India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
4 రోజుల వరుస సెలవులు అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రేపు (సోమవారం) పునఃప్రారంభం కానుంది. ఈనెల 10న దుర్గాష్టమి, 11న మహార్ణవమి, 12న విజయదశమి, వారంతపు యార్డు బంద్, 13న ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉంది. దీంతో మార్కెట్ రేపు ప్రారంభం కానుండగా, ఉదయం 6 గంటల నుంచే క్రయవిక్రయాలు ప్రారంభం కానున్నాయి.
భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని రాఘవరెడ్డిపేట -టేకుమట్ల చలివాగులో స్నానానికి వెళ్లిన ఇద్దరు ఆదివారం మృతిచెందారు. మండలంలోని వెల్లంపల్లికి చెందిన సొల్లేటి రాములు(45) గ్రామపంచాయతీ సిబ్బంది, గీస హరీశ్ (25) ఉదయం 10 గంటలకు చలివాగులో స్నానానికి వెళ్లారు. ప్రమాదశావత్తు అందులో మునిగిపోయి మృతిచెందారు. పండుగ తెల్లవారే మరణించడంతో గ్రామంలో తీవ్రవిషాదం నెలకొంది.
భద్రకాళి ఆలయ అర్చకులు శనివారం సాయంత్రం తెప్పోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద పాల్గొన్నారు. అమ్మవారికి సాయంత్రం చెరువులో అర్చకులచే చక్రస్నానం నిర్వహించారు. అనంతరం రాత్రి బద్రేశ్వరులను హంస వాహనంపై ఊరేగించారు. విద్యుత్ దీపాలతో అలంకరించిన హంస వాహనంపై తెప్పోత్సవం (జల క్రీడోత్సవం) కన్నుల పండువగా జరిగింది.
దసరా పండుగ అనగానే పల్లె యాదికొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, దోస్తులను కలిసి ఊరంతా తిరగడం బాగుంటుంది. ‘ఎప్పుడొచ్చినవ్.. అంతా మంచిదేనా’ అంటూ తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి ఊరిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పలు చోట్ల విభిన్నంగానూ చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.
విజయానికి చిహ్నమైన విజయదశమిని జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. జిల్లా ప్రజలకు కలెక్టర్ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దసరా పండుగ రోజున ప్రజలందరూ ఒకరినొకరు కలుసుకొని సుఖసంతోషాలతో శమీ పూజ నిర్వహించి ఐకమత్యంగా పండుగను జరుపుకోవాలన్నారు. సుఖసంతోషాలతో ఉండేలా ఆ దుర్గాదేవి అందరిని ఆశీర్వదించాలని ఆకాంక్షించారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అందు కోసం డాక్టర్లు, సిబ్బంది నిబద్ధతో పని చేయాలని రాష్ర్ట ఆరోగ్యశాఖ సంచాలకులు (డైరెక్టర్) బి.రవీందర్ నాయక్ పేర్కొన్నారు. ఈరోజు హనుమకొండ జిల్లాలోని పోచమ్మకుంట పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలు గురించి ఆరా తీశారు. ఆసుపత్రి పరిధిలో నమోదైన డెంగ్యూ, మలేరియా ఇతర వ్యాధుల గురించి తెలుసుకున్నారు.
జిల్లాలో పండగ పూట రోడ్డు ప్రమాదాలు కుటుంబీకులను కంటతడి పెట్టిస్తున్నాయి. రాయపర్తి మండలం కిష్టపురానికి చెందిన <<14329203>>అన్వేశ్(19), రాజు(24)<<>>, చెన్నారావుపేట(M) ఉప్పరపల్లికి చెందిన <<14330918>>గుల్లపల్లి అఖిల్<<>>, వాజేడు మండలం చెరుకూరుకు చెందిన <<14328812>>భూపతి<<>>.. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేసి కుటుంబాలను రోడ్డున పడేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
WGL,HNK, JN, BHPL, MHBD, MLG జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితా పనిలో నిమగ్నమవగా పోటీ చేయాలనుకునేవారు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.ఇప్పటికే తాము ఎన్నికల్లో గెలవాలంటే ఎలాంటి మేనిఫెస్టో రెడీ చేయాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక మరికొందరు తమ గ్రామంలో ఓటర్ల వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
వరంగల్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన గుల్లపల్లి అఖిల్ శుక్రవారం బైకుపై వరంగల్ నుంచి నర్సంపేట వైపు వెళ్తున్నాడు. డీసీఎం ద్విచక్రవాహనాన్ని ఢీకొనగా అఖిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హనుమకొండ జిల్లా కాజీపేట వెంకటేశ్వర కాలనీలోని రహమత్ నగర్‌లో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దుర్గామాత దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం పాక రాజయ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 100 డాలర్ల నోట్లతో అమ్మవారికి హారం రూపంలో దండ వేశారు.
Sorry, no posts matched your criteria.