Warangal

News May 8, 2024

నేడు వరంగల్‌కు ప్రధాని మోదీ 

image

ఖిలా వరంగల్‌ మండలం తిమ్మాపురం గ్రామం లక్ష్మిపురంలో బుధవారం జరిగే ప్రధాని మోదీ సభ ఏర్పాట్లను బీజేపీ శ్రేణులు పూర్తి చేశారు. ప్రత్యేక హెలికాప్టర్లో వేములవాడ నుంచి ఉదయం 11.05 గంటలకు మోదీ బయలుదేరి 11.45 గంటలకు మామునూర్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.  11.55 బహిరంగ సభ వేదిక పైకి వస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.50 గంటల వరకు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

News May 7, 2024

హన్మకొండకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

image

సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి హన్మకొండకు వచ్చారు. వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా హన్మకొండ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. మంత్రులు సురేఖ, సీతక్క, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తదితరులున్నారు.

News May 7, 2024

BREAKING.. WGL: చెట్టు కూలి యువకుడు మృతి

image

వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వర్ధన్నపేట మండలం కట్ర్యాల వద్ద  జాతీయ రహదారిపై ద్విచక్రవాహనదారుడిపై చెట్టు కూలి వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఇల్లంద గ్రామానికి చెందిన దయాకర్‌(22)గా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన దయాకర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 7, 2024

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రాకేష్ రెడ్డి

image

వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు అధికారులకు రాకేష్ రెడ్డి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తాతా మధు, జనగామ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

News May 7, 2024

WGL: పట్టభద్రుల ఎన్నికకు 22 మంది నామినేషన్

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు నామినేషన్ వేసిన అభ్యర్థుల సంఖ్య 22కు చేరిందని అధికారులు తెలిపారు. ఈనెల 27న పోలింగ్ జరగనుండగా, జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, BRS నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి పోటీ చేస్తుండగా, బిజెపి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.

News May 7, 2024

గుండె పోటుతో మాజీ సర్పంచ్ మృతి.. ఎర్రబెల్లి కంట తడి

image

రాయపర్తి మండలం బంధన్‌పల్లి గ్రామ మాజీ సర్పంచ్ చెవ్వ సంపత్ మంగళవారం గుండెపోటుతో మృతిచెందారు. వారి పార్థివ దేహానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాలవేసి నివాళులర్పించి, కన్నీటి పర్యంతయ్యారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసారు. సంపత్ మృతి పార్టీకి తీరని లోటని అన్నారు.

News May 7, 2024

నర్సంపేట: ఆసుపత్రి ముందు బాధితురాలి నిరసన

image

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఎదుట నేడు పలువురు ఆందోళన చేపట్టారు. తన ప్రమేయం లేకుండా అబార్షన్‌తో పాటు గర్భసంచి తోలగించారంటూ తన బంధువులతో ఆస్పత్రి ప్రధానద్వారం ముందు కూర్చుని బాధితురాలు నిరసన తెలిపింది. ఆస్పత్రి డాక్టర్‌, యాజమాన్యంపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వీరికి విద్యార్ధి సంఘం నేతలు మద్దతు తెలిపారు.

News May 7, 2024

వరంగల్: నిన్నటిలాగే తటస్థంగా పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర నిన్నటిలాగే తటస్థంగా ఉంది. సోమవారం రూ.6,725 పలికిన క్వింటా పత్తి .. ఈరోజు సైతం రూ.6,725 ధరే పలికింది. రైతులు తమ సరుకులను మార్కెట్ తరలించే సమయంలో పత్తిలో తేమ శాతం తక్కువగా ఉండేలా చూసుకుని తమ సరుకులను మార్కెట్‌కు తీసుకురావాలని మార్కెట్ అధికారులు సూచిస్తున్నారు.

News May 7, 2024

అమెరికాలో ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్‌కు మద్దతుగా నినాదాలు

image

మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్ గెలుపును ఆకాంక్షిస్తూ అమెరికా కాలిఫోర్నియా పట్టణంలో పలువురు యువకులు ఫ్లెక్సీతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదల సంక్షేమం గురించి ఆలోచించే నాయకుడు బలరాం నాయక్ అన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బలరాం నాయక్‌ను మహబూబాబాద్ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

News May 7, 2024

వరంగల్ మార్కెట్లో తగ్గిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో సోమవారంతో పోలిస్తే ఈరోజు మిర్చి ధరలు తగ్గాయి. తేజ రకం మిర్చికి నిన్న క్వింటాకు రూ.17,100 పలకగా, ఈరోజు రూ.16,600కు తగ్గింది. 341 రకం మిర్చి నిన్న రూ.16 వేల ధర పలకగా.. ఈరోజు రూ.13,500 పలికింది. వండర్ హాట్(WH) రకం మిర్చి నిన్నటిలాగే రూ.14వేలు, 5531 రకం మిర్చి నిన్నటిలాగే రూ.12 వేల ధర వచ్చింది. నిన్న రూ.35,500 పలికిన టమాటా మిర్చి ధర ఈరోజు రూ.32వేలకు పడిపోయింది.