India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదే అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ… మద్యం పాలసీ కేసులో అసెంబ్లీ ఎన్నికల ముందు సాక్షిగా ఉన్న కవితను, పార్లమెంటు ఎన్నికలకు ముందు నిందితురాలిగా మార్చడం రాజకీయ కుట్రలో భాగమేనన్నారు. మద్యం పాలసీ కేసులో ఎలాంటి ఆధారాలు లేవన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. నిన్న క్వింటా పత్తి ధర రూ.7,280 పలకగా.. ఈరోజు రూ.7,300 పలికింది. జిల్లాలో విచిత్ర వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తూ సరుకులను మార్కెట్‌కు తీసుకొని రావాలని అధికారులు సూచిస్తున్నారు.
వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి సోమవారం HNK పోలీసులకు ఫిర్యాదు చేసింది. బొక్కలగడ్డ ప్రాంతానికి చెందిన యువకుడు వివాహం చేసుకుంటానని ఓ యువతిని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడు. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేరవుతున్నానని రూ.5 లక్షలను డిజిటల్ పేమెంట్ ద్వారా తీసుకున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోనని బెదిరిస్తుండటంతో యువతి ఫిర్యాదు మేరకు యువకుడిపై అత్యాచారం కేసు నమోదు చేశారు.
RTC డ్రైవర్, కండక్టర్‌పై దాడి చేసిన ప్రయాణికుడిపై కేసు నమోదు చేసినట్లు SI రాజేష్ తెలిపారు. పోలీసుల ప్రకారం.. BHPL నుంచి HNKకు వెళ్తున్న బస్సు ఆత్మకూరు మండలం కొత్తగట్టు స్టేజీ వద్దకు రాగానే WGLకు చెందిన రాజు డోర్ వద్దకు వచ్చి నిల్చున్నాడు. లోపలికి వెళ్లమని డ్రైవర్ చెప్పినా వినకుండా బూతులు తిట్టి కొట్టాడు. మహిళా కండక్టర్‌పై చేయి చేసుకున్నాడు. డ్రైవర్, కండక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
యువతితో బలవంతంగా వ్యభిచారం చేయించేందుకు యత్నించిన ఘటన హసన్పర్తిలో జరిగింది. పోలీసుల ప్రకారం.. గద్వాల జిల్లాకు చెందిన ఓ యువతి టెలీకాలర్ ఉద్యోగం కోసం ఈనెల 10న HYD వచ్చి MGBS బస్టాండ్‌లో వేచి చూస్తోంది. ఈక్రమంలో ఇద్దరు యువకులు ఆమెకు మాయమాటలు చెప్పి తమ ఇంటికి తీసుకెళ్లారు. తిరిగి వంగపహాడ్‌కు తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారం చేయాలంటూ దాడికి పాల్పడ్డారు. ఆమె చాకచక్యంగా తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.
వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే తాను చనిపోతున్నానని ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన HNK జిల్లాలో చోటుచేసుకుంది. KU SI రాజ్‌కుమార్ వివరాల ప్రకారం.. పలివేల్పులకు చెందిన దేవేందర్(28) మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. ఓ వైద్యుడిని గతేడాది సంప్రదించగా.. తానిచ్చిన మందులు 6 నెలలు వాడినా తగ్గలేదు. దీంతో సర్జరీ చేశారు. అయినా తగ్గకపోవడంతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.
నర్మెట్ట మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై కె.శ్రీకాంత్ వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై ముగ్గురు మైనర్ బాలురు జనవరిలో అత్యాచారం చేశారు. అయితే బాధితురాలి తల్లి.. నిందితుల తల్లిదండ్రులతో జరిపిన చర్చలు విఫలమవడంతో సోమవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వర్ధన్నపేట మాజీ MLA ఆరూరి రమేశ్ రాజీనామాతో WGL BRSకు సారథి లేకుండా పోయింది. WGL తూర్పు నియోగజకవర్గంలోని పలువురు కీలక నేతలు, కార్పొరేటర్లు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. మాజీ MLA నరేందర్ సైతం ఎన్నికల అనంతరం స్తబ్దుగా ఉండిపోవడంతో జిల్లాలో సమస్యలు వస్తే చెప్పుకోవడానికి నాయకుడికోసం వారంతా ఎదురు చూస్తున్నారు. దీంతో మాజీ MLAలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి వైపు అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
ములుగు జిల్లాలోని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ( డిఎల్ఎస్ఎ)లో మూడు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆఫీస్ అసిస్టెంట్, రిసెప్షనిస్ట్, ఆఫీస్ ప్యూన్ ఉద్యోగాలకు జిల్లాలోని నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని, ఏదేని డిగ్రీతో పాటు టైపింగ్‌లో అనుభవం ఉండాలన్నారు.
జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన దూల్మిట్ట మండలంలో జరిగింది. మద్దూరు ఎస్సై షేక్ యూనస్ అహ్మద్ అలీ తెలిపిన వివరిలిలా.. కూటిగల్ గ్రామానికి చెందిన తిగుళ్ల రమేశ్ (21) జీవితంపై విరక్తి చెంది వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ దవాఖానాకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఆయన తెలిపారు.
Sorry, no posts matched your criteria.