India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆకు రాలే కాలం వచ్చిందంటే అడవుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లుతోంది. 20 రోజుల వ్యవధిలోనే 20 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. చత్తీస్‌గఢ్ గడ్చిరోలిలో 13 మంది మృతి చెందగా.. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు చనిపోయారు. తాజాగా శనివారం తెలంగాణ సరిహద్దు పూజారికాంకేర్ కర్రిగుట్టల(ములుగు జిల్లా) అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
ఐనవోలు మల్లికార్జునస్వామి అలయంలో ఆదివారం పెద్దపట్నంను వైభవంగా నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలి రానుండడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలోనే అత్యంత పెద్దపట్నం వేస్తున్నట్లు ఈవో అద్దంకి నాగేశ్వర్ రావు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా 100 మంది పోలీసులతో భద్రత నిర్వహిస్తున్నట్లు పర్వతగిరి సీఐ శ్రీనివాస్ తెలిపారు.
నిట్ వరంగల్‌లో నిర్వహిస్తున్న వసంతోత్సవ వేడుకల్లో శనివారం రెండో రోజు కల్చరల్ ఫెస్ట్ కలర్ ఫుల్‌గా నిలిచింది. విద్యార్థులు ఉత్సాహంగా 35కు పైగా ఈవెంట్లలో పాల్గొన్నారు. కాగా మూడు రోజుల వసంతోత్సవ వేడుకలు ఆదివారంతో ముగియనున్నాయి. ముగింపు కార్యక్రమానికి సీతారామం సినిమా డైరెక్టర్ హను రాఘవపూడి, హీరో నవదీప్ హాజరు కానున్నారు.
హనుమకొండలోని పెద్దమ్మగడ్డ ఎస్సారెస్పీ కెనాల్ కట్ట పైన ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
లభ్యమయిందని హనుమకొండ పోలీస్‌స్టేషన్ సీఐ సతీశ్ తెలిపారు. పూర్తి వివరాల కోసం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని అన్నారు.
భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు బీకే, ఏఎస్ఆర్ కమిటీ ఆజాద్ పేరుతో ములుగు జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం సృష్టిస్తుంది. బూటకపు ఎన్‌కౌంటర్లకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ములుగు జిల్లా ఎస్పీ కనుసనల్లోనే ఈ ఎన్‌కౌంటర్ల పరంపర కొనసాగుతోందన్నారు. పూజార్ కాంకేర్ మృతులకు లాల్ సలాం అంటూ లేఖలో పేర్కొన్నారు. ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతో ములుగు ఎస్పీ ఎన్‌కౌంటర్లకు పాల్పడ్డాడని లేఖలో వివరించారు.
విద్యుత్తు పనులు చేస్తుండగా షాక్‌తో వ్యక్తి మృతిచెందిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో జరిగింది. తీగారం గ్రామానికి చెందిన బైకాని శ్రీశైలం శనివారం ముత్తారం గ్రామశివారులో విద్యుత్తు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీశైలం ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్‌తో మరణించాడు. ఇతను వల్మిడిలో విద్యుత్తు కట్టర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తొర్రూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో మహిళ పనిచేస్తుండగా.. అందులో సెక్రటరీగా పనిచేస్తున్న వెలుగు మురళి వ్యక్తి ఆమెను వేధిస్తున్నాడని పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కొన్నిరోజులుగా మహిళపై మనసుపడ్డానని మురళి ఆమెను వేధించేవాడు. తాజాగా అవి ఎక్కువవడంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో మురళిపై SC, ST కేసు నమోదు చేసినట్లు ఎస్సై జగదీశ్ తెలిపారు.
ములుగు జిల్లా-చతీస్‌ఘడ్ సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య శనివారం తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతదేహాలతో పాటు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్ ములుగు జిల్లా పరిధిలోని తెలంగాణ బార్డర్‌లో జరిగింది.
మారుమూల ప్రాంతంలో పుట్టి ఫెన్సింగ్ అంతర్జాతీయ క్రీడల్లో రాణిస్తోంది కాటారం మండల కేంద్రానికి చెదిన దేవరకొండ దీక్షిత. ప్రస్తుతం HYD స్పోర్ట్స్ స్కూల్‌లో ఇంటర్ చదువుతూ.. పంజాబ్‌లోని పటియాలలో ఫెన్సింగ్ క్రీడలో శిక్షణ పొందుతున్నారు. అంతేకాదు, పారిస్‌లో జరిగిన విదేశీ శిక్షణకు ఎంపికై గత డిసెంబర్లో 15రోజుల పాటు శిక్షణ పూర్తి చేశారు. దేశం తరఫున ఆడి బంగారు పతకం సాధించడమే తన లక్ష్యమని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని భీమునిపాదం జలపాతం వద్ద పర్యాటకులను ఆకట్టుకునేలా వివిధ సొబగులను దిద్దుతున్నారు. రూ.40లక్షల వ్యయంతో జలపాతం ఎదురుగా వాచ్ టవర్, 14 బల్లాలను, బండరాళ్లతో నడక దారి పనులు చేస్తున్నారు. వంటలు చేసుకునేలా గదులు, బోరు, దుస్తులు మార్చుకునే గదులను ఏర్పాటు చేశారు. పర్యాటకుల భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
Sorry, no posts matched your criteria.