవారం స్వల్పంగా తగ్గి రూ.6,900కి చేరింది. అయితే గురువారం సైతం రూ.6,900 పలికినట్లు మార్కెట్ వ్యాపారులు తెలిపారు. అయితే పత్తి ధరలు పెరగకపోవడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపూరం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. దాదాపు 20 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జీడిగట్టుతండా నుంచి ఇటుకలపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 35 మంది ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వరంగల్ జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ మొదటి రోజు ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం వరంగల్ జిల్లాలో 6,266 మొదటిరోజు 5,999 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. 267 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు. మొదటి రోజు ఒకరు మాల్ ప్రాక్టీస్ చేస్తే పట్టుపడ్డారు.
Sorry, no posts matched your criteria.