Warangal

News October 15, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్

image

> WGL: కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య
> MHBD: ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య
> WGL: గడ్డి మందు తాగి యువకుడు మృతి!
> HNK: బెంబేలెత్తిస్తున్న వీధి కుక్కలు
> MHBD: పిడుగుపాటుకు గురై మూడు ఆవులు మృతి
> TRR: బైకును ఢీ-కొట్టిన బోర్ వెల్ లారీ.. వ్యక్తి మృతి

News October 14, 2024

నరకాసుర వధ వేడుకకు ఆహ్వానించిన ఉత్సవ కమిటీ

image

వరంగల్ నగరంలోని ఉర్సు గుట్ట వద్ద ఈనెల 30న దీపావళి పండుగ సందర్భంగా నరకాసుర వధను నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. ఈ మేరకు సోమవారం వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదను అతిథిగా హాజరుకావాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మరుపల్ల రవి ఆహ్వానించారు. నగరంలోని ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని కోరారు.

News October 14, 2024

నిరుద్యోగ వికలాంగుల కోసం ప్రత్యేక జాబ్ పోర్టల్: మంత్రి సీతక్క

image

నిరుద్యోగ వికలాంగుల కోసం ప్రభుత్వం ప్రత్యేక జాబ్ పోర్టల్ ఏర్పాటు చేస్తుందని, అక్టోబర్ 25-26 తేదీల్లో హైదరాబాద్‌లో జరుగుతున్న వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం సచివాలయంలో మంత్రి ఛాంబర్లో NPRD తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు.

News October 14, 2024

వరంగల్: కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య

image

కడుపునొప్పి భరించలేక పురుగు మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటుచేసుకుంది. కుటుంబీకుల ప్రకారం.. లెంకాల పెళ్లి గ్రామానికి చెందిన మంజుల కడుపు నొప్పి భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. అపస్మారక స్థితికి చేరుకోవడంతో మంజులను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News October 14, 2024

వరంగల్: కిక్కిరిసిన ట్రెయిన్‌లు, బస్సులు

image

దసరా పండుగకు వివిధ గ్రామాలకు పట్టణాల నుంచి వచ్చిన ప్రజలు తిరుగు ప్రయాణం చేస్తున్నారు. ట్రైన్లు, బస్సులలో కనీసం నిల్చోవడానికి వీలు లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 12861 మహబూబ్‌నగర్ లింక్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో వరంగల్ నుంచి కాచిగూడ మార్గంలో పరిస్థితి దారుణంగా ఉందని వాపోయారు. జనాల రద్దీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముందుగా ఏర్పాట్లు చేయాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

News October 14, 2024

రామప్పను సందర్శించిన స్విట్జర్లాండ్ దేశస్థురాలు

image

ములుగు జిల్లాలో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని ఆదివారం MS.సాండ్ర అనే స్విట్జర్లాండ్ దేశస్థురాలు సందర్శించారు. ఆమెకు డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం అండ్ ఆర్కియాలజీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గైడ్ సాయినాథ్ ఆలయ విశేషాలను, శిల్పకళా నైపుణ్యాన్ని వివరించారు. ఆలయ పరిసర ప్రాంతాలలోని కేన్ మొక్కల గురించి స్థానిక గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ తెలియజేశారు.

News October 13, 2024

కాలేజీలు బంద్ చేస్తే చర్యలు: కేయూ రిజిస్ట్రార్

image

ప్రభుత్వం నుంచి ప్రైవేట్ కళాశాలలకు విడుదలయ్యే ఫీజు రీయంబర్స్‌మెంట్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో రేపటి నుంచి కళాశాలను బంద్ చేస్తామని రిజిస్ట్రార్‌కు ప్రైవేట్ యాజమాన్యాలు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ విశ్వవిద్యాలయ పరిధిలోని ప్రైవేట్ కళాశాలలను నిరవధికంగా బంద్ చేస్తే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ ఆచార్య మల్లారెడ్డి హెచ్చరించారు.

News October 13, 2024

హర్యానా గవర్నర్‌ను కలిసిన మాజీ MLA

image

హైదరాబాద్‌లోని నాంపల్లిలో నిర్వహించిన అలాయ్.. బలాయ్ కార్యక్రమంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ పాల్గొన్నారు. అనంతరం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను మాజీ ఎమ్మెల్యే కలిసి పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు అశోక్ రెడ్డి, ముఖ్య నేతలు, తదితరులు పాల్గొన్నారు.

News October 13, 2024

MHBD: గన్‌తో కాల్చుకొని AR కానిస్టేబుల్ మృతి

image

మహబూబాబాద్ కలెక్టరేట్ లో ఆదివారం దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్న AR కానిస్టేబుల్ శ్రీనివాస్ గన్‌తో కాల్చుకొని మృతి చెందారని తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 13, 2024

వరంగల్: రేపటి నుంచి ఎనుమాముల మార్కెట్ START

image

4 రోజుల వరుస సెలవులు అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ రేపు (సోమవారం) పునఃప్రారంభం కానుంది. ఈనెల 10న దుర్గాష్టమి, 11న మహార్ణవమి, 12న విజయదశమి, వారంతపు యార్డు బంద్, 13న ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్‌ బంద్ ఉంది. దీంతో మార్కెట్ రేపు ప్రారంభం కానుండగా, ఉదయం 6 గంటల నుంచే క్రయవిక్రయాలు ప్రారంభం కానున్నాయి.