India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వరంగల్ నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పేర్లి సురేష్ బాబు ల్యాప్‌టాప్‌ల కోసం వైర్‌లెస్ ఛార్జర్ ఆవిష్కరించారు. ఈయన నిట్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో పని చేస్తున్నారు. వైర్లు లేకుండా విద్యుత్‌ను సరఫరా చేసే వైట్రిసిటీ పరిజ్ఞానంతో 7 నెలల పాటు శ్రమించి “వైర్ లెస్ ల్యాప్‌టాప్ ఛార్జర్ విత్ కూలింగ్ పాడ్”ను తయారు చేశారు.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మృతదేహం నీటిలో కొట్టుకెళ్తుండగా స్థానిక గొర్రెల కాపర్లు చూసి పోలీసులు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో గల శ్రీ గుంజేడు ముసలమ్మ జాతర నేటి నుంచే ప్రారంభం కానుంది. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా పేరున్న శ్రీ గుంజేడు ముసలమ్మ జాతర నేటి నుంచి మూడు రోజులపాటు ఘనంగా జరగనుంది. ఈ జాతరకు మహబూబాబాద్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి భక్తులు పోటెత్తనున్నారు. ఇప్పటికే జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఈవో బిక్షమాచారి తెలిపారు.

విదేశాల్లో ఎంఎస్, పీహెచ్ఏ కోర్సులు చదివేందుకు నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్‌కు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత విభాగం ప్రకటన జారీ చేసింది. 2024-25 సంవత్సరానికి ఎంపిక కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా పేర్కొన్నారు. www.nosmsje.gov.in అనే వెబ్‌పోర్టల్‌లో ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవావాలని పేర్కొన్నారు.

ప్రైవేటు వసతిగృహంలో ఉంటున్న యువతిపై ఓ నిర్వాహకుడు అత్యాచారం చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. భూపాలపల్లికి చెందిన వ్యక్తి నయీంనగర్‌లో వసతి గృహం నిర్వహిస్తున్నాడు. అందులో ఉండి ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్న యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. పలుమార్లు అత్యాచారం చేశాడు. తీరా మరో మహిళతో పెళ్లి నిశ్చయం కావడంతో.. బాధిత యువతి పెళ్లి గురించి ప్రస్తావించగా కులం పేరుతో దూషించాడు.

మైనర్‌కు బైక్ ఇచ్చినందుకు ఓ తండ్రికి జైలు శిక్ష విధించిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే బాలుడు బైక్ నడుపుతూ పోలీసులకు పట్టుబడటంతో వాహనం సీజ్ చేసి కేసు నమోదుచేశారు. కాగా, బాలుడికి బైక్ ఇచ్చినందుకు తండ్రికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు.

యువతిపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన మంగళవారం లింగాలఘనపురం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకొంది. SI చింత రాజు ప్రకారం.. భువనగిరి జిల్లాకు చెందిన సిద్దారెడ్డి కొన్ని నెలలుగా మండలంలోని ఓ గ్రామంలో తన అక్క వద్దనే ఉంటూ.. పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతి(19)పై మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఐపీసీ 452, 376 ప్రకారం యువకుడిపై కేసు నమోదయింది.

కేయూ పరిధిలో ఎల్ఎల్ఎం మూడో సెమిస్టర్ పరీక్షలు(రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) పరీక్షలు ఈనెల 22 నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య నర్సింహ చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సి హెచ్. రాధిక ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22, 26, 28వ తేదీల్లో మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు (బుధవారం) బంద్ ఉండనుంది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మార్కెట్‌కి ప్రతీ బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు ఇటీవల అధికారులు పేర్కోన్నారు. ఈ క్రమంలోనే రేపు మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు విషయాన్ని గమనించి మార్కెట్‌కి సరుకులు తీసుకొని రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఎల్లుండి గురువారం మార్కెట్ యథాతథంగా ప్రారంభం కానున్నట్లు తెలిపారు.

తెలంగాణలో పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఇందులో ఉమ్మడి WGL జిల్లాకు చెందిన నలుగురికి ఛైర్మన్ పదవులు దక్కాయి. అయితే మంత్రులు కొండా సురేఖ, సీతక్కలు ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు, ములుగు నియోజకవర్గాల నుంచి నేతలెవరికీ నామినేటెడ్ పదవులు దక్కకపోవడం గమనార్హం. పదవుల కోసం పలువురు ప్రయత్నాలు చేసినప్పటికీ వారికి నిరాశే మిగిలింది.
Sorry, no posts matched your criteria.