Warangal

News March 22, 2024

వరంగల్: అన్నదాతకు నిరాశ… తగ్గిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర భారీగా తగ్గింది. గురువారం (నిన్న) క్వింటా పత్తికి రూ.7,315 ధర రాగా.. ఈరోజు (శుక్రవారం) రూ.7250 కి పడిపోయింది. ధర తగ్గడంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. రేపటినుండి మార్కెట్ కు వరుసగా మూడు రోజుల వరుస సెలవులు నేపథ్యంలో ఈరోజు పత్తి తరలివచ్చింది.

News March 22, 2024

వరంగల్‌లో క్రికెట్ క్లబ్

image

వరంగల్ జిల్లా యువతకు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే వరంగల్‌లో క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. జిల్లాలో క్రికెట్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. హెచ్‌సీఏ నిర్ణయంపై వరంగల్ జిల్లా యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 22, 2024

వరంగల్: ఉరేసుకుని వాచ్ మెన్ ఆత్మహత్య

image

హనుమకొండ ఠాణా పరిధి కిషన్ పురలో వాచ్ మెన్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. నడికూడ మండలం చర్లపల్లికి చెందిన రాజేందర్(45) కిషన్ పురలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్ మెన్‌గా పనిచేస్తున్నాడు. వారం క్రితం భార్యాభర్తలమధ్యలో ఘర్షణ జరిగింది. దీంతో రాజేందర్ భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన అతను గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకున్నాడు.

News March 22, 2024

కేసముద్రం: ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెండ్

image

కేసముద్రం పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెండ్ అయ్యారు. ఇటీవల సాంబయ్య, వీరన్న అనే కానిస్టేబుల్స్ ఇసుక లారీ డ్రైవర్‌ను ఘోరంగా కొట్టారు. ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందడంతో ఇద్దరిని సస్పెండ్ చేశారు.

News March 22, 2024

వరంగల్: యువకుడి ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకొని యువకుడు మృతి చెందిన ఘటన రఘునాథపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కార్తీక్ (28) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. పనులు దొరకకపోవడంతో కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులతో గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

News March 22, 2024

వరంగల్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి పై ఉత్కంఠ!

image

కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రకటించిన రెండో జాబితాలో WGL లోక్‌సభ అభ్యర్థి పేరు లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న ఆశావహులు, ఎవరికి వారు టికెట్ తమకే అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఈసారి లోకసభ ఎన్నికల్లో ఆశించిన మేరకు సీట్లు సాధించాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. కాగా, కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్  చేయండి.

News March 21, 2024

జనగామ: ఫుడ్ పాయిజన్‌తో ఐదుగురు విద్యార్థుల అస్వస్థత

image

జనగామ మండలం పెంబర్తిలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ బాలికల గురుకులంలో గురువారం ఫుడ్ పాయిజన్‌తో ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన గురుకులం సిబ్బంది చంపక్ హిల్స్‌లోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పై గురుకుల ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

News March 21, 2024

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన హన్మకొండ ఇన్‌స్పెక్టర్

image

2024 పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో హన్మకొండ పిఎస్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లందరిపై హన్మకొండ పోలీస్ స్టేషన్లో గురువారం సాయంత్రం హన్మకొండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సతీష్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సతీష్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 21, 2024

త్వరలోనే వరంగల్‌లో క్రికెట్ క్లబ్ ఏర్పాటు: HCA అధ్యక్షుడు

image

వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్, హాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం హన్మకొండ ల్యాండ్ మార్క్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్‌లో HYD క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, జాతీయ హ్యాండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి జగన్ మోహన్ రావును సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. HYDతో పాటు WGL జిల్లాలోను క్రికెట్‌ను అభివృద్ధి చేస్తానని తెలిపారు. త్వరలోనే వరంగల్ క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేస్తానని అన్నారు.

News March 21, 2024

మల్లూరు గుట్టపై గుప్త నిధుల తవ్వకాలు

image

మంగపేటలోని మల్లూరు లక్ష్మీనృసింహస్వామి ఆలయం పరిసరాల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్న 10మందిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుట్టపై కొంత కాలంగా అభివృద్ధి పనులు చేస్తున్న ఓ అధికారితో పాటు అతని సహాయకునిగా పనిచేస్తున్న వ్యక్తి, తాడ్వాయి మండలం కాటాపురానికి చెందిన మరో వ్యక్తి, పలు గ్రామాలకు చెందిన 10మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.