India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. MLC ఎన్నికల్లో ఓడిపోతున్నామని కాంగ్రెస్‌కు తెలిసిపోయిందని, ఏ సర్వే చూసినా విజయం BJPదేనని తేల్చడంతో కంగుతిన్న సీఎం రేవంత్ రెడ్డి తానే స్వయంగా ఎన్నికల్లో దిగి పైసలు పంచేందుకు సిద్ధమయ్యారన్నారు. రేవంత్ కాదు కదా…రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా MLC ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదన్నారు.
వరంగల్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. జిల్లాలోని వివిధ మండలాల, గ్రామాల ప్రజలు సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ రావద్దని ఆమె సూచించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లా కేంద్రానికి వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌కు కొత్తవాడలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంటా రవికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెసరు విజయ్ చందర్ రెడ్డి, నేతలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడి పని చేయాలని బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన అన్ని పీజీ కోర్సులకు(రెగ్యులర్, సప్లిమెంటరీ) సంబంధించిన మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 3, 5, 7, 10, 12, 15 తేదీల్లో పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలను మధ్యాహ్నం 2 నుంచి సా.5 గంటల వరకు నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి రాజేందర్ తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
నేడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జిల్లాకు రానున్నారు. నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రానున్నట్లు జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంటా రవికుమార్ తెలిపారు. ఉ.11 గంటల 30 నిమిషాలకు బొల్లికుంట వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించనున్నారు.
శివరాత్రి వేడుకలకు ఓరుగల్లు పెట్టింది పేరు. WGL నగరంలోని వేయి స్తంభాల గుడి, సిద్ధేశ్వరాలయం, మెట్టుగుట్ట సహా పలు దేవాలయాలు భక్తులతో పండుగరోజు నిండిపోతాయి. ఐనవోలు(HNK), రామప్ప(ములుగు), కాళేశ్వరాలయం(BHPL), పాలకుర్తి సోమేశ్వర(జనగామ), కురవి వీరభద్రస్వామి(MHBD) దేవాలయాలు జాగారం ఉన్న శివ భక్తులతో కిటకిటలాడతాయి. రాత్రంతా భక్తుల భజనలు, కీర్తనలతో దద్దరిల్లుతాయి. మీరు ఏ గుడికి వెళ్తున్నారో కామెంట్ చేయండి.
వరంగల్ ఎన్ఎన్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన స్ఫూర్తి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సత్య శారద హాజరయ్యారు. అనంతరం విద్యార్థులతో కలిసి షార్ట్ ఫిలిం వీక్షించారు. వచ్చే 15 ఏళ్లలో ప్రపంచాన్ని శాసించే స్థాయిలో భారత యువత ముందుకు పోతుందన్నారు. పదవ తరగతిలో 9.7 జీపీఏ సాధించే విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారని కలెక్టర్ విద్యార్థులతో హామీ ఇచ్చారు.
వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో దివ్యాంగులకు, వయోవృద్ధులకు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు. దివ్యాంగులు వయోవృద్ధుల నుంచి వినతి పత్రాలను సేకరించారు. వారిచ్చిన ఆర్జీలను పరిశీలించి సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వరంగల్ జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. పలు చోట్ల ఉదయం మంచు కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల ఎండ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అంతేకాదు, చెరువులు, వాగులు, కుంటల్లో సైతం నీరు ఖాళీ అవుతోంది. దీంతో ప్రయాణం సాగించాలంటేనే వృద్ధులు, పిల్లలు జంకుతున్నారు. మరి మీ ప్రాంతంలో ఎండ ప్రభావం ఎలా ఉందో కామెంట్ చేయండి.
వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనులను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజి వాకడే క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కొనసాగుతున్న ఫౌండేషన్, సెల్లార్‌తో పాటు ఎర్త్ వర్క్ ఎక్సవేషన్ పనులను పరిశీలించారు. గడువులోగా పనులను పూర్తి చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.