India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజలింగం కుమారుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. గత పదేళ్లుగా పార్టీ కోసం ఎంతో శ్రమించినా సరైన అవకాశం రాలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. త్వరలో రాజకీయ భవిష్యత్ గురించి వెల్లడిస్తానన్నారు.
పార్లమెంట్ ఎన్నికల ముగిసే వరకు జనగామ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాష ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి ప్రజావాణి కార్యక్రమ తేదీల వివరాలను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత తెలియజేస్తామని తెలిపారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి అర్జీలతో కలెక్టరేట్ కు రావద్దని సూచించారు.
జిల్లాలో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ (కోడ్) ముగిసేంతవరకు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి కార్యక్రమ తేదీల, వివరాలను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వెల్లడించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.
ప్రజావాణి కార్యక్రమాన్ని పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు నిలిపి వేస్తున్నట్లు హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ప్రజావాణి కార్యక్రమాన్ని యథాతథంగా నిర్వహిస్తామన్నారు.
మేడారం మహా జాతర సమయంలో ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో వినియోగించిన పలు రకాల విలువైన వస్తువులు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. జాతర సమయంలో వీవీఐపీలు, వీఐపీలకు భోజనం, తాగునీరు, ఇతర సౌకర్యాల కోసం కొనుగోలు చేసిన వస్తువులు కనిపించడం లేదు. వీటిలో డిన్నర్ సెట్లు, మిక్సీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్, డైనింగ్ సెట్లు తదితర వస్తువులు జాతర ముగిసిన అనంతరం రాత్రికి రాత్రే మాయం కాగా.. దీనిపై విచారణ జరుగుతోంది.
ఉమ్మడి వరంగల్ పరిధిలోని వరంగల్, మానుకోట లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటముల్లో మహిళలే కీలకం కానున్నారు. వరంగల్ పరిధిలోని 7అసెంబ్లీ స్థానాల్లో 18,16,609 ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 8,92,676, మహిళలు 9,23,541, ఇతరులు 392 మంది ఉన్నారు. మహబూబాబాద్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో 15,26,137 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 7,45,716 మంది పురుషులు, 7,80,316 మంది మహిళలు, 105 మంది ఇతరులున్నారు
37 కార్పొరేషన్‌లకు చైర్మన్‌లను నియమిస్తూ ప్రభుత్వం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరిలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రభుత్వం పెద్ద పీట వేసింది. పరకాల – ఇనగాల వెంకట్రామి రెడ్డికి (కుడా చైర్మన్), వరంగల్ పశ్చిమ – జంగా రాఘవ రెడ్డి (ఆయిల్ ఫెడ్ చైర్మన్), మహబూబాబాద్ -బెల్లయ్య నాయక్ (గిరిజన సహకార ఆర్థిక సంస్థ చైర్మన్), భూపాలపల్లి – ప్రకాష్ రెడ్డి (ట్రేడింగ్&ప్రమోషన్ చైర్మన్)గా నియమించారు.
రైలుపై నుంచి కింద పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన జనగామ సమీపంలోని యశ్వంతాపూర్ వాగు వద్ద చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల ప్రకారం.. ఘన్పూర్ మండలం కర్కపల్లికి చెందిన అంబాల వంశీ (21) సికింద్రాబాద్ నుంచి ఖాజీపేట వైపునకు వెళ్లే రైలులో ప్రయాణిస్తుండగా జారి కిందపడి మృతి చెందాడు. మృతదేహం గుర్తుపట్టనంతగా నుజ్జునుజ్జు అయ్యింది.
కాంగ్రెస్ కోసం పని చేసినా అవకాశాలు దక్కని నేతలకు ఆ పార్టీ అధిష్ఠానం గుర్తింపు ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. శాసనసభ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించి నిరాశ చెందిన నేతలకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తోంది. జనగామ మాజీ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డికి ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ & గ్రోవర్స్ ఫెడరేషన్ ఛైర్మన్ పదవిని అప్పగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
వరంగల్ పార్లమెంట్‌కు సంబంధించి బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించింది. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ ఈ స్థానాన్ని ఎంతో కీలకంగా భావించి అభ్యర్థుల ప్రకటన కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. రేపోమాపో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. కాగా ఆరూరి రమేశ్‌కు బీజేపీ నుంచి ఇక్కడ టికెట్ దక్కే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.