Warangal

News October 5, 2024

WGL: సమీక్ష నిర్వహించిన మంత్రి కొండా

image

సచివాలయంలోని అటవీ మంత్రిత్వశాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ‘ఎకో టూరిజం’పై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎకో టూరిజం అభివృద్ధిపై కాసేపు అధికారులతో మంత్రి చర్చించారు. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, సీఎం సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, పిసిసిఎఫ్ ఆర్ఎం డోబ్రీయాల్, తదితరులు ఉన్నారు.

News October 5, 2024

WGL: ఒకే ఏడాది.. 3 GOVT JOBS

image

ఒకే సంవత్సరంలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచాడు ఏజెన్సీకి చెందిన యువకుడు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన మాదరపు అశోక్ ఎం.ఏ, బీఈడీ చదివాడు. మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పరీక్షలో ఆరో జోన్‌లో మొదటి ర్యాంకు సాధించాడు. ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్‌కు ఎంపికయ్యాడు. హాస్టల్ వార్డెన్ ఫలితాల్లోనూ ఉద్యోగం సాధించాడు.

News October 5, 2024

WGL: అడవి పందిని చంపిన వారిపై కేసు నమోదు

image

ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామ శివారులోని హనుమాన్ టెంపుల్ సమీప అడవిలో ఇటీవల అడవి పందిని చంపి మాంసం విక్రయిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహించి అడవి పంది మాంసం విక్రయిస్తున్న రమేశ్, భీముడు, సంపత్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ చేసి శనివారం వారికి రూ.50 వేల జరిమానా విధించారు.

News October 5, 2024

స్వగ్రామానికి చేరుకున్న నరేశ్‌రెడ్డి మృతదేహం

image

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెంకు చెందిన కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకుడు నూకల నరేశ్ రెడ్డి మరణాన్ని అధికారికంగా ఆయన కుటుంబసభ్యులు ప్రకటించారు.ఈ నేపథ్యంలో రాత్రి ఒంటి గంటకు ఆయన స్వగ్రామం పురుషోత్తమాయగూడెంకు మృతదేహం చేరుకుంది. ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం 12 గంటల వరకు స్వగృహంలో ఉంచి అనంతరం అంతిమ యాత్ర ప్రారంభం అవుతుందని కుటుంబసభ్యులు తెలిపారు.

News October 5, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> MHBD: జిల్లాలో అర్ధరాత్రి క్షుద్ర పూజల కలకలం
> BHPL: చిట్యాలలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికీ స్వల్ప గాయాలు
> MHBD: పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం
> JN: ప్రైవేటు పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. విద్యార్థులకు అస్వస్థత
> BHPL: రేగొండలో బైకును ఢీ కొట్టిన వ్యాన్.. వ్యక్తికి గాయాలు
> MLG: లారీలతో రోడ్డుపై ప్రజల ఇబ్బందులు
> HNK: సఖి కేంద్ర సేవలపై ప్రజలకు అవగాహన సదస్సు

News October 5, 2024

చంద్రప్రభ వాహనం మీద ఊరేగుతున్న భద్రకాళి అమ్మవారు

image

భద్రకాళి అమ్మవారిని మకర వాహనం మీద గంగాభవానిగా, చంద్రప్రభ వాహనం మీద అమ్మవారిని రాజరాజేశ్వరిగా అలంకరించారు. మకర వాహనం మీద గంగాభవానిగా అమ్మవారిని దర్శించడం వల్ల జలగండాలు దూరమవుతాయని అర్చకులు తెలిపారు. చంద్రప్రభ వాహనం మీద రాజరాజేశ్వరిగా ఊరేగుతున్న అమ్మవారిని దర్శించడం వల్ల సాధకుడు చంచలత్వాన్నివీడి మనస్సు స్థిరమై సాధనలో నిమగ్నమవుతాడని చెప్పారు.

News October 4, 2024

వరంగల్: తగ్గిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు మిర్చి ధరలు తగ్గాయి. వండర్ హాట్(WH) మిర్చికి నిన్న రూ.15,500 ధర రాగా.. నేడు రూ.15వేలకి తగ్గింది. అలాగే తేజమిర్చికి నిన్న రూ.18,500 ధర రాగా నేడు రూ.18వేల ధర వచ్చింది. మరోవైపు 341 రకం మిర్చి రూ.15,800 ధర పలకగా నేడు రూ.15 వేలకు పడిపోయింది.

News October 4, 2024

వరంగల్ మార్కెట్లో స్థిరంగా పత్తి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌‌కి నేడు శుక్రవారం పత్తి భారీగా తరలివచ్చింది. అయితే ధరలు మాత్రం నిన్నటి లాగే తటస్థంగా ఉన్నాయి. గురువారం క్వింటా పాత పత్తి ధర రూ.7,450 ధర పలకగా.. నేడు కూడా అదే ధర పలికింది. అలాగే కొత్తపత్తికి నిన్న రూ.6,925 ధర రాగా నేడు రూ.6,925 అదే ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు.

News October 4, 2024

మలుగు: రోడ్డుపై భారీ కొండచిలువ

image

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం నుంచి కుమ్మరిగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై భారీ కొండచిలువ గురువారం రాత్రి ప్రత్యక్షమైంది. దీంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సుమారు 10 అడుగుల పొడవు ఉందని స్థానికులు తెలిపారు. కాగా ప్రయాణికుల చప్పుడుతో పొదల్లోకి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రయాణికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

News October 3, 2024

వరంగల్: నేడు ఎస్జీటీ అభ్యర్థులకు సర్టిఫికెట్ పరిశీలన

image

వరంగల్ జిల్లా ఎస్జీటీ 1:3 నిష్పత్తిలో భాగంగా గురువారం 271 నుంచి 435 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్ పరిశీలన ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి మామిడి జ్ఞానేశ్వర్ తెలిపారు. నిన్న సర్టిఫికెట్ పరిశీలనకు రాని అభ్యర్థులు.. ఈరోజు కూడా అటెండ్ అవ్వవచ్చన్నారు. అభ్యర్థులు వచ్చే ముందు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు సంబంధిత గెజిటెడ్ సంతకంతో సర్టిఫికెట్లన్నీ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని అన్నారు.