Warangal

News August 13, 2024

వరంగల్ మార్కెట్ కి తరలివచ్చిన పసుపు, పల్లికాయ

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌లో నేడు క్వింటా సూక పల్లికాయకి రూ.6,250, పచ్చి పల్లికాయకు రూ.4,200 ధర వచ్చింది. అలాగే పసుపు క్వింటా రూ.13,559 ధర, 5531 రకం మిర్చి రూ.11,500 ధర పలికింది. వర్షాకాలం నేపథ్యంలో రైతులు నాణ్యమైన సరుకులు మార్కెట్ కు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని వ్యాపారులు కోరుతున్నారు.

News August 13, 2024

కొత్తగూడ: భార్యాభర్తలపై అడవి పంది దాడి

image

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామంలోని చిన్న తండాలో వ్యవసాయ పనులు చేస్తున్న రైతులపై అడవి పంది దాడికి పాల్పడింది. చిన్న తండాకు చెందిన బానోతు లచ్చు, ఆయన భార్య కౌసల్య మంగళవారం పొలానికి మందు కొడుతున్నారు. సమీప అడవిలో నుండి ఒక అడవి పంది వారిని వెంబడించి దాడికి పాల్పడింది. ఇరువురికి గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించారు.

News August 13, 2024

WGL: మళ్లీ రికార్డు ధర పలుకుతున్న మక్కల ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు మళ్లీ రికార్డు ధర నమోదు చేస్తున్నాయి. 2 నెలల క్రితం వరకు రూ.2,790 పలికిన మక్కలు ధరలు ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టాయి. మళ్లీ వారం రోజులుగా పెరుగుతున్నాయి. సోమవారం క్వింటా మక్కలు ధర రూ.2,745 ధర పలకగా.. నేడు రూ.2,765 ధర పలికాయని అధికారులు తెలిపారు.

News August 13, 2024

ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల కోసం 18 వరకు గడువు

image

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీలో ప్రవేశాల కోసం ఈ నెల 18 వరకు గడువు ఉన్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ సుంకరి జ్యోతి తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థులు డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. www. braou. ac.inలో ఈ నెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News August 13, 2024

WGL: రూ.1,500 పెరిగిన వండర్ హాట్ మిర్చి

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నేటితో పోలిస్తే ఈరోజు వండర్ హాట్ మిర్చి ధర భారీగా పెరిగింది. నిన్న రూ.14,500 పలికిన వండర్ హాట్(WH) మిర్చి నేడు రూ.16 వేలకు పెరిగింది. అలాగే తేజ మిర్చి నిన్నటిలాగే రూ.18,000 పలికింది. 341 రకం మిర్చికి సైతం నిన్నటిలాగే రూ.15,800 ధర వచ్చిందని మార్కెట్ వ్యాపారులు తెలిపారు.

News August 13, 2024

వరంగల్: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర నిన్నటితో పోలిస్తే ఈరోజు స్వల్పంగా పెరిగింది. సోమవారం మార్కెట్‌లో క్వింటా పత్తికి రూ.7,160 ధర రాగా నేడు రూ.20 పెరిగి, రూ.7,180 అయినట్లు మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి మార్కెట్ ధరలలో హెచ్చుతగ్గులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

News August 13, 2024

హనుమకొండ: కాళోజీ కళాక్షేత్రానికి రూ.45 కోట్లు మంజూరు

image

హనుమకొండ జిల్లా కేంద్రంలో ప్రజా కవి కాళోజీ నారాయణరావు స్మారకంగా 2016లో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణానికి పునాదులు పడ్డాయి. కళాక్షేత్ర నిర్మాణానికి రూ.85 కోట్ల అంచనాతో పనులు ప్రారంభం కాగా ‘కూడా’ రూ.40 కోట్లు వెచ్చించింది. సోమవారం రాత్రి మరో రూ.45 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ జీవో జారీ చేసింది. సెప్టెంబర్ 9న సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఉంటుందని కుడా ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు.

News August 13, 2024

నేడు జనగామ బంద్

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, హిందూ వాహినితో పాటు పలు సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం జనగామ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆయా సంఘాల నేతలు మాట్లాడుతూ.. హిందుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ హిందూపై ఉందన్నారు. బంద్‌ను సంపూర్ణం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.

News August 13, 2024

భూపాలపల్లి: తండ్రి మరణాన్ని తట్టుకోలేక కొడుకు హఠాన్మరణం

image

తండ్రి మృతి చెందిన గంటల వ్యవధిలోనే కొడుకు మృతి చెందిన ఘటన భూపాలపల్లి జిల్లాలో జరిగింది.స్థానికులు తెలిపిన వివరాలు.. మహదేవపూర్‌ మండలం పెద్దంపేటకు చెందిన బీసుల పెద్ద లస్మయ్య(62) సోమవారం ఉదయం గుండె పోటుతో మృతి చెందారు. సాయంత్రం ఆయన కొడుకు కృష్ణరాజు(30) తండ్రి మృతిని తట్టుకోలేక గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇద్దరి మృతితో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.

News August 13, 2024

HNK: అనాథలుగా మారిన పిల్లలు!

image

తల్లిదండ్రులను కోల్పోయి ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారు. కమలాపూర్‌‌కు చెందిన మేడిపల్లి నరేశ్, లలిత దంపతులది పేద కుటుంబం. వారికి రుత్విక్, ఆశ్రిత్‌ కుమారులు. లలిత పదేళ్ల కిందటే మృతి చెందగా.. పిల్లల సంరక్షణ నానమ్మ చూసుకునేది. ఆమె రెండేళ్ల కిందట చనిపోవడంతో కూలి పనులు చేస్తూ తండ్రి నరేశ్ వారిని పోషించారు.ఇటీవల నరేశ్ సైతం కన్నుమూయడంతో పిల్లలిద్దరూ అనాథలుగా మారారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.