India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ప్రచారానికి ఒక్క రోజే మిగిలి ఉండటంతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక కొంతమంది తాయిలాలు పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా కొంతమంది అభ్యర్థులు రెండో ప్రాధాన్యత ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా తేజ మిర్చి ధర సోమవారం రూ.13,550 పలకగా.. నేడు రూ.13,800కి చేరింది. అలాగే వండర్ హాట్ (WH) మిర్చి నిన్న రూ.16,200 ధర రాగా ఈరోజు సైతం అదే ధర వచ్చింది. మరోవైపు 341 రకం మిర్చికి నిన్న రూ.12,800 ధర వస్తే.. ఈరోజు రూ.13,400కి పెరిగింది.
మహా శివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు ఆయా బస్టాండ్ల నుంచి శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. వరంగల్ నుంచి ఐనవోలుకు రూ.50, మెట్టుగుట్టకు రూ.50, హనుమకొండ నుంచి వేములవాడకు రూ.210, కాళేశ్వరానికి రూ.250, రామప్పకు రూ.140, పాలకుర్తికి రూ.90, తొర్రూరు నుంచి పాలకుర్తికి రూ.100, మహబూబాబాద్ నుంచి కురవికి రూ.30, జనగామ నుంచి కొమురవెల్లికి రూ.100 టికెట్ ధరలను తీసుకోనున్నారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎవరికి అవకాశం దక్కేనో అనే చర్చ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగుతోంది. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పదవీ కాలం ముగియనుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ఒక ఎమ్మెల్సీ దక్కే అవకాశాలు ఉన్నాయి. తిరిగి సత్యవతి రాథోడ్‌కు అవకాశం ఇస్తారా? లేదా ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రికి అవకాశం ఇస్తారా? అనే విషయంపై ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. కేసీఆర్ నిర్ణయం ఫైనల్ కానుంది.
మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ – హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ నుంచి రామప్ప ఆలయం వరకు 18 సీట్ల ఏసీ మినీ కోచ్ హాఫ్ డే టూర్లను నిర్వహిస్తున్నట్లు టీజీటీడీసీ డిప్యూటీ మేనేజర్ టి.శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 7 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6.45 గంటల వరకు ఉంటుందన్నారు.
ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, అందుకు తప్పనిసరిగా, బాధ్యతగా డబ్బును పొదుపు చేసి ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని కలెక్టర్ డా. సత్య శారద తెలిపారు. ఆర్బీఐ వారోత్సవాల్లో భాగంగా ఆర్థిక క్రమశిక్షణ వారోత్సవాలను నిర్వస్తున్నారు. కలెక్టరేట్‌లో వారోత్సవాల పోస్టర్లను అధికారులతో కలిసి కలెక్టర్ విడుదల చేశారు. ఈ వారోత్సవాలు ఈ నెల 24 నుంచి 28 వరకు మహిళల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఎమ్మెల్సీ పోలింగ్ విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పీఓలు, ఏపీవోలు శిక్షణ తరగతులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 27న చేపట్టే పోలింగ్ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆకళింపు చేసుకొని ఎన్నికల విధులకు సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు పెద్ద ఎత్తున మిర్చి బస్తాలు వచ్చాయి. సుమారు 90 వేల బస్తాలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరంలో అత్యధిక బస్తాలు ఈరోజే వచ్చాయన్నారు. మిర్చి యార్డ్ మొత్తం ఎర్ర బంగారంతో నిండిపోయింది. సాధ్యమైనంత తక్కువ సమయంలో కాంటాలు పెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులకు మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశారు.
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో వరంగల్, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు, హనుమకొండ జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.
రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున:ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో నేడు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.
Sorry, no posts matched your criteria.