India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిరుతపులి చర్మం విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్న ఘటన ములుగు జిల్లా వాజేడులో జరిగింది. ఓఎస్డీ గితే మహేశ్ బాబాసాహెబ్ వివరాలు.. ఛత్తీస్‌గఢ్ నుంచి జాడి మహేందర్ అనే వ్యక్తి చిరుతపులి చర్మం అమ్మకానికి వస్తున్నాడని పక్కా సమాచారం వచ్చింది. ఈ మేరకు ఏటూరునాగారం ఏఎస్పీ శివమ్ ఉపాధ్యాయ, ఫారెస్ట్ రేంజర్ చంద్రమౌళి, పోలీసు సిబ్బంది చంద్రుపట్ల క్రాస్ వద్ద అతడిని పట్టుకుని కేసు నమోదు చేశారు.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ(KMC)లో వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వర్తించేందుకు 68 అసిస్టెంట్ ప్రొఫెసర్, 4 సీఏఎస్ ఆర్ఎంఓ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.రాంకుమార్ రెడ్డి తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1.25 లక్షలు, సీఏఎస్ ఆర్ఎంఓకు రూ.52 వేలు వేతనం ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 3 వరకు కాలేజీలో సంప్రదించాలని సూచించారు.
ప్రజలకు సత్వర సేవలు అందించడంలో రాష్ట్ర వ్యాప్తంగా మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తొమ్మిదో స్థానం దక్కింది. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ చేతుల మీదుగా మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ దీపిక అవార్డు అందుకున్నారు. దీపిక మాట్లాడుతూ.. ఈ అవార్డుతో బాధ్యతలు మరింత పెరిగాయన్నారు. అనంతరం వారికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. రూరల్ పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
ప్రముఖ ప్రజాకవి, పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత కాళోజీ నారాయణరావు పేరిట నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రాన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజి వాకడే తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ప్రతీక అని మంత్రి కొండా సురేఖ అన్నారు.
ఐలమ్మ జయంతి సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ తొలి పోరాట యోధురాలుగా చాకలి ఐలమ్మ ధీరచరిత్ర ఎన్నో ప్రజా పోరాటాలకు స్ఫూర్తినిచ్చిందని మంత్రి సురేఖ పేర్కొన్నారు. ఆమె చేసిన భూ-పోరాటమే తర్వాత కాలంలో భూ సంస్కరణలకు దారి చూపిందని స్పష్టం చేశారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం సూక పల్లికాయ ధర రూ.5,840 పలికింది. అలాగే పచ్చి పల్లికాయ రూ.3800 పలికింది. మరోవైపు 5531 రకం మిర్చికి రూ.14 వేలు, పసుపునకు రూ.13,119 వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. కాగా, నిన్నటితో పోలిస్తే ఈరోజు అన్ని రకాల సరుకుల ధరలు తగ్గాయి.
మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌ను పాలకుర్తి MLA యశస్వినిరెడ్డి కలిశారు. తొర్రూరు మున్సిపాలిటీ, పెద్దవంగర, తొర్రూరు, మండలాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలు, ప్రజా సమస్యలు, సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై కాసేపు కలెక్టర్‌తో ఎమ్మెల్యే క్షుణ్ణంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
తాటికొండ-ఘనపూర్ మధ్య బస్సు సర్వీస్ పునరుద్ధరణకై AISF జిల్లా కన్వీనర్ యునుస్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. దీనిపై TGSRTC వెంటనే స్పందించి ఈ అంశాన్ని పరిశీలించాలని DyRM(O)WLకు సూచించింది. బస్సు సర్వీస్ ప్రపోజల్ అంశాన్ని పరిశీలిస్తామని DyRM(O)WL ట్వీట్ చేశారు. ట్వీట్‌కు వెంటనే స్పందించినందుకు గాను ఆర్టీసీ అధికారులకు AISF నేతలు కృతజ్ఞతలు చెప్పారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం రూ.2,590 పలికిన మక్కలు (బిల్టీ) నేడు రూ.2,575కి చేరింది. గత వారం ఊహించని స్థాయిలో రికార్డు ధర పలికిన మక్కలు క్రమంగా పతనమవుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ధరలు పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆయుష్ ఆరోగ్య కేంద్రాల్లో యోగా శిక్షకుల నియామకం చేపడుతున్నట్లు ప్రాంతీయ ఆయుష్ శాఖ ఆర్ డీడీ ప్రమీలాదేవి, ఆయుష్ జిల్లా ఇన్‌ఛార్జి డా.తనుజారాణి తెలిపారు. యోగా టీచర్ల నియామాకానికి ఈ నెల 27న వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో ఉదయం 10 గంటలకు ముఖాముఖి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు ఆయుష్మాన్ ఆర్డీడీ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
Sorry, no posts matched your criteria.