Warangal

News September 29, 2024

సంతాపం ప్రకటించిన ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు

image

రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తంరెడ్డి మరణం పట్ల ఉమ్మడి జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క సంతాపం వ్యక్తం చేశారు. ఒక గొప్ప రాజకీయ నాయకునిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీర్చిదిద్దిన వారు ధన్యులని మంత్రులు అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని మంత్రులు చెప్పారు.

News September 29, 2024

వృద్ధులు మనకు భారం కాదు.. బాధ్యత: మంత్రి సీతక్క

image

వృద్ధులు మనకు భారం కాదు.. బాధ్యత అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. వృద్ధులను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సీతక్క పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

News September 29, 2024

స్నాతకోత్సవంలో పాల్గొన్న మంత్రి సీతక్క

image

నల్సార్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ జిష్ణు దేవవర్మ, సీఎం రేవంత్ రెడ్డిలతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. అనంతరం పలువురు విద్యార్థులతో మంత్రి సీతక్క మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

News September 28, 2024

తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను సందర్శించిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

image

తపాస్ పల్లి రిజర్వాయర్ ను ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సందర్శించి నీటిని విడుదల చేశారు. రైతుల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, దేశానికి వెన్నెముక రైతు అని అన్నారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

News September 28, 2024

తాపడం పనులను ప్రారంభించాలి: మంత్రి సురేఖ

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులను ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అనుమతినిచ్చారని, వెంటనే పనులు ప్రారంభించాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బంగారు తాపడం పనుల బాధ్యతను M/s స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది. ఈ పనులను బ్రహ్మోత్సవాల నాటికి ముందే 2025 మార్చిలోపే పూర్తిచేయాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు.

News September 28, 2024

రేబీస్ వ్యాధి నివారణకు టీకాలను వేయించండి: కలెక్టర్ ప్రావీణ్య

image

పెంపుడు కుక్కలను పెంచుతున్న యజమానులు వాటికి ప్రతి సంవత్సరం రేబీస్ వ్యాధి నివారణకు తప్పనిసరిగా టీకాలను వేయించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శనివారం వడ్డేపల్లి ప్రాథమిక పశు వైద్య కేంద్రంలో ప్రపంచ రేబిస్ దినోత్సవం పురస్కరించుకొని పెంపుడు కుక్కలకు రేబిస్ వ్యాధి నివారణకు టీకాల కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.

News September 28, 2024

మహబూబాబాద్: ‘నక్సలైట్లమని బెదిరించి రూ.35 వేల చోరీ’

image

మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన వెంకటయ్య అనే వృద్ధుడు ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి చొరబడ్డారు. నక్సలైట్లమని బెదిరించి రూ.35 వేలను ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై ఝాన్సీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

News September 28, 2024

కొండగట్టులో భక్తుల రద్దీ

image

జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కాగా, ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు.

News September 28, 2024

అటవీ అధికారులపై దాడి.. ములుగు SP హెచ్చరిక

image

తాడ్వాయిలో <<14206753>>అటవీ శాఖ అధికారులపై దాడి<<>> కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు ములుగు ఎస్పీ శబరీశ్ తెలిపారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసినా, వారి విధులకు ఆటంకం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. పీడీ యాక్ట్, రౌడీషీట్ సైతం నమోదు చేస్తామన్నారు.

News September 27, 2024

WGL: బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. బిడ్డాలెందరూ కోల్..!

image

తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ బొడ్డెమ్మ… బతుకమ్మ పండుగకు ముందు 9, 5,3 రోజులు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ సంప్రదాయం పాటించే కన్నెపిల్లలు, బాలికలు మట్టితో చేసిన బొడ్డెమ్మలను పెట్టి, పూలతో అలంకరించి చుట్టూ తిరుగుతూ ‘బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్‌.. బిడ్డాలెందరూ కోల్‌’ అంటూ కోలాటం ఆడతారు. మరి మీ గ్రామంలో బొడ్డెమ్మ పండుగ చేస్తే Way2Newsకు ఫొటోలతో వార్త పంపండి.