India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి మూడు రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి మంగళవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం మిర్చి ధరలు ఎలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకి రూ.19,300 ధర పలకగా.. 341 రకం మిర్చి రూ.16,500, వండర్ హాట్(WH) రకం మిర్చికి రూ.15,500 వచ్చింది. అలాగే 5,531 మిర్చికి రూ.12,500 ధర, టమాటా రకం మిర్చికి రూ.34,000 ధర వచ్చింది. కాగా, టమాటా రకం మిర్చి మినహా అన్ని రకాల ధరలు తగ్గాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో తగ్గుముఖం పట్టిన అటవీ సంపద హరితహారం కార్యక్రమంతో పూర్వ వైభవం సంతరించుకుంటోంది. ఏటా ఉమ్మడి జిల్లాలో 2 కోట్లకు తగ్గకుండా మొక్కలు నాటుతున్నారు. ఈ కార్యక్రమంతో సుమారు 12 శాతానికి అటవీ విస్తీర్ణం పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. జనగామ జిల్లాలో అటవీ విస్తీర్ణం తక్కువగా ఉండడంతో ఈసారి ఏడు కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వరంగల్ పార్లమెంట్ సీటు పరిధిలో 18.16 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా విడుదల చేసిన ఓటర్ల జాబితాలో 8,91,969 మంది పురుషులు, 9,24,250 మంది మహిళలు, థర్డ్ జెండర్లు 395 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నందున 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.
హమాలీ గుమస్తాల సంఘం విజ్ఞప్తి మేరకు వరంగల్ ఎనుమాముల మార్కెట్ బుధవారం బంద్ ఉండగా ఈరోజు ప్రారంభమైంది. నేడు మార్కెట్‌కు పత్తి తరలి రాగా.. ధర మొన్నటి కంటే రూ.15 పెరిగింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,300 పలకగా.. ఈరోజు రూ.7,315 పలికింది. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.
పెండింగులో ఉన్న ప్రభుత్వ పాఠశాలల కుట్టు కూలీ బకాయి నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున కుట్టిన దర్జీల ఛార్జీల చెల్లింపు కోసం ఆరు నెలలుగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారుల ఖాతాల్లో నిధులను జమ చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 2,11,932 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.2.11 కోట్లను విడుదల చేసింది.
రైలు కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామలో బుధవారం జరిగింది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రమణారెడ్డి వివరాల ప్రకారం.. జనగామ రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ ఫారం సమీపంలో 50 ఏళ్ల వయసు ఉండే ఓ వ్యక్తి రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవన్నారు. తెలుపు రంగు చొక్కా, నలుపు రంగు పాయింట్ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు.
ఎంజీఎం ఆసుపత్రి అత్యవసర విభాగంలోని ఎక్స్-రే మూడు రోజుల నుంచి పని చేయడం లేదు. దీంతో టెక్నీషియన్లు తాళం వేశారు. అప్పటి నుంచి అత్యవసర రోగులను ఓపీ విభాగంలోని రేడియాలజీకి తీసుకెళ్లి పరీక్షలు చేస్తున్నారు. ఓపీ రేడియాలజీ విభాగం దూరంగా ఉండటం వల్ల రాత్రి వేళ ప్రమాదంలో గాయపడిన వారికి సత్వర చికిత్స అందడం లేదు. ఈ విషయంపై అధికారులు స్పందించి ఎక్స్-రే యంత్రాన్ని మరమ్మతులు చేయించాలని రోగులు కోరుతున్నారు.
రెండు రోజుల్లో వరంగల్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిపై స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ఈ స్థానానికి ఇద్దరు ప్రముఖ నాయకులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించగా.. కాంగ్రెస్, BJP పెండింగ్‌లో ఉంచాయి. అయితే BJP అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బరిలో ఉండనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
వరంగల్‌లోని పలువురు వైద్యులకు రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ టి.కిరణ్‌కుమార్ షోకాజు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 17న నర్సంపేట రోడ్డులోని ఓ గార్డెన్‌లో జరిగిన RMP, PMPల మహాసభలో పలువురు వైద్యులు జాతీయ, రాష్ట్ర వైద్యమండలి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు.నకిలీ వైద్యులను ప్రోత్సహించేలా వారి అసోసియేషన్‌కు డబ్బులు ఇవ్వడమే కాకుండా, ఆయా ఆసుపత్రుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.