Warangal

News March 28, 2024

మహబూబాబాద్: విద్యుత్తు షాక్‌తో రైతు మృతి

image

విద్యుత్తుషాక్‌తో వ్యక్తి మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో జరిగింది. మదనపురం గ్రామశివారు ధూపతండాకు చెందిన మాలోతు బాలు గురువారం నీళ్లు పెట్టడానికి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్‌కు గురై బావిలో పడి ప్రాణాలొదిలాడు. స్థానికులు మృతదేహాన్ని వెలికితీశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 28, 2024

డోర్నకల్: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

image

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన సీరోలు మండలం మోద్గులగడ్డ తండాలో చోటుచేసుకొంది. డోర్నకల్ SI సంతోష్ రావు వివరాల ప్రకారం.. వ్యవసాయ భూమిలో బోర్ వేసే విషయంలో గుగులోతు రాజేశ్వరి(34) భర్త వంశీ, అతని సోదరుడి మధ్య వివాదం జరిగింది. ఈ విషయం పై ఇంట్లో రాజేశ్వరి, వంశీ దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన రాజేశ్వరి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

News March 28, 2024

వరంగల్: మళ్లీ తగ్గిన పత్తి ధర 

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో ఈరోజు క్వింటా పత్తి రూ.7200 ధర పలికింది. అయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు ధర తగ్గడంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు. మంగళవారం పత్తి ధర రూ.7,170 పలకగా.. బుధవారం రూ.7,310కి చేరింది. ఈరోజు మళ్ళీ తగ్గింది. రేపటినుండి మార్కెట్‌కు వరుస సెలవులు రానుండడంతో ఈరోజు పత్తి తరలివస్తోంది.

News March 28, 2024

WGL: ఈయన సంకల్పం ముందు అంగవైకల్యం ఓడిపోయింది!

image

సంకల్పానికి అంగవైకల్యం అడ్డు కాదని నిరూపించాడు WGL జిల్లా రాయపర్తికి చెందిన ఓ యువకుడు. బంధనపల్లికి చెందిన రాంజీనాయక్ పుట్టుకతోనే దివ్యాంగుడు. క్రికెట్‌పై ఉన్న మక్కువతో రెండు కాళ్లు పనిచేయకున్నా జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ప్రస్తుతం డీసీసీఐ బోర్డు సభ్యుడు, తెలంగాణ టీం కోర్ కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. కాగా, దివ్యాంగులకు ఉత్తమ అవకాశాలను కల్పించడమే తన లక్ష్యమని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

News March 28, 2024

WGL: అదృశ్యమయ్యాడు.. శవమై కనిపించాడు

image

అదృశ్యమైన ఓ యువకుడు బావిలో శవమై తేలిన ఘటన KNR జిల్లా తిమ్మాపూర్‌లో జరిగింది. CI స్వామి వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా కాటారం మండలానికి చెందిన అభిలాశ్(20) తిమ్మాపూర్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో డిప్లొమా చేస్తున్నాడు. అయితే ఈనెల 1న రాత్రి అభిలాశ్ అదృశ్యమయ్యాడు. బుధవారం సాయంత్రం కుళ్లిన స్థితిలో ఓ వ్యవసాయ బావిలో మృతదేహం కనిపించగా.. ఫోన్, దుస్తుల ఆధారంగా అభిలాశ్‌గా పోలీసులు గుర్తించారు.

News March 28, 2024

కాటారం: చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి

image

కాటారం మండలంలోని సుందర్ రాజ్ పేటకు చెందిన విద్యార్థిని అక్షయ(15) చికిత్స పొందుతూ మృతి చెందింది. SI అభినవ్ వివరాల ప్రకారం.. ఈనెల 19న అక్షయ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదో తరగతి పరీక్ష రాసేందుకు ఆమె తండ్రి ప్రవీణ్‌తో కలిసి, బైక్ పై వెళ్తోంది. ఈ క్రమంలో మద్దులపల్లి సమీపంలో బైక్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. అక్షయ తలకు తీవ్ర గాయాలు కాగా.. ఎంజీఎంలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.

News March 28, 2024

WOW.. మీ ఇంటి నుంచే వాతావరణ సమాచారం తెలుసుకోండి!

image

ప్రతి చోటా వాతావరణంం.. ఇంటింటికీ వాతావరణం పేరుతో భారత వాతావరణ విభాగం(IMD) ‘పంచాయత్ సేవా మౌసం యాప్‌’ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా నేరుగా ఇంటి నుంచే వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ సేవలు 12 భాషల్లో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. ఎండల తీవ్రత, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు, వడగాల్పులు పెరగనుండటంతో దీని ద్వారా ముందస్తుగా సమాచారం తెలుసుకోవచ్చు. కాగా, ఈ యాప్‌ను ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.

News March 28, 2024

అమెరికాలో బచ్చన్నపేట మండల వాసి మృతి

image

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం వీఎస్ఆర్ నగర్‌కు చెందిన ఓ యువకుడు అమెరికాలో గుండె పోటుతో మృతిచెందాడు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. చిట్టోజు మదనాచారి, ప్రమీల దంపతుల కుమారుడు మహేశ్.. ఏడాదిన్నర క్రితం ఉద్యోగ రీత్యా అమెరికాలోని జార్జియాకు వెళ్లాడు. ఈక్రమంలో ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురికాగా.. ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. కాగా, మృతదేహం గ్రామానికి రావడానికి 5 రోజుల సమయం పడుతుంది.

News March 28, 2024

సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న అఘోరా

image

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మలను అఘోరా  దర్శించుకున్నారు. బుధవారం మేడారం గిరిజన ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మలను తమిళనాడుకు చెందిన అఘోరా.. కాలికా ఉపాసకుడు .. శివ విభూషణరావు దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా వనదేవతలకు ఇష్టమైన పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

News March 28, 2024

సురక్ష సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్న ఐజి 

image

హన్మకొండ జిల్లా కాజిపేట్‌లోని ఆర్పీఎఫ్ పోలీస్ కార్యాలయంలో బుధవారం ఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బందికి సురక్ష సమ్మేళన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్పీఎఫ్ ఐజి & PCSC, SCR-అరోమా సింగ్ ఠాకూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఆర్పీఎఫ్ హాస్పిటల్‌ని సందర్శించారు. సమన్యాయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్పిఎఫ్ సిఐ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.