Warangal

News October 10, 2024

వరంగల్: బతుకమ్మ వేడుకల్లో అపశృతి

image

వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో విషాదం చోటుచేసుకుంది. అలంకానిపేట గ్రామంలో బతుకమ్మ వేడుకల్లో యాకయ్య అనే వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా యాకయ్య మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. యాకయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News October 10, 2024

HNK: రతన్ టాటా మరణం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రులు..

image

నవభారత నిర్మాత, భారత పారిశ్రామిక రంగానికి మార్గదర్శి, టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా మరణం బాధాకరమని మంత్రులు కొండా సురేఖ, సీతక్క అన్నారు. ఎంతో మందికి ఆదర్శప్రాయుడిగా నిలిచి, భారత సమాజం గర్వించే ప్రపంచ వ్యాపారవేత్తగా రతన్ టాటా నిలిచారని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు మంత్రులు తెలిపారు.

News October 10, 2024

హనుమకొండ జిల్లాలో విషాదం.. ఒకేరోజు తల్లి, కొడుకు మృతి

image

హనుమకొండ జిల్లాలో బుధవారం విషాదం నెలకొంది. వివరాలిలా.. భీమదేవరపల్లి మండలం ములుకనూరుకి చెందిన శోభ(53)కు టీబీ వ్యాధి సోకగా, కుమారుడు సాయికిరణ్(25) క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తల్లి శోభ నిన్న ఉదయం చనిపోగా, సాయికిరణ్ రెండు గంటల్లో చనిపోయాడు. తల్లి, కొడుకు ఒకే రోజు మృతి చెందడంతో ఈ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News October 10, 2024

ఎంపీ విందులో పాల్గొన్న వరంగల్ ఎమ్మెల్యేలు

image

రాజ్యసభ సభ్యులు అభిషేక్ సింగ్ బుధవారం రాత్రి హైదరాబాద్ బంజారాహిల్స్‌లో విందు ఏర్పాటుచేశారు. ఈ విందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. వీరితో కలిసి ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డా. రామచంద్రనాయక్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజులు సైతం పాల్గొని విందు భోజనం చేశారు.కార్యక్రమంలో పలువురు ముఖ్య నేతలు ఉన్నారు.

News October 10, 2024

తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ : మంత్రి సురేఖ

image

బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని మంత్రి కొండా సురేఖ అన్నారు. రేపు సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మంత్రి సురేఖ తెలంగాణ ఆడపడుచులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రంగు రంగుల పూల రూపంలోని ప్రకృతి పట్ల ఆరాధనను, స్త్రీ శక్తిని కొలిచే పండుగగా బతుకమ్మ పండుగకు తెలంగాణ సంస్కృతిలో విశిష్ట స్థానముందన్నారు.

News October 9, 2024

సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క

image

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ అమలు, బీసీ కులగణన అంశాలపై మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అనంతరం వర్గీకరణ అమలు, బీసీ కులగణనకు సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News October 9, 2024

నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీతక్క

image

హైదరాబాదులో డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి సీతక్క పాల్గొన్నారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి సీతక్క జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

News October 9, 2024

వరంగల్: రేపటి నుంచి ఎనుమాముల మార్కెట్‌కు సెలవులు

image

వరంగల్ నగరంలోని ఎనుమాముల మార్కెట్‌కు రేపటి నుంచి నాలుగు రోజులు వరుసగా సెలవులు ప్రకటిస్తున్నామని మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి పి. నిర్మల ఒక ప్రకటనలో తెలిపారు. రేపు దుర్గాష్టమి, ఎల్లుండి మహార్నవమి, 12న విజయదశమి, 13న ఆదివారం సందర్భంగా మార్కెట్ బంద్ ఉంటుందన్నారు. కాబట్టి రైతులు మార్కెట్‌కు రాకూడదని పేర్కొన్నారు. ఈనెల 14న మార్కెట్ పునః ప్రారంభమవుతుందని తెలిపారు.

News October 9, 2024

BHPL: 12వ తేదీన రావణసుర వధ కార్యక్రమం

image

గోరి కొత్తపల్లి మండల కేంద్రంలో స్నేహ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12వ తేదీన రాత్రి 8 గంటలకు రావణాసుర వాద కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు యూత్ అధ్యక్షుడు ఆవుల రాజు తెలిపారు. మండలంలో తొలిసారిగా రావణ వధ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రాజు పిలుపునిచ్చారు.

News October 9, 2024

వరంగల్ మార్కెట్లో పత్తి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పాత పత్తి ధర నిన్నటి లాగే తటస్థంగా ఉంది. మంగళవారం క్వింటా పాత పత్తి రూ.7,450 ధర పలకగా.. నేడు కూడా రూ.7450 పలికినట్లు అధికారులు తెలిపారు. అలాగే కొత్తపత్తి ధర నిన్న రూ.6,960 పలకగా.. నేడు రూ.6,930కి తగ్గినట్లు పేర్కొన్నారు. కాగా, నేడు మార్కెట్‌‌కు పత్తి తరలివచ్చింది.