India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు పున:ప్రారంభం కానుంది. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచిధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ తోపాటు ఆయన అనుచరులపై భద్రాచల పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శనివారం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన సీతారాం నాయక్ నిబంధనలకు విరుద్ధంగా ఆలయంలోని గర్భగుడిలో ఫోటోలు దిగారు. అప్పటితో ఆగకుండా సోషల్ మీడియాలో గర్భగుడి ఫొటోలతో ప్రచురించటం పట్ల భక్తులు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు.
జనగామ జిల్లాలో విషాదం నెలకొంది. బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. కొడకండ్ల మండలంలోని హక్యాతండా సమీపంలో ఓ బైక్ అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వెంకన్న అనే వ్యక్తి తీవ్రగాయాలయ్యాయి. ఆయనను వాహనదారులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న కొడకండ్ల పోలీసులు వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేశారు.
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మచ్చాపుర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. నర్సంపేట పట్టణానికి చెందిన ప్రభాకర్, శామ్యూల్ శనివారం రాత్రి బైక్‌పై వరంగల్‌కు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఎడ్ల బండిని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మహదేవపూర్ మండలం బెగ్లూర్ గ్రామానికి చెందిన మల్లయ్య అనే వ్యక్తిని హత్యాయత్నం ఘటనలో శనివారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ ప్రసాద్ వెల్లడించారు. అదే గ్రామానికి చెందిన కారు పోచయ్యపై పాత కక్షలతో కారు మల్లయ్య కత్తితో దాడి చేసినట్లు పేర్కొన్నారు. బాధితుడి భార్య దుర్గమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, దర్యాప్తు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
హనుమకొండలోని రెడ్డి కుంట చెరువులో పింగిలి ఇంజినీరింగ్ విద్యార్థి నాగరాజు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు కుంటలో మునిగి చనిపోయాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని నాగరాజు డెడ్ బాడీని వెతికి తీశామని అగ్నిమాపక ఫైర్ ఆఫీసర్ తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం మృతదేహాన్ని పోలీసు వారికి అప్పగించామన్నారు.
కేసీఆర్ నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఎండిపోయిన పంటల పరిశీలనలో భాగంగా నేడు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం దరవాత్‌తండాకు రానున్నారు. ఉదయం ఎర్రవల్లి నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా ఉదయం 10.30కు దరవాత్ తండాకు చేరుకుంటారు. అక్కడ పంటలను పరిశీలించిన అనంతరం సూర్యాపేట జిల్లాకు వెళ్తారు. కేసీఆర్ పర్యటనకు బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేస్తున్నారు.
దుగ్గొండి మండలం మైసంపల్లిలో సుప్రియ హత్య ఘటనలో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నర్సంపేటలోని రూరల్ పోలీస్ స్టేషన్ లో ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ రవీందర్ వెల్లడించారు. ములుగుకు చెందిన శశికాంత్, అజ్మీర శిరీష సహజీవనం చేస్తున్నారు. వీరి విషయం తెలిసిన మృతురాలు సుప్రియతో శిరీష గొడవ పడింది. ఈనెల 23న సుప్రియను కొట్టి హత్యచేసి బంగారం, వెండిని తీసుకొని పరారయ్యారని తెలిపారు.
కడియం శ్రీహరి ఒక అవకాశవాదని, ఆనాడు ఎన్టీఆర్‌కు.. ఈనాడు కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కడియం ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో లేడని, కేసీఆర్‌ను నమ్మి ప్రజలు ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పార్టీకి నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు. ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి కారును శనివారం పోలీసులు తనిఖీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్‌లో భాగంగా జాఫర్‌గడ్‌లో చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే అటుగా వెళ్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనాన్ని ఆపిన పోలీసులు తనిఖీ చేశారు. అధికారులకు ఆయన పూర్తి సహకారం అందించినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.