India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వివిధ రకాల చిరుదాన్యాల ధరలు స్వల్పంగా పెరిగాయి. సూక పల్లికాయ ధర నిన్న రూ.6వేలు పలకగా నేడు రూ.6,100 అయింది. అలాగే పచ్చి పల్లికాయకు నిన్నటిలాగే నేడు రూ.4,400 ధర, 5531 రకం మిర్చికి సైతం నిన్నటిలాగే రూ.14 వేలు వచ్చింది. పసుపుకు నిన్న రూ.12,667 ధర రాగా నేడు రూ.13వేలు వచ్చింది.
ఇటీవల యూరప్‌లో జరిగిన చెస్ ఒలంపియాడ్‌లో బంగారు పతకం సాధించిన హనుమకొండ జిల్లాకు చెందిన ఏరిగేసి అర్జున్ కుమార్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా సన్మానించి అభినందించారు. ప్రపంచ స్థాయిలో తెలంగాణ కీర్తి ప్రతిష్టలను పెంచారని క్రీడాకారులను ఉద్దేశించి సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని పరిపాలన భవనం ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
బాపూజీ లాంటి మహనీయులకు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి సముచిత స్థానం కల్పిస్తున్నారని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి ఎంపీ కావ్య పాల్గొన్నారు. బాపూజీ లాంటి నాయకులు చేసిన పోరాటాల నుండి ప్రతీ ఒక్కరూ స్ఫూర్తి పొందాలని సూచించారు.
ఉమ్మడి వరంగల్‌కు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. టూరిస్ట్ డే సందర్భంగా జిల్లాలోని ప్రాంతాలను ఈరోజు గుర్తు చేసుకుందాం. యునెస్కో గుర్తింపు పొందిన రామప్పతో పాటు వేయిస్తంభాల గుడి, ఖిలా వరంగల్, లక్నవరం, బొగత, పాండవుల గుట్ట, పాకాల, భద్రకాళి ఆలయం, మల్లూరు, భీమునిపాదం మొదలైనవి. అడవులు, కాకతీయులు ఏలిన ప్రాంతం కావడంతో పర్యాటకం వెలుగొందుతోందని చెప్పొచ్చు.మరి మీకు ఎక్కువగా వెళ్లిన ప్రాంతాన్ని కామెంట్ చేయండి.
గత ప్రభుత్వంలో నర్సంపేటకు మంజూరు చేసిన మిర్చి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి శుక్రవారం పెద్ది బహిరంగ లేఖను రాశారు. నర్సంపేటకు మంజూరైన మిర్చి పరిశోధన కేంద్రంపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుతో రైతులకు అనేక లాభాలు ఉన్నాయని తెలిపారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి నిన్నటిలాగే రూ.16,500 ధర పలికింది. అలాగే తేజ మిర్చి గురువారం రూ.18,300 ధర పలకగా నేడు రూ. 19,200కి పెరిగింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి నిన్న రూ.17వేలు ధర రాగా నేడు కూడా అదే ధర వచ్చింది. ధరలు స్వల్పంగా పెరగడంతో రైతన్నలకు ఊరట లభించినట్లు అయింది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈరోజు కొత్త పత్తి భారీగా తరలి వచ్చింది. అయితే ధర మాత్రం గురువారంతో పోలిస్తే నేడు తగ్గింది. నిన్న కొత్త పత్తి క్వింటాకు రూ.7,070 పలకగా నేడు రూ.7,025కి పడిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. పత్తి ధరలు రోజురోజుకూ తగ్గిపోతుండడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయ ఐదేళ్ల LLB (రెండో సెమిస్టర్) పరీక్ష టైం టేబుల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య నరసింహచారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ BSL సౌజన్య విడుదల చేసారు. మొదటి పేపర్ అక్టోబర్ 18న, 2వ పేపర్ అక్టోబర్ 22న, 3వ పేపర్ అక్టోబర్ 24న, 4వ పేపర్ అక్టోబర్ 26న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయన్నారు. వివరాలను విశ్వవిద్యాలయ వెబ్ సైట్లో చూడవచ్చన్నారు.
KU మూడేళ్ల LLB (2వ సెమిస్టర్) & 5 సం.ల (6వ సెమిస్టర్) పరీక్ష టైం టేబుల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య నరసింహ చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సౌజన్య విడుదల చేసారు. మొదటి పేపర్ అక్టోబర్ 17న, 2వ పేపర్ అక్టోబర్ 19న, 3వ పేపర్ అక్టోబర్ 21న, 4వ పేపర్ అక్టోబర్ 23న, 5వ పేపర్ అక్టోబర్ 25న, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల మధ్య జరుగుతాయన్నారు. వివరాలు www.kakatiya.ac.in లో చూడవచ్చన్నారు.
Sorry, no posts matched your criteria.