Warangal

News March 29, 2024

ఉమ్మడి WGL జిల్లాలో జోరుగా బెట్టింగ్!

image

ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల యవత బెట్టింగులకు అలవాటు పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం IPL సీజన్ కావడంతో మహదేవపురం, కాటారంతో పాటు.. పలు చోట్ల ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లో భారీగా బెట్టింగ్ పెడుతున్నారు. వచ్చిన లాభాలను సైతం బెట్టింగ్‌కు మళ్లిస్తున్నారు. ఇటీవల కాటారం మండలంలో ఓ వ్యక్తి బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడి రూ.లక్షల్లో నష్టపోయాడు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

News March 29, 2024

యశస్విని రెడ్డి గెలుపు.. తిరుపతికి సైకిల్‌ యాత్ర

image

పాలకుర్తిలో కాంగ్రెస్ విజయం పొందిన సందర్భంగా ఓ కార్యకర్త తిరుపతికి సైకిల్ యాత్రగా బయలుదేరాడు. పాలకుర్తి మండలం తీగారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు బైకాని ఐలేశ్ శుక్రవారం తిరుపతి దేవస్థానానికి సైకిల్ యాత్ర చేపట్టారు. ఎమ్మెల్యే యశస్విని కొబ్బరి కాయ కొట్టి యాత్రను ప్రారంభించారు.

News March 29, 2024

నెల వ్యవధిలో ఉమ్మడి జిల్లాలో మారిన రాజకీయాలు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. నెలరోజుల వ్యవధిలోనే BRS కీలక నేతలు పార్టీ వీడటంతో KCRకి ఊహించని షాకులు తగులుతున్నాయి. మాజీ MLA ఆరూరి రమేష్, మాజీ ఎంపీ సీతారాం నాయక్‌లు BJPలో చేరగా.. వరంగల్ ఎంపీ దయాకర్, DCCB ఛైర్మన్ మార్నెని రవీందర్, పలువురు MPPలు కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు MLA కడియం, ఆయన కుమార్తె కావ్యలు సైతం పార్టీని వీడుతుండటంతో BRSకు కోలుకోని దెబ్బ తగిలింది.

News March 29, 2024

నేను పార్టీ మారడం లేదు: మహబూబాబాద్ ఎంపీ కవిత

image

మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత పార్టీ మారుతున్నట్లు వస్తున్న వదంతులపై స్పందించారు. తాను బీఆర్ఎస్‌ని వీడుతున్నట్లు ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పార్టీ మారడం లేదని, కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానని కవిత అన్నారు. తనపై నమ్మకంతోనే మళ్లీ మహబూబాబాద్ ఎంపీ టికెట్ కేసీఆర్ కేటాయించారని చెప్పారు.

News March 29, 2024

కాంగ్రెస్ వరంగల్ లోక్‌సభ టికెట్ ఎవరికి..?

image

వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ఆ స్థానం అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది. ఈ స్థానం నుంచి పలువురు పోటీ పడుతుండగా టికెట్ ఎవరికి వస్తుందో అని ఆసక్తి నెలకొంది. సీనియర్ నాయకుడు దొమ్మాటి సాంబయ్య, పరంజ్యోతి, BRS నుంచి కాంగ్రెస్‌లో చేరిన ప్రస్తుత ఎంపీ పసునూరి దయాకర్, అలాగే త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్న కడియం శ్రీహరి కూతురు కావ్య సైతం పోటీలో ఉన్నట్లు సమాచారం.

News March 29, 2024

వరంగల్: మంటలు ఆర్పే క్రమంలో సీఐ, హోంగార్డుకి అస్వస్థత

image

వరంగల్ జకోటియా కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మంటలు ఆర్పే క్రమంలో మట్టెవాడ సీఐ తుమ్మ గోపి ఊపిరి ఆడక అస్వస్థతకు గురయ్యారు. ఫైర్ హోంగార్డు గిరికి కూడా చేయి కాలిపోగా.. ఇద్దరిని 108 సహాయంతో ఎంజీఎంకు తరలించారు. చికిత్స అనంతరం వారికి ఎలాంటి ప్రమాదం లేదని, ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వైద్యులు తెలిపారు.

News March 29, 2024

బీఆర్ఎస్‌కు కడియం ఫ్యామిలీ ఝలక్!

image

కడియం ఫ్యామిలీ బీఆర్ఎస్‌కి ఝలక్ ఇచ్చారు. 6 నెలల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోతుందని ఆరోపించిన కడియం శ్రీహరి నేడో, రేపో కాంగ్రెస్‌లో చేరుతుండటంతో నియోజకవర్గంలో కారు ఢీలా పడినట్లే అని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే 3 రోజుల క్రితం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన కడియం కావ్య.. ఒక్కసారిగా తన మనసు మార్చుకుని కారు గుర్తుపై కూడా పోటీ చేయనంటూ ప్రకటించడం సంచలనంగా మారింది.

News March 29, 2024

జనగామ: రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలి దుర్మరణం

image

తరిగొప్పుల కేజీబీవీలో సైన్స్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న అరుణ జ్యోతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. అరుణ జ్యోతి రోజూ వారి విధుల్లో భాగంగా తన భర్త బైకుపై గురువారం ఉదయం జనగామ నుంచి పాఠశాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గుంటూరుపల్లి స్టేజి వద్ద బైకు అదుపుతప్పి కిందపడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. చికిత్స కోసం HYDకు తరలిస్తున్న క్రమంలో మృతి చెందినట్లు చెప్పారు.

News March 28, 2024

తాడ్వాయి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

image

తాడ్వాయి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏటూరు నాగారం వైపు వెళ్లే జాతీయ రహదారిపై తాడ్వాయి దాటిన అనంతరం పెద్ద మోరి మూలమలుపు వద్ద బైకు గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతిచెందగా.. మరోవ్యక్తికి తీవ్ర గాయాలపరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 28, 2024

గూడూరు: లారీ, బైక్ ఢీ.. ఇద్దరు మృతి

image

లారీ, బైక్ ఢీకొని ఇద్దరు మృతిచెందిన సంఘటన గూడూరు మండలం మాచర్ల గ్రామసమీపంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ వైపు వెళ్తున్న బైక్‌కు వెనుకాల నుంచి అతివేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.