India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మంత్రి సీతక్క కుమారుడు, కాంగ్రెస్ యూత్ నాయకుడు దనసరి సూర్య మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. మంగపేట మండలంలో తన పర్యటన ముగించుకొని వస్తున్న నేపథ్యంలో బోరు నరసాపురం గ్రామానికి చెందిన అజ్జు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో స్వయంగా తన వాహనంలో మంగపేట ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వైద్యులతో సూర్య మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజు పల్లి టోల్ గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా వస్తూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
కొందరికి తీవ్ర గాయాలు కాగా.. అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి స్థానికులు తరలించారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంపీ అభ్యర్థి కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. అనంతరం వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 3గంటల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. గత రెండు రోజులుగా 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు మళ్లీ 3రోజులు వరుస సెలవులు రానున్నాయి. శుక్రవారం బాబు జగ్జీవన్ రావు జయంతి, శని, ఆదివారాలు వారాంతపు సెలవుల నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు విషయాన్ని గమనించి ఈ మూడు రోజులు మార్కెట్‌కు సరుకులు తీసుకొని రావద్దని, సహకరించాలని అధికారులు కోరారు.
తెలంగాణ రాష్ట్ర స్టడీ సర్కిల్ మైనార్టీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ
అభ్యర్ధులకు ‘యూపీఎస్సి సీ-శ్యాటు’ ఉచిత శిక్షణకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి బి.రవీందర్ తెలిపారు. ఈ శిక్షణకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈనెల 12గా www.tmreistelangana.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.
వదినును తల్లిని చేసి వదిలేసిన దుర్మార్గపు ఘటన ఇది. నల్లబెల్లి చిన్నతండాకు చెందిన రాజుకు చెన్నరావుపేట(M)కు చెందిన మమతతో 2017లో పెళ్లైంది. రాజుకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో మరిది శ్రీనుతో పిల్లలు కంటే ఆస్తి మనదేనని అత్తామామలు నమ్మబలికారు. ఈక్రమంలో శ్రీను, మమతకు ఇద్దరు పిల్లలు పుట్టారు. తర్వాత మమతతో గొడవపడి పుట్టింటికి పంపేశారు. శ్రీను వేరే పెళ్లికి రెడీ కావడంతో మమత పోలీసులను ఆశ్రయించింది.
అనారోగ్యంతో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ సీఐ కథనం ప్రకారం.. నెక్కొండ మండలం రెడ్డవాడకు చెందిన నవీన్(24) నాలుగు నెలలుగా గొంతునొప్పితో బాధపడుతూ.. MGMలో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం HYDకి వెళ్లాలని వైద్యులు సూచించారు. భయాందోళనకు గురైన నవీన్ అదేరోజు రాత్రి జాన్‌పీరీలు గేట్ సమీపంలో పుష్‌పుల్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతిపై అత్యాచారం చేసిన ఘటనపై బుధవారం సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. KNRకు చెందిన నర్సింగ్ విద్యార్థిని WGL ప్రభుత్వ సంస్థలో శిక్షణ పొందుతోంది. ఇటీవల కామారెడ్డికి చెందిన సతీశ్‌తో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో సతీశ్ ఆమెను కామారెడ్డికి రావాలని కోరగా.. రెండ్రోజుల కిందట వెళ్లింది. ఆమెకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నీటి సరఫరా జరిగే క్రమంలో ఏర్పడే సందేహాల నివృత్తికి ప్రత్యేక ఫోన్ నంబర్ 7207908583ను ఏర్పాటు చేసినట్లు వరంగల్ బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే తెలిపారు. 66 డివిజన్ల వ్యాప్తంగా ఉ.6 గం.ల నుంచి రా. 8 గం.ల వరకు నీటి సరఫరా జరిగే సమయాల్లో ఇబ్బందులు ఏర్పడితే సూచించిన నంబరుకు సమాచారం అందించాలన్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తారన్నారు.
Sorry, no posts matched your criteria.