India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ కాంగ్రెస్ పార్లమెంట్ స్థానం రోజుకో మలుపు తిరుగుతోంది. BRS సిట్టింగ్ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు టికెట్ ఇవ్వకుండా కడియం కావ్యకు టికెట్ ఇవ్వడంతో ఆయన పార్టీ మారారు. తీరా కావ్య సైతం ఇటీవల BRSకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరగా.. ఆమెకు కాంగ్రెస్ టికెట్ ఖరారు చేసింది. దీంతో BRS మరో అభ్యర్థిని అన్వేశించాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా, BJP టికెట్ ఆరూరి రమేశ్‌కు కేటాయించిన విషయం తెలిసిందే.
జాతర సమయంలో వనదేవతల దర్శనానికి రాని భక్తులు ప్రస్తుతం మేడారానికి తరలివస్తున్నారు. అయితే జాతరకు వస్తున్న భక్తులపై ఎండ ప్రభావం తీవ్రంగా పడుతోంది. దర్శించుకునే క్రమంలో గద్దెల ప్రాంగణంలో నీడ లేకపోవడం, కింద పూర్తిగా నాపరాళ్లు ఉండటంతో.. అవస్థలు తప్పట్లేదు. దీంతో గోవిందరాజు గద్దెవైపు చెట్ల నీడ పడుతుండటంతో దర్శనం తర్వాత అటుగా వెళ్తున్నారు. అధికారులు స్పందించి ఈ సమస్యను తీర్చాలని భక్తులు కోరుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2023-24 సంవత్సరానికి రిజిస్ట్రేషన్లు జోరుగా సాగాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఆదాయం కొద్దిగా తగ్గినా రిజిస్ట్రేషన్ దస్తావేజుల సంఖ్య మాత్రం తగ్గలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 1,09,892 దస్తావేజులకు గాను రూ.335.01 కోట్ల ఆదాయం లభించింది. గత సంవత్సరం రూ.350 కోట్లు ఆదాయం సమకూరింది.
మానుకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మండిపడ్డ ఆయన.. బీఆర్ఎస్‌ను వీడిన వారు KCRపై బురద చల్లడం సరికాదని మండి పడ్డారు. కడియం దళితులపై లేని పోని కుట్రలు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఆదేశిస్తే వరంగల్ ఎంపీగా పోటీ చేస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడియం పార్టీ మారడం సరికాదన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రారు.. కానీ అర్ధఎకరం కోసమైతే వస్తారని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి విమర్శించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ రైతు పక్షపాతి అని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కాంగ్రెస్ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, కాంగ్రెస్‌కు వస్తున్న ప్రజాదరణను ఓర్వలేకనే ఇతర పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు.
వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేసవి వడగాల్పులు, వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి సోమవారం జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రానున్న 2 నెలల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని..ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగుజాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గోడప్రతులను ఆవిష్కరించారు.
దేవరుప్పుల మండలంలో కేసీఆర్ పర్యటన విడ్డూరంగా ఉందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. కేసీఆర్ పర్యటించిన పొలంలో వరుసగా నాలుగు బోర్లు వేయడం అనుమానంగా ఉందని, బీఆర్ఎస్ నాయకులు గతంలో చూసిన పొలాలు మళ్ళీ చూడటం హాస్యాస్పదం అన్నారు. కేసీఆర్ పర్యటన అంతా స్క్రిప్టెడ్ అని ఆరోపించారు. కావాలనే నీటి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నారు.
ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇంతేజార్గంజ్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. తమ్మిశెట్టి తిరుపతి(22) ఆటో నడుపుకుంటూ దేశాయిపేట ఎన్పీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకున్నాడు. ఇంటికి వచ్చిన తల్లి.. అతడి చూసి స్థానికుల సాయంతో ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
గోవిందరావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(14) ఆత్మహత్య చేసుకుంది. పస్రా ఎస్ఐ కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలికను చల్వాయి గ్రామానికి చెందిన చింటు ప్రేమ పేరుతో వేధిస్తూ, పెళ్లి చేసుకోవాలని ఇబ్బందులకు గురి చేశాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన బాలిక గురువారం పురుగు మందు తాగింది. గుర్తించిన కుటుంబ సభ్యులు ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
వివాహితపై అత్యాచారయత్నం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లబెల్లి మండలంలోని ఓ గ్రామంలో మహిళ తన ఇంటి వెనకాల ఉన్న బాత్‌రూంలోకి వెళ్లారు. ఓ వ్యక్తి ఇదే అదునుగా భావించి మహిళపై అత్యాచారయత్నం చేశాడు. మహిళ కేకలు వేయడంతో అక్కడ నుంచి పారిపోయాడు. మహిళ పరిస్థితి విషమంగా మారడంతో ఎంజీఎంలో చేర్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామారావు తెలిపారు.
Sorry, no posts matched your criteria.