India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ధాన్యం కొనుగోలులో ఏమైనా ఇబ్బందులుంటే రైతులు నేరుగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 7995050785కు సంప్రదించవచ్చని కలెక్టర్ ప్రావీణ్య కోరారు. జిల్లాలో 207ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటికే 186 కేంద్రాలున్నాయన్నారు. నర్సంపేట ధాన్యం ఆలస్యంగా రావడం దృష్ట్యా మిగిలిన సెంటర్లను కూడా ప్రారంభిస్తామన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో తేమ శాతం పరిశీలించే యంత్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ MP అభ్యర్థులు, ఇంచార్జిలతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీ అభ్యర్థులు, ఇన్చార్జులు పాల్గొన్నారు. పార్టీ గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్ దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి కావ్య పాల్గొన్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎర్రవల్లిలో మాజీ సీఎం నివాసంలో కేసీఆర్‌ను ఆదివారం కలిశారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్‌ను గెలిపించాలని రాజయ్యకు స్టేషన్ ఘనపూర్ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి వరంగల్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్‌తో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గం ప్రచారం నిర్వహించాలని ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్‌కు కేసీఆర్ సూచించారు.
పదో తరగతి పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రశాంతంగా ముగిసినట్లు క్యాంపు అధికారి,హనుమకొండ DEO ఎండీ. అబ్దుల్ హై, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ డి.చలపతిరావు అన్నారు. వివిధ జిల్లాల నుంచి హనుమకొండకు 2.25 లక్షల సమాధాన పత్రాలు వచ్చినట్లు తెలిపారు.9 రోజుల శిబిరంలో 10 మంది పేపర్ కోడింగ్ అధికారులు, 8 మంది ACOలు, 175 ముఖ్య మూల్యాంకన అధికారులు, 875 సహాయ అధికారులు,500 ప్రత్యేక సహాయకులు పాల్గొన్నారని అన్నారు.
4 రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున:ప్రారంభం కానుంది. గురువారం, శుక్రవారం రంజాన్ సెలవులు, శని, ఆదివారాలు వారాంతపు సెలవుల నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు మార్కెట్ ప్రారంభం కానుండగా.. నాణ్యమైన సరుకులు తీసుకుని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు.
ఈ నెల 18న లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. మే 13న పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఓటరుగా పేరు నమోదు చేసుకోలేదు. 2006 మార్చి 31లోపు పుట్టిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఈ నెల 15 వరకు సమయం ఉంది. ఫారం-6 నింపి, ధ్రువీకరణ పత్రాల నకలు, పాస్ ఫొటోలు జతపర్చి స్థానిక BLOకు అందజేయండి. లేదంటే స్థానిక మీసేవ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు మార్పులు చేసుకోవచ్చు.
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పరావుపేటలో ఈ నెల 11న జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. సీఐ చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. అలంఖానిపేటకు చెందిన దంతాల రవి అప్పలరావుపేటలో చర్చి పాస్టర్‌గా పని చేస్తున్నాడు. రోజూ చర్చికి వెళ్లే వీరభద్రరావుకు రవికి పరిచయం ఏర్పడింది. దీంతో రవి.. వీరభద్రరావు ఇంట్లో లేని సమయంలో 6 తులాల బంగారం, రూ.60,200 చోరీ చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు.
క్రికెట్ ప్లేయర్లకు HYD క్రికెట్ అసోసియేషన్ శుభవార్త చెప్పింది. HCA ఆధ్వర్యంలో ఈనెల 20న జిల్లాల వారిగా సమ్మర్ క్యాంప్ మొదలుపెడుతామని ప్రెసిడెంట్ జగన్ మోహన్‌రావు తెలిపారు. ఉచితంగానే ఈ క్యాంప్ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందన్నారు.
కేంద్రాల వివరాలు:
వరంగల్: 98495 70979,
ములుగు: 90301 30727,
మహబూబాబాద్: 98664 79666,
భూపాలపల్లి: 88978 05683.
కాకతీయుల కట్టడాలున్న ఖిలా వరంగల్ కోట సమాచారంతో పాటు కాకతీయుల చరిత్రను పర్యాటకులకు డిజిటల్ విధానంలో అందించేందుకు కేంద్ర పురావస్తు శాఖ అధికారులు శ్రీకారం చుడుతున్నారు. ఈమేరకు కాకతీయుల చరిత్రను క్యూఆర్ కోడ్‌లో నిక్షిప్తం చేసి బోర్డులను ఖిలా వరంగల్ కోట పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పర్యాటకులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడంతో కట్టడాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
Sorry, no posts matched your criteria.