Warangal

News August 15, 2024

17న మహబూబాబాద్ జిల్లా బంద్

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్, హిందూ వాహినితో పాటు పలు సంఘాలు ఈ నెల 17 న బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు మాట్లాడుతూ.. హిందుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందన్నారు. బంద్‌ను సంపూర్ణం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.

News August 15, 2024

హనుమకొండలో ఆన్‌లైన్ బెట్టింగ్.. బుకీ అరెస్ట్

image

ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న బుకీని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HNK గోపాలపూర్ వెంకటేశ్వర కాలనీకి చెందిన M ప్రసాద్ (40) ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగులను జీవనోపాధిగా ఎంచుకున్నాడు. ముంబైకి చెందిన గ్యాంగ్‌లతో పరిచయాలు పెంచుకుని బెట్టింగ్ దందా మొదలుపెట్టాడు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లతో వ్యవహారమంతా నడిపిస్తున్నట్లు తేలడంతో అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.

News August 15, 2024

WGL: కారు బోల్తా.. ముగ్గురికి తీవ్ర గాయాలు

image

కారు బోల్తా పడి దంపతులకు తీవ్ర గాయాలైన ఘటన కేసముద్రంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. తొర్రూరుకు చెందిన దంపతులు, వారి రెండేళ్ల బాబు కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు కారు బోల్తా పడింది. ఈ ఘటనలో దంపతులతో పాటు బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 15, 2024

వరంగల్: ఉప్పలయ్య హోటల్‌కు కేంద్ర ప్రభుత్వ అవార్డు

image

వరంగల్(D) నర్సంపేటలోని ఉప్పలయ్య హోటల్‌కు కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించింది. గత ముప్పై ఏళ్లుగా నడుస్తున్న ఈ హోటల్‌లో 2 నెలల క్రితం మినిస్ట్రీ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్‌ సభ్యులు భోజనం చేశారు. బాగుందని మెచ్చుకొని అభినందించి వెళ్లిపోయారు. అయితే అందరూ చెప్పినట్టే చెప్పారనుకున్నారు.. కానీ ఆగస్టు 12న మళ్లీ వచ్చి హోటల్‌లో ఇదే నాణ్యత కొనసాగించాలంటూ కేంద్ర ప్రభుత్వ అవార్డును అందించారు.

News August 15, 2024

ఉద్యమ జిల్లా.. మన ఓరుగల్లు

image

ఓవైపు దేశం స్వాతంత్ర్యం కోసం పోరాడితే తెలంగాణ ప్రాంతం మాత్రం నిజాం పాలనలో ఉంది. ఆ సమయంలో రజాకార్ల అరాచకాలకు నిప్పు కణికలై ఎదురునిలిచిన ఓరుగల్లు పోరాట యోధులు ఎందరో ఉన్నారు. పరకాల, బైరాన్‌పల్లి, పాలకుర్తి, పెద్దముప్పారం వంటి ప్రాంతాల్లో నాటి తుపాకులకు బెదరకుండా బరిసెలు, రాళ్లతో దాడికిదిగి చివరకు ప్రాణ త్యాగం చేసిన వీరులు కోకొల్లలు. అక్రమ అరెస్టులతో కారాగారంలో మగ్గినా ఉద్యమ స్ఫూర్తిని మాత్రం వదలలేదు.

News August 15, 2024

వరంగల్ మహానగరంలో ఎక్కడ చూసినా త్రివర్ణ శోభ

image

స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ మహానగరం త్రివర్ణ శోభతో వెలుగులీనుతోంది. వరంగల్ రైల్వే స్టేషన్, మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాలు, కూడళ్లలో రంగురంగుల విద్యుద్దీపాల వెలుగులు విరజిమ్ముతున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా రాత్రి వేళలో త్రివర్ణ శోభ కనిపించడంతో చూసిన ప్రతి ఒక్కరు ఆహా అంటున్నారు.

News August 15, 2024

పోలీసు సిబ్బంది సంక్షేమానికి కృషి: సీపీ

image

నిరంతరం విధులు నిర్వర్తిస్తూ సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసు సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తామని వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. కమిషనరేట్ నూతన ఆవరణలోని భవనంలో ఏర్పాటు చేసిన పోలీసు సంక్షేమ కన్సూమర్ స్టోర్స్‌ను బుధవారం సీపీ ప్రారంభించారు. పోలీసు శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి ఇక్కడ మార్కెట్ ధర కంటే కొంత తక్కువకు నిత్యావసర సరకులు, సామగ్రి అందుబాటులో ఉంటాయన్నారు.

News August 15, 2024

తొర్రూరు: అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టివేత

image

అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యాన్ని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల పోలీసులు బుదవారం పట్టుకున్నారు. వివరాల మేరకు.. తొర్రూరు పట్టణ కేంద్రంలోని అంబేత్కర్ థియేటర్ సమీపంలో ఓ ఇంట్లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ చేశారన్న సమాచారం మేరకు తొర్రూరు పోలీసులు దాడులు చేశారు. ఈ దాడులలో 65 బస్తాల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు.

News August 15, 2024

WGL: నాలాల విస్తరణ పెను సవాలే!

image

వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో 10 ప్రధాన నాళాలు ఉన్నాయి. ఏటా వర్షాకాలంలో పలు కాలనీలు నీట మునుగుతున్నాయి. నగరానికి ముప్పు తప్పించేందుకు ప్రణాళిక రచించారు. వరద నీరు పారే నాళాలను విస్తరించాలని సాంకేతిక నిపుణుల కమిటీలు నివేదిక ఇచ్చాయి. విస్తరించేందుకు గ్రేటర్ వరంగల్ సిద్ధమైనా పూర్తి చేయడం యంత్రాంగానికి సవాల్‌గా మారింది. దాదాపు 70-80 శాతం పట్టా భూములే ఉన్నాయి. ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు.

News August 14, 2024

HNK: విద్యుత్ కాంతుల వెలుగుల్లో టౌన్ హాల్

image

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా హనుమకొండ జిల్లా కేంద్రంలోని పబ్లిక్ గార్డెన్ టౌన్ హాల్ విద్యుత్ కాంతుల వెలుగుల్లో మిరుమిట్లు గొలుపుతుంది. మూడు రంగుల జెండాను ఇండికేట్ చేస్తూ టౌన్ హాలును లైట్లతో ముస్తాబు చేశారు. పబ్లిక్ గార్డెన్‌లోని టౌన్ హాల్ వద్ద నగరవాసులు సరదాగా ఫోటోలు దిగుతూ సందడి చేస్తున్నారు.